ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

భారతదేశంలో వినాయకచవితి ప్రారంభంతో ఫెస్టివల్ వైబ్స్ ప్రారంభం అయ్యాయి. చాలా మంది రాబోయే నవరాత్రి సీజన్‌లో కొత్త వాహనాలను కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఆ సమయంలో వారికి కొనడం చాలా ప్రత్యేకమైన విషయం మరియు సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. కార్ల తయారీ సంస్థలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ పండుగ సీజన్‌లో కార్లపై ఆఫర్లు, కొత్త కార్లు మరియు స్పెషల్ ఎడిషన్లను ప్రవేశపెడుతుంటారు. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో ఓ చక్కటి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తుంటే, బడ్జెట్ ధరలో (రూ.7 లక్షల లోపు) అందుబాటులో ఉండే మోడళ్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

1. నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)

భారతదేశంలోని నిస్సాన్ బ్రాండ్‌కు ఓ గేమ్-ఛేంజర్‌ మోడల్‌గా నిలిచిన కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite). గతేడాది మార్కెట్లో విడుదలైన ఈ సబ్ 4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్మడవుతోంది. ఈ ఎస్‌యూవీ కోసం వస్తున్న భారీ బుకింగ్స్ కారణంగా దాని వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగా ఉంటోంది. అయినప్పటికీ, ఇది ఈ సెగ్మెంట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో బెస్ట్ బడ్జెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. మార్కెట్లో మాగ్నైట్ ధరలు రూ.5.97 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

స్పోర్టీ డిజైన్ మరియు సరసమైన ధరలే నిస్సాన్ మాగ్నైట్ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ కారులో ఫీచర్లకు కూడా ఏం కొదవ లేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ, ఆటోమేటిక్ ఏసి, వెనుక ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు, 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైనవి ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ న్యాచులర్ మరియు 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లతో లభిస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

2. రెనో కైగర్ (Renault Kiger)

నిస్సాన్ మాగ్నైట్ యొక్క క్లోనింగ్ వెర్షనే రెనో కైగర్. ప్రస్తుతం మారుతి-టొయోటా కంపెనీలు ఒకే ఉత్పత్తిని రెండు వేర్వేరు పేర్లతో ఎలా విక్రయిస్తున్నారో, నిస్సాన్-రెనో కంపెనీలు కూడా ఒకే ఉత్పత్తిని రెండు వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. కాబట్టి, నిస్సాన్ మాగ్నైట్ ఏవిధమైన పనితీరును అందిస్తుందో రెనో కైగర్ కూడా అదే విధమైన పనితీరును అందిస్తుంది. కాకపోతే, ఈ రెండు మోడళ్లు మాత్రం చూడటానికి వేర్వేరుగా కనిపిస్తాయి. మార్కెట్లో రెనో కైగర్ బేస్ 'RXE' వేరియంట్ ధరలు రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

రెనాల్ట్ కైగర్‌లోని ఫీచర్ జాబితా దాదాపు నిస్సాన్ మాగ్నైట్‌లోని ఫీచర్లతో సమానంగా ఉంటుంది. ఈ ఫ్రెంచ్ బ్రాండ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ARKAMYS ఆడియో సిస్టమ్ మరియు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్‌తో పోలిస్తే రెనో కైగర్ కాస్తంత ప్రీమియంగా కనిపిస్తుంది.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రెనో కైగర్ కూడా నిస్సాన్ మాగ్నైట్ మాదిరిగానే అవే ఇంజన్లను పంచుకుంటుంది. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

3. టాటా పంచ్ (Tata Punch)

టాటా మోటార్స్ నుండి లేటెస్ట్‌గా వచ్చిన మోడల్ టాటా పంచ్. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, సేఫ్టీ మరియు ఇతర ఫీచర్ల విషయంలో ఇతర ఎస్‌యూవీల కన్నా మెరుగ్గా ఉంటుంది. క్యూట్ లుకింగ్ డిజైన్ మరియు సరసమైన ధర కారణంగా కస్టమర్లు ఈ టాటా కారును కొనేందుకు క్యూ కడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా పంచ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇది కూడా పంచ్ అమ్మకాలను పెంచడంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం, మార్కెట్లో టాటా పంచ్ ధరలు 5.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

టాటా పంచ్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు 27 కనెక్టెడ్ ఫీచర్లు, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రెండు డ్రైవ్ మోడ్‌లు (ఎకో మరియు సిటీ), క్రూయిజ్ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్, బ్రేక్ స్వే కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

టాటా పంచ్ ప్రస్తుతం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులోని 1.2 లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో తో కూడిన ఏబిఎస్, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైనవి ఉన్నాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

4. మహీంద్రా కెయూవీ 100 ఎన్ఎక్స్‌టి

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అందిస్తున్న ఈ బుజ్జి ఎస్‌యూవీ చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎస్‌‌యూవీలను తయారు చేయడంలో దశాబ్ధాల చరిత్ర కలిగిన మహీంద్రా సంస్థ తయారు చేస్తున్న బడ్జెట్ మోడల్. ధర తక్కువైనప్పటికీ, అందంగా లేకపోయినప్పటికీ ఇది చాలా శక్తివంతమైన ఎస్‌యూవీ. ఇది 6 మంది (3+3) వరకు కూర్చోగలిగే ప్రత్యేకమైన వాహనం. లాంచ్ సమయంలో మోడల్ కొంత విజయాన్ని కనబరిచినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో ఈ మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

ఒకవేళ మీరు ఇందులోని 3+3 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను అదనపు బోనస్‌గా గుర్తించగలిగితే ఇది మీకు బెస్ట్ ఎస్‌యూవీని అని చెప్పొచ్చు. ఈ జాబితాలో ఇది పాత మోడలే అయినప్పటికీ, మహీంద్రా కెయూవీ100 ఎన్ఎక్స్‌టిలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 6-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, టిల్టబుల్ స్టీరింగ్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు వంటి మరెన్నో ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

ఈ పండుగ సీజన్‌లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్‌యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?

ప్రస్తుతం, మహీంద్రా కెయూవీ100 ఎన్ఎక్స్‌టి 1.2-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. మార్కెట్లో మహీంద్రా కెయూవీ100 ఎన్ఎక్స్‌టి బేస్ వేరియం్ 'K2+' 6-సీటర్ ధరలు రూ. 6.02 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

Most Read Articles

English summary
Top four best pocket friendly suvs you can buy under rs 7 lakhs budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X