Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

భారతీయ మార్కెట్లో టయోటా (Toyota) తన కొత్త టయోటా హైలక్స్‌ పికప్ ట్రక్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున ఆసక్తిగల కస్టమర్లు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి నుంచి ప్రారంభమవుతాయి.

అయితే ఈ కొత్త టయోటా హైలక్స్‌ పికప్ ట్రక్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్‌ (Isuzu D-Max V-Cross) కి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఈ రెండింటి మధ్య తేడాలేంటి అనే విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

టయోటా హైలక్స్‌ మరియు ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్‌ రెండూ కూడా అద్భుతమైన డిజైన్ పొందుతాయి, అదే సమయంలో ప్రస్తుత తరానికి కావాల్సిన ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

Toyota Hilux Vs Isuzu D-Max V-Cross - పరిమాణం:

కొత్త టయోటా హైలక్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా.. మంచి పరిమాణాన్ని కూడా పొందుతుంది. దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

అదేవిధంగా ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్‌ విషయానికి వస్తే, ఈ పికప్ ట్రక్ పొడవు 5,295 మిమీ, వెడల్పు 1,860 మిమీ మరియు ఎత్తు 1,840 మిమీ వరకు ఉంటుంది. ఇక వీల్‌బేస్ విషయానికి వస్తే 3,095 మిమీ వరకు ఉంటుంది. ఇసుజు యొక్క ఈ పికప్ ట్రక్‌ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 225 మి.మీ వరకు ఉంటుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

ఈ రెండు పికప్‌ ట్రక్కులు కూడా డబుల్ క్యాబ్ బాడీ స్టైల్‌లో అందించబడతాయి. కొత్త టయోటా హైలక్స్ పరిమాణం పరంగా కొంత పొడవుగా ఉంటుంది. కానీ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ వెడల్పు మరియు పొడవు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది కాకుండా, ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ పొడవైన వీల్‌బేస్ మరియు మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా కలిగి ఉంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

Toyota Hilux Vs Isuzu D-Max V-Cross - ఇంజిన్:

టయోటా హైలక్స్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించబడుతుంది. ఇది 204 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులోకి వస్తుంది. ఇది 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ ఎంపికను కూడా పొందుతుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

ఇక ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మాత్రం 1.9-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది, ఇది 163 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉండటమే కాకుండా 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ ఎంపికను కూడా పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

Toyota Hilux Vs Isuzu D-Max V-Cross - ఫీచర్స్:

Toyota Hilux మరియు Isuzu D-Max V-Cross రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ కొత్త మోడల్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ లైట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో పవర్డ్ డ్రైవర్ సీటు, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ మరియు 60:40 వెనుక స్ప్లిట్ సీటును పొందుతాయి. కంఫర్ట్ ఫీచర్స్ లిస్ట్‌లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

Toyota Hilux యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త Toyota Hilux 7 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్-అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌లను పొందుతుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

Isuzu D-Max V-Cross బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది, అంతే కాకూండా, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, కీలెస్ ఎంట్రీ మరియు 60:40 రియర్ స్ప్లిట్ సీటు యొక్క ఫీచర్లు దీని ఇంటీరియర్‌లో అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ ఫీచర్లలో ఆటోమేటిక్ ఏసీ, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డిసెంట్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియీగదారుని భద్రతను నిర్ధరిస్తాయి.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

Toyota Hilux Vs Isuzu D-Max V-Cross - ధర:

టయోటా హైలక్స్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. Isuzu D-Max V-Cross ధర రూ. 19.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ఉంటుంది.

Isuzu D-Max V-Cross కి Toyota Hilux ప్రత్యర్థిగా నిలబడుతుందా.. కంపారిజన్

దీన్ని బట్టి చూస్తే Isuzu D-Max V-Cross కంటే కూడా Toyota Hilux ఎక్కువ ధర కలిగి ఉంటుంది. కావున దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది మరియు ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
Toyota hilux vs isuzu d max v cross comparison engine price features details
Story first published: Monday, January 17, 2022, 14:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X