టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ టొయోటా (Toyota) భారత మార్కెట్ కోసం మరో కొత్త హైబ్రిడ్ కారును సిద్ధం చేస్తోంది. ఈసారి ఇది ఎస్‌యూవీ రూపంలో రాబోతోంది. టొయోటా నుండి రాబోయే ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీని హైరైడర్ (Hyryder) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టొయోటా హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ (Toyota Hyryder Hybrid SUV) కి సంబంధించిన ఓ టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. సమాచారం ప్రకారం, ఈ హైబ్రిడ్ కారు జూలై 1, 2022 వ తేదీన ఆవిష్కరించబడే అవకాశం ఉంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) టీజర్ చిత్రాలను గమనిస్తే, కంపెనీ ఈ హైబ్రిడ్ కారు యొక్క ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫ్రంట్ గ్రిల్ మరియు వెనుక టెయిల్ ల్యాంప్‌లను వెల్లడించింది. అంతేకాకుండా, కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ వీడియోలో ఈ ఎస్‌యూవీ యొక్క ముందు భాగం కూడా పాక్షికంగా వెల్లడైంది. ఇదివరకు కొత్త టొయోటా హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కోసం TVC (టెలివిజన్ కమర్షియల్) చిత్రీకరిస్తుండగా దాని స్పై చిత్రాలు లీక్ చేయబడ్డాయి.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

టొయోటా నుండి రాబోయే ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీపై కంపెనీ చాలా ఆశలు పెట్టుకుంది మరియు ఇది కంపెనీకి ఓ గేమ్ ఛేంజర్ మోడల్ గా నిలిచే అవకాశం ఉంది. టొయోటా హైరైడర్ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఓ నివేదిక ప్రకారం, టొయోటా హైరైడర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మారుతి సుజుకి మరియు టొయోటా కంపెనీలు కలిసి భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

ఇరు కంపెనీల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం, మారుతి సుజుకి కూడా ఇదే ఎస్‌యూవీ మరో కొత్త పేరుతో టొయోటా హైరైడర్ కన్నా కాస్తంత విభిన్నమైన డిజైన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ముందుగా టొయోటానే ఈ కారును విడుదల చేయనుంది. టొయోటా ఈ హైబ్రిడ్ కారును 'D22' అనే కోడ్‌నేమ్ తో అభివృద్ధి చేస్తుండగా, మరియు సుజుకి దీనిని 'YFG' అనే కోడ్‌నేమ్ తో అభివృద్ధి చేస్తోంది. బాలెనో-గ్లాంజా, విటారా బ్రెజ్జా-అర్బన్ క్రూయిజర్ మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త హైబ్రిడ్ కారు కూడా ఒకే ప్లాట్‌ఫామ్ మరియు ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉండనుంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

ఇదివరకు లీకైన ఓ పత్రం ప్రకారం, రాబోయే కొత్త టొయోటా హైరైడర్ ఎస్‌యూవీ రెండు రకాల హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్ లను కలిగి ఉందని వెల్లడించింది. అంటే, ఈ కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ రెండు పవర్‌ట్రెయిన్ యూనిట్‌ లలో దేనినైనా ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చని లీక్ అయిన పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు పవర్‌ట్రైన్‌ లు కూడా ఒకే రకమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో రానున్నాయి. అయితే, ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ లలో ఒకటి తేలికపాటి (మైల్డ్) హైబ్రిడ్ యూనిట్ కాగా మరొక పవర్‌ట్రెయిన్ బలమైన (స్ట్రాంగ్) హైబ్రిడ్ యూనిట్ గా ఉంటుంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

లీకైన పత్రాల ద్వారా వెల్లడించిన స్పెసిఫికేషన్ల ప్రకారం, ఇందులోని 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ గరిష్టంగా 101.6 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో లభించే అవకాశం ఉంది. కాగా ఇందులో 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ యూనిట్ కాస్తంత ఎక్కువగా 114.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ప్రత్యేకమైన eCVT గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. దానికి తోడు, ఈ 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ తక్కువ దూరాలను EV మోడ్‌లో కవర్ చేయడానికి అధునాతన సెల్ఫ్-ఛార్జింగ్ సామర్ధ్యంతో వస్తుంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

ఇక ఫీచర్ల విషయానికొస్తే, కొత్త టొయోటా హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ (TC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉండనున్నాయి.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ.. క్రెటా, సెల్టోస్ కథ ముగిసినట్లేనా..?

టొయోటా మరియు మారుతి సుజుకి రెండు బ్రాండ్‌లు ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీని కలిసి అభివృద్ధి చేసినప్పటికీ, టొయోటా యొక్క హైబ్రిడ్ ఎస్‌యూవీ వెర్షన్ ఊహించిన విధంగానే మారుతి సుజుకి వెర్షన్ కంటే కొంచెం ముందుగానే విడుదల చేయబడుతుంది. ఇది టొయోటాకు విక్రయాల పరంగా మారుతి సుజుకి కంటే కొంత అధిక ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, టొయోటా ఈ హైబ్రిడ్ వెర్షన్‌ ను ప్రారంభించడం వలన ఆ బ్రాండ్ షోరూమ్‌కు ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడమే కాకుండా, దాని బ్రాండ్ ఇమేజ్ మరియు గుర్తింపు కూడా మెరుగుపరచుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Toyota hyryder hybrid suv teased for the first time details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X