2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

సాధారణంగా వాహన కొనుగోలుదారులు ఒక వాహనాన్ని కొనేటప్పుడు ఫీచర్స్, మైలేజ్ వంటి వాటిని మాత్రమే కాదు, అందులో ఎంతవరకు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని కూడా ఆరా తీస్తారు. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలను కొనుగోలు చేయడానికే వారు కూడా ఇష్టపడతారు. కావున వాహన తయారు సంస్థలు కూడా దాదాపుగా తమ వాహనాల్లో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ ఉండే విధంగానే చూసుకుంటారు.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో భారతీయ మార్కెట్లో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర కలిగి అధిక ఫీచర్స్ ఉన్న కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా పంచ్ (Tata Punch):

ఇటీవల దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ విడుదల చేసిన కొత్త 'టాటా పంచ్' అతి తక్కువ కాలంలోనే విపరీతమైన డిమాండ్ పొందింది. ఎందుకంటే ఇది గ్లోబల్-NCAP టెస్ట్ లో మంచి రేటింగ్ పొందింది. కావున ఇది ప్రస్తుతం అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరింది.

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా పంచ్‌లో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 84.48 bhp మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో జతచేయబడి ఉంటుంది. టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

మహీంద్రా XUV300:

మహీంద్రా మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా XUV300 గ్లోబల్-NCAP టెస్ట్ లో అడల్ట్స్ సేఫ్టీలో ఏకంగా 16.42 పాయింట్స్ పొంది, టాటా పంచ్ తరువాత అత్యంత సేఫ్టీ కారుగా నిలిచింది. మహీంద్రా XUV300 ధరలు రూ. 7.95 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

మహీంద్రా XUV300 రెండు ఇంజన్‌ ఆప్సన్ పొందుతుంది. ఇందులోని 1.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ 108.62 bhp మరియు 200 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ప్రామాణికంగా జత చేయబడింది. అదేవిధంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115.05 bhp మరియు 300 Nm టార్క్‌ అందిస్తుంది. డీజిల్ యూనిట్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా ఆల్ట్రోజ్:

టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం దేశంలో అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ లలో ఒకటిగా ఉంది. ఇది గ్లోబల్-NCAP టెస్ట్ లో అడల్ట్స్ సేఫ్టీలో 16.13 పాయింట్స్ పొందిన ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందింది. అదే విధంగా పిల్లల రక్షణలో 4 స్టార్ రేటింగ్ పొందింది. కావున ఇది సురక్షితమైన వాహనంగా విశ్వసిస్తారు.

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా ఆల్ట్రోజ్ మూడు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబటులో ఉంది. అవి 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ వేరియంట్ మరియు 1.5-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ. 5.90 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా నెక్సాన్:

దేశీయ వాహన తయారీ సంస్థ అయినా టాటా మోటార్స్ యొక్క టాటా నెక్సాన్ గ్లోబల్-NCAP టెస్ట్ లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి మేడ్-ఇన్-ఇండియా కారు. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో అత్యధిక సంఖ్యలో విక్రయించబుతోంది.

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ యూనిట్లను కలిగి ఉంటుంది. ఇవి వరుసగా 118 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ మరియు 108 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తాయి. వీటి ధరలు దేశీయ మార్కెట్లో రూ. 7.30 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ పోలో:

భారతీయ మార్కెట్లో 2010 లో తిరిగి ప్రారంభించబడిన ఫోక్స్‌వ్యాగన్ పోలో, ఇప్పటికీ భారతదేశంలో అత్యంత కఠినమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇది గ్లోబల్-NCAP క్రాష్ టెస్ట్‌లో 12.54 పాయింట్లు సాధించడం ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. కావున కంపెనీ యొక్క ఈ మోడల్ కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో ధరలు రూ. 6.16 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా టిగోర్:

టాటా టిగోర్ గ్లోబల్-NCAP నుండి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో దేశంలోని సబ్-4 మీటర్ సెడాన్. టాటా టిగోర్ 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 84.48bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా టాటా టిగోర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. టాటా టిగోర్ ధరలు రూ. 5.67 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

టాటా టియాగో:

టాటా మోటార్స్ యొక్క టాటా టియాగో గ్లోబల్-NCAP నుండి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన దేశంలోని సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. టాటా టియాగో ధరలు రూ. 5.19 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

మారుతి సుజుకి వితారా బ్రెజ్జా:

మారుతి సుజుకి కంపెనీ యొక్క 'మారుతి సుజుకి విటారా బ్రెజ్జా' గ్లోబల్-NCAP ద్వారా అడల్ట్స్ సేఫ్టీలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందింది. ఈ కారణంగా ఈ మోడల్ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా స్మార్ట్-హైబ్రిడ్ టెక్నాలజీలతో సరికొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడింది. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ధరలు రూ. 7.69 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

రెనాల్ట్ ట్రైబర్:

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కంపెనీలో ఒకటి రెనాల్ట్. ఇందులో రెనాల్ట్ ట్రైబర్ ఎక్కువమంది ఇష్టపడే 7 సీటర్ MPV. ఇది సేఫ్టీ పరంగా (అడల్ట్ సేఫ్టీ) 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది.

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

రెనాల్ట్ ట్రైబర్‌లో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 71.01 బిహెచ్‌పి మరియు 96 ఎన్ఎమ్ టార్క్. ఈ పెప్పీ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో జత చేయవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ ధరలు రూ. 5.69 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 సేఫ్టీ కార్స్: పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఎర్టిగా:

మారుతి సుజుకి ఎర్టిగా మార్కెట్‌లో అందుబటులో ఉన్న అత్యుత్తమ MPVలలో ఒకటి. భద్రత పరంగా మారుతి సుజుకి ఎర్టిగా గ్లోబల్-ఎన్‌సిఎపి నుండి 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మారుతి సుజుకి ఎర్టిగా ధరలు రూ. 8.12 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

Most Read Articles

English summary
Top safest cars in india 2022 under 10 lakhs find here all details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X