అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

సాధారణంగా దేశీయ మార్కెట్లో లగ్జరీ కార్లు వినియోగించేవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం లగ్జరీ కార్లు ధరలు అధికంగా ఉండటమే. అయితే భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'టొయోట' (Toyota) కంపెనీ యొక్క 'ఫార్చ్యూనర్' (Fortuner) కంటే కూడా తక్కువా ధరకే లభించే కొన్ని లగ్జరీ కార్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

మొదట టొయోట ఫార్చ్యూనర్ కంటే తక్కువ ధరకే లభించే కార్లను గురించి తెలుసుకునే ముందు ఫార్చ్యూనర్ గురించి కొంత తప్పకుండా తెలుసుకోవాలి. భారతీయ మార్కెట్లో ఈ ఫుల్ సైజ్ ఎస్‌యువి 2008 లో ప్రారంభించినప్పటి నుంచి కూడా 2.5% నుంచి 3% ధరల పెరుగుదల అందుకుంది. అంతే కాకుండా కంపెనీ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు తన మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల టయోటా ఫార్చ్యూనర్‌ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ జిఆర్-ఎస్ విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ మోడల్ ధర రూ. 48.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్ యొక్క 4WD వేరియంట్ కంటే దాదాపు రూ.3.8 లక్షలు ఎక్కువ.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ (Mercedes-Benz GLA):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఏ నిజానికి టయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే కూడా తక్కువ ధరకే లభిస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ (Mercedes-Benz GLA) ధర రూ. 44.90 లక్షల నుండి రూ. 48.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ లగ్జరీ కార్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. అంతే కాకుండా ఇది మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. మొత్తానికి మార్కెట్లో టొయోట కంపెనీ జిఆర్-ఎస్ కంటే కూడా బెంజ్ జిఎల్ఏ తక్కువ ధరకే లభిస్తుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోలిన్ (Mercedes-Benz A-Class Limousine):

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ యొక్క ఏ-క్లాస్ లిమోలిన్ కూడా టయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే కూడా తక్కువే. దీని ధర రూ. 42 లక్షల నుంచి రూ. 44 లక్షల వరకు అందుబాటులో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే తక్కువ ధర వద్ద లభిస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 1.3-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కాగా.. మరొకటి 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. అంతే కాకుండా ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40):

వోల్వో కంపెనీ యొక్క కార్లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందగలిగాయి. దీనికి ప్రధాన కారణం ఇవి ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే. అయితే ఈ వోల్వో ఎక్స్‌సి40 ధర రూ. 44.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర విషయంలో ఇది మనం చెప్పుకుంటున్న టయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే తక్కువ. ఇది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

వోల్వో ఎస్60 (Volvo S60):

వోల్వో కంపెనీ యొక్క ఎస్60 ధర కూడా టయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే తక్కువ. దేశీయ మార్కెట్లో వోల్వో ఎస్60 ధర రూ. రూ. 45.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). వోల్వో ఎస్60 లగ్జరీ కార్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

జీప్ మెరిడియన్ (Jeep Meridian):

అమెరికన్ కార్ తయారీ సంస్థ జీప్ ఇటీవల కాలంలోనే కొత్త మెరిడియన్ ఎస్‌యువి విడుదల చేసింది. దేశీయ విఫణిలో ఈ ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 29.90 లక్షల (ఎక్స్-షోరూమ్). కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 36.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యువి 2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 - 2,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

బిఎండబ్ల్యు ఎక్స్1 (BMW X1):

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యు యొక్క ఎక్స్1 కూడా అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 41.50 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 44.50 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది. ఈ లగ్జరీ కారు ధర కూడా టయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే తక్కువ.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

జాగ్వార్ ఎక్స్ఈ (Jaguar XE):

జాగ్వార్ కంపెనీ యొక్క ఎక్స్ఈ లగ్జరీ కారు ధర రూ. 46.64 లక్షల నుంచి రూ. 48.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఇది టయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. కావున కొనుగోలుదారులు ఈ సెడాన్ ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ లగ్జరీ సెడాన్ ఆధునిక డిజైన్ మరియు ఆధునిక పరికరాలను కలిగి ఉండటమే కాకుండా.. మంచి పనితీరుని అందిస్తుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

ఆడి క్యూ2 (Audi Q2):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన మరో జర్మన్ కార్ తయారీ కంపెనీ ఆడి. కావున ఇందులో మనకు క్యూ2 లగ్జరీ కారు మార్కెట్లో అందుబాటులో ఉన్న టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్‌ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఆడి క్యూ2 ధర రూ. 34.99 లక్షల నుండి రూ. 48.89 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది కూడా ఉత్తమైన పనితీరుని అందిస్తుంది.

అన్నీ లగ్జరీ కార్లే.. ధర మాత్రం 'టొయోట ఫార్చ్యూనర్' కంటే తక్కువ: ఆ కార్లు ఏవో ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తం మీద ఇవి టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్‌ కంటే తక్కువ ధర వద్ద లభించే లగ్జరీ కార్లు. టొయోటా ఫార్చ్యూనర్ జిఆర్-ఎస్‌ కొనుగోలు చేయడానికి ఇష్టపడని కస్టమర్లు ఈ లగ్జరీ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Top luxury cars cheaper than toyota fortuner gr s details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X