భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

కార్లలో కెల్లా అతిపెద్ద కారు, బాహుబలి కారు మార్కెట్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏ కారు గురించి చెబుతున్నా అనుకుంటున్నారా? అదేనండి జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా నుండి ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్న లైఫ్ స్టైల్ వాహనం టొయోటా హైలక్ పికప్ (Toyota Hilux Pickup) ట్రక్కు, ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. భారత మార్కెట్లో హైలక్స్ ధరలు రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును కంపెనీ మూడు వేరియంట్లలో విడుదల చేసింది.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

హైలక్స్ మ్యాన్యువల్ స్టాండర్డ్ - రూ.33.99 లక్షలు

హైలక్స్ మ్యాన్యువల్ హై - రూ.35.80 లక్షలు

హైలక్స్ ఆటోమేటిక్ హై - రూ.36.80 లక్షలు

పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా. ఈ మూడు వేరియంట్లు కూడా స్టాండర్డ్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో లభిస్తాయి.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

టొయోటా కొంతకాలం క్రితమే హైలక్స్ పికప్ కోసం బుకింగ్‌ను నిలిపివేసింది, ప్రస్తుతం బుకింగ్స్ ఇంకా పునఃప్రారంభించబడలేదు. హైలక్స్ డెలివరీ గురించి కూడా కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మార్కెట్ సమాచారం ప్రకారం, వచ్చే నెలలో టొయోటా హైలక్స్ డెలివరీలు ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అలాగే, ఈ మోడల్ కోసం వచ్చిన అనూహ్య స్పందన కారణంగా, దీని వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి కంపెనీ ఈ మోడల్ బుకింగ్‌ లనును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

వాస్తవానికి జనవరి 2022 లోనే టొయోటా తమ హైలక్స్ పికప్ ట్రక్కు కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభిచింది. కస్టమర్లు లక్ష రూపాయల టోకెన్ అమౌంట్‌తో ఈ పికప్ ట్రక్కును బుక్ చేసుకున్నారు. కాగా, ఇప్పటి వరకూ ఈ మోడల్ కోసం ఎంత సంఖ్యలో బుకింగ్ లు వచ్చాయనే విషయాన్ని కూడా కంపెనీ ఇంకా తెలుపలేదు. టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును ఐఎమ్‌వి-2 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది భారతదేశంలోనే స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది. టొయోటా హిలక్స్ ఒక డబుల్ క్యాబిన్ 5-సీటర్ పికప్ వాహనం.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

ఇది ట్రెడిషనల్ ఎస్‌యూవీలా మరియు ప్రీమియం లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కుగా ఉంటుంది. వాస్తవానికి, మనదేశంలో పికప్ ట్రక్కులకు పెద్దగా ప్రాచుర్యం లేదు. అమెరికా వంటి దేశాల్లో పికప్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మనదేశంలో పికప్ ట్రక్కులను కేవలం వాణిజ్య ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే, అమెరికాలో మాత్రం వీటిని సాధారణ వాహనాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో, భారతదేశంలో కూడా రెగ్యులర్ పికప్ ట్రెండ్‌ను ప్రారంభించేందుకు టొయోటా తమ హైలక్స్‌ను తీసుకువచ్చింది.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

టొయటా హైలక్స్ పికప్ అద్భుతమైన సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఇది ఇటు సిటీ ప్రయాణాలకు మరియు అటు ఆఫ్-రోడ్ ఉపయోగానికి రెండింటికీ అనువుగా ఉంటుంది. అయితే, కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని డిజైన్ ను గమనిస్తే, ముందు భాగంలో పెద్ద హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు ఇరు వైపులా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ముందు వైపు నుండి ఇది గంభీరంగా కనిపిస్తుంది మరియు టొయోటా ఫార్చ్యూనర్ మాదిరిగానే మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

ఇందులో స్టైలిష్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ మరియు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌ ఉంటుంది. ఇది పికప్‌కు మరింత స్పోర్టీ అప్పీల్‌ని ఇస్తుంది. వెనుక వైపు ఇది నిలువుగా ఉండే టెయిల్ లైట్స్ మరియు క్రోమ్ గార్నిష్‌తో కూడిన బంపర్ ఉంటాయి. వెనుక వైపు పికప్ బెడ్ ఉంటుంది కాబట్టి, దీని రియర్ డిజైన్ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇక ఇందులో ఆఫర్ చేయబోయే ప్రీమియం ఫీచర్లను పరిశీలిస్తే, కంపెనీ ఈ పికప్ ట్రక్కులో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో కూడిన ఇంటీరియర్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మొదలైన వాటిని అందిస్తోంది.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

అంతేకాకుండా, ఈ ప్రీమియం లైఫ్ స్టైల్ యుటిలిటీ పికప్ వాహనంలో పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, జెబిఎల్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, ప్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు A-TRAC అనే యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేక ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ కారులో శక్తివంతమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

ఈ పికప్ వాహనంలో డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి స్టీరింగ్ వీల్‌లో వేరియబుల్ ఫ్లో కంట్రోల్‌ కూడా ఉంటుంది. ఇంకా ఇది 700 మిమీ వాటర్ వేడింగ్ కెపాసిటీని కూడా కలిగి ఉంటుంది. ఈ పికప్ వాహనం కోసం ఇటీవల ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకుంది. టొయోటా హొలక్స్ వీల్‌బేస్‌ 3,085 మిమీ, పొడవు 5,325 మిమీ, వెడల్పు 1,855 మిమీ మరియు ఎత్తు 1,865 మిమీ గా ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మిమీ మరియు దీని బరువు కూడా 2.1 టన్నులుగా ఉంటుంది.

భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ విడుదల.. ఇది కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' !!

టొయోటా హైలక్స్ పికప్ ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెర్ల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ వంటి ఐదు రంగులలో లభిస్తుంది. కంపెనీ ఈ పికప్ వాహనాన్ని 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీతో విక్రయిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించవచ్చు (ఎక్స్‌టెండెడ్ వారంటీ సాయంతో). టొయోటా హైలక్స్ ధర కంపెనీ విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ టొయోటా ఫార్చ్యూనర్ ధర కంటే రూ. 2.47 లక్షలు తక్కువగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఇసుజు వి-మ్యాక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Toyota hilux pickup launched inindia price specs features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X