7-సీటర్ ఎస్‌యువి కావాలా.. అయితే ఇవిగో టాప్ 5 కార్లు

ఈ ఆధునిక కాలంలో దూర ప్రయాణాలకు కూడా సులభంగా కుటుంబాలతో ప్రయాణించడానికి చాలా మంది 7-సీటర్ కార్లను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారి కోసం మనం ఈ కథనంలో టాప్-5 7-సీటర్ కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. రండి.

మహీంద్రా ఎక్స్​యూవీ700 (Mahindra XUV700):

మహీంద్రా కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎక్స్​యూవీ700' దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు చేపడుతున్న 7 సీటర్ కారు. ఇప్పటికి కూడా ఈ SUV బుక్ చేసుకున్న వారు కొన్ని వేరియంట్స్ డెలివరీ చేసుకోవడం కోసం కనీసం 2 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే దీనికి మార్కెట్లో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

7-సీటర్ ఎస్‌యువి కావాలా.. ఇవిగో టాప్ 5 కార్లు

మహీంద్రా ఎక్స్​యూవీ700 ధరలు రూ. 15.9 లక్షల నుంచి రూ. 29.77 లక్షల వరకు ఉన్నాయి. ఈ ఆధునిక SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని అందించడానికి రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ కాగా, రెండవది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N):

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మహీంద్రా స్కార్పియో-ఎన్' కూడా 7 సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందిన కార్లుగా పేరు గడించింది. ఈ SUV బుక్ చేసుకున్న కొనుగోలుదారులు కూడా డెలివరీ కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే మార్కెట్లో ఈ SUV కి కూడా విపరీతమైన డిమాండ్ ఉందని అర్థమవుతుంది. ఈ SUV ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎక్స్​యూవీ700 కంటే కొంత పెద్దదిగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్‌ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు Z8L వేరియంట్స్. వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 23.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, రెండవది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

టాటా సఫారి (Tata Safari):

టాటా మోటార్స్ యొక్క 'టాటా సఫారి' (Tata Safari) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మరో 7 సీటర్ SUV. టాటా సఫారి అనేది దాని 5 సీటర్ వేరియంట్ అయిన టాటా హారియర్ నుంచి ప్రేరణ పొందింది. ఈ SUV 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 167.8 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar):

హ్యుందాయ్ కంపెనీ యొక్క 'ఆల్కజార్' SUV కూడా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన 7 సీటర్ కారు. హ్యుందాయ్ ఆల్కాజార్ 6 వేరియంట్లలో అందించబడుతుంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ వంటివి ఉన్నాయి.

అల్కాజార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ (MG Hector Plus):

ఎంజి మోటార్స్ యొక్క 'హెక్టర్ ప్లస్' కూడా 7-సీటర్ విభాగంలో మంచి డిమాండ్ ఉన్న SUV. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పెద్ద ఎయిర్ డ్యామ్ వంటివి ఉన్నాయి. హెక్టర్ ప్లస్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లను పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 141 బిహెచ్‌పి, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 168 బిహెచ్‌పి, 350 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

Most Read Articles

English summary
Top five 7 seater cars in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X