అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్ ఇటీవల కాలంలోనే భారతీయ మార్కెయిలో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ కొత్త మోడల్ ని ప్రవేశపెట్టిన రోజునుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందగలిగింది. అయితే కంపెనీ ఈ పికప్ ట్రక్కు బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

కొత్త టయోటా హైలక్స్ ట్రక్కుకి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ కంపెనీ బుకింగ్స్ నిలిపివేయడానికి ప్రధాన కారణం అధిక డిమాండ్ మరియు డెలివరీలో ఏదైనా సమస్య తలెత్తుతుందా అనే విషయాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త టయోటా హైలక్స్ పికప్ ట్రక్ 2022 మార్చి నెలలో ప్రారభించబడే అవకాశం ఉంది. ఈ పికప్ ట్రక్ బుకింగ్ ఇప్పటికే డీలర్‌షిప్ వద్ద రూ. 1 లక్ష మరియు కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రూ. 50,000 తో ప్రారంభించబడింది, కానీ ఇప్పుడు ఈ బుకింగ్స్ ప్రక్రియ నిలిపివేసింది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త పికప్ ట్రక్కుకి మంచి ఆదరణ ఉంది. అయితే ఈ మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎక్కువ స్పందన పొందుతుందని ఆశిస్తున్నాము. మా ఉత్పత్తిపై ప్రజలకున్న నమ్మకానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము అన్నారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డెలివరీలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

టయోటా హైలక్స్ ని కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఈ కొత్త వెహికల్ 5-సీటర్ వెహికల్ గా ఉండబోతోంది. ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. డీజిల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఈ వెహికల్ ధర మరియు డెలివరీ వంటి వాటికీ సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబటులో లేదు. కానీ కంపెనీ త్వరలో వీటికి సంబంధించిన సమాచారం వెల్లడిస్తుంది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

కొత్త టయోటా హైలక్స్ మొత్తం 5 కలర్ ఆప్సన్ లో తీసుకురానుంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

టయోటా హైలక్స్ పెద్ద మరియు హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు రెండు వైపులా LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది, దీని కారణంగా ఇది రహదారిపై బలంగా కనిపిస్తుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను పొందుతుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైల్‌ని పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది మొత్తమ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, JBL సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో AC మరియు లెదర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతుంది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అడిషినల్ ఎయిర్‌బ్యాగ్‌లు, LSD మరియు పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును కూడా పొందుతుంది. ఇది A-TRAC (యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్) ఫీచర్లతో వస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా 500 ఎన్ఎమ్ టార్క్‌ అందించే టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి వేరియబుల్ ఫ్లో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌తో పాటు 700 మి.మీ వాటర్ వేడింగ్ కెపాసిటీతో వస్తుంది.

అప్పుడే Hilux బుకింగ్స్ నిలిపివేసిన Toyota: వివరాలు

ఈ ట్రక్ ఇటీవల NCAP టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. కావున ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ వాహనదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ ఇవ్వబడుతుంది, దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించవచ్చు.మొత్తానికి త్వరలోనే ఈ కొత్త పికప్ ట్రక్కు కస్టమర్లను చేరుకుంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota hilux pickup truck booking stopped temporarily know reason details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X