Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) 2022 మోడల్ సంవత్సరానికి గానూ తమ ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) ఎమ్‌పివిలో రెండు కొత్త బేస్ వేరియంట్‌ లను విడుదల చేసింది. ఈ పాపులర్ ఎమ్‌పివి ఇప్పుడు కేవలం రూ. 16.89 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులో ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన వేరియంట్లలో పెట్రోల్ మ్యాన్యువల్ 7-సీటర్ వేరియంట్ జిఎక్స్ మరియు పెట్రోల్ మ్యాన్యువల్ 8-సీటర్ వేరియంట్ జిఎక్స్ లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 16.89 లక్షలు మరియు రూ. 16.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడ్డాయి.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

ఇదిలా ఉంటే, కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతోనే టొయోటా ధరల వడ్డింపుకు పూనుకుంది. టొయోటా ప్రోడక్ట్ లైనప్ లో ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా, గ్లాంజా, క్యామ్రీ, అర్బన్ క్రూయిజర్ మరియు వెల్‌ఫైర్ మోడళ్లతో సహా అన్ని కార్ల ధరలను పెంచనుంది. ఇన్నోవా క్రిస్టా ధర విషయానికి వస్తే, వేరియంట్ ను బట్టి ఈ మోడల్ ధరలు సుమారు రూ.12,000 నుండి రూ.33,000 వరకు పెరిగాయి. అయితే, ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు కంపెనీ ఇందులో కొత్తగా రెండు పెట్రోల్ బేస్ వేరియంట్లను విడుదల చేసింది.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

కొత్తగా విడుదల చేసిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.16.89 లక్షలు మరియు రూ.16.94 లక్షలుగా ఉంటే, ఇందులో బేస్ వేరియంట్ కు ఎగువన అందించబడే స్టాండర్డ్ జిఎక్స్ మాన్యువల్ 7-సీటర్ మరియు 8-సీటర్ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 17.30 లక్షలు మరియు రూ. 17.35 లక్షలుగా ఉన్నాయి. పాత ధరలతో పోల్చుకుంటే, వీటి ధరలు ఒక్కొక్కటి రూ.12,000 పెంపును అందుకున్నాయి.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

ఇకపోతే, టొయోటా ఇన్నోవా క్రిస్టా VX మాన్యువల్ 7 సీటర్ ధర రూ. 33,000 మేర పెరిగి రూ. 20.59 లక్షలకు చేరుకుంది. ఇన్నోవా డీజిల్ మాన్యువల్ రేంజ్ G MT 7-సీటర్ ప్రస్తుతం రూ.18.18 లక్షలకు చేరుకుంది. ఈ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది. అదే సమయంలో, ఈ ఎమ్‌పివి యొక్క G Plus, GX 7-సీటర్ మరియు 8-సీటర్ వేరియంట్‌ల ధరలు రూ. 12,000 మేర పెరిగాయి. అలాగే, VX మరియు ZX వేరియంట్‌ల ధరలను కూడా కంపెనీ రూ. 33,000 పెంచింది. దీంతో ఇప్పుడు టాప్-ఎండ్ ZX మాన్యువల్ 7-సీటర్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.12 లక్షలకు చేరుకుంది.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

టొయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ ఆటోమేటిక్ శ్రేణి ఇప్పుడు రూ. 12,000 మేర పెరిగి రూ. 18.66 లక్షలకు చేరుకుంది. అలాగే, ఇందులోని టాప్ ఎండ్ ZX ఆటోమేటిక్ 7-సీటర్ వేరియంట్ ధర రూ. 33,000 మేర పెరిగి రూ. 23.47 లక్షలకు చేరుకుంది. ఇన్నోవా డీజిల్ శ్రేణి ఇప్పుడు రూ. 20.42 లక్షలతో ప్రారంభమవుతుంది, దీని ధర రూ. 12,000 మేర పెరిగింది. అలాగే, టాప్-స్పెక్ ZX ఆటోమేటిక్ 7-సీటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 33,000 మేర పెరిగి రూ. 25.32 లక్షలకు పెరిగింది.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే ఇన్నోవా క్రిస్టా ధరలు పెరగడానికి కారణమని కంపెనీ తెలిపింది. ధరల పెరుగదల మినహా ఈ ఎమ్‌పివిలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంతకు ముందు అక్టోబర్ 2021లో కంపెనీ తమ ఇన్నోవా ధరలను పెంచింది. ఆ సమయంలో వేరియంట్ ను బట్టి దీని ధర సుమారు రూ. 36,000 వరకూ పెరిగింది. ఇన్నోవా యొక్క టాప్ వేరియంట్‌లు మాత్రమే అక్టోబర్ 2021 ధర సవరణ నుండి మినహాయించబడ్డాయి. అదే సమయంలో, జపాన్ బ్రాండ్ టొయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పిలో కంపెనీ అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. వీటిలో హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), మల్టీ-టెర్రైన్ మానిటర్, 360 డిగ్రీల కెమెరా, ఎయిర్ అయానైజర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డోర్ ఎడ్జ్ లైటింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జర్‌తో సహా అనేక రకాల ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇన్నోవా కొన్ని వినూత్న సాంకేతికతలతో మెరుగైన పనితీరును కనబరుస్తుందని టొయోటా తెలిపింది. ఇన్నోవా క్రిస్టాలో అందించబడిన ప్రామాణిక ఫీచర్లు ప్రత్యేక కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌ను కూడా కలిగి ఉంటాయి.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

ఇందులో లైవ్ వెహికల్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ మరియు వాక్ టు కార్ స్మార్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ తో కూడిన 8 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఎమ్ఐడి డిస్‌ప్లే మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల; టొయోటా ధరల పెంపు వివరాలు..

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, టొయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్‌లు 2,694 సిసి ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 166 bhp శక్తిని మరియు 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, డీజిల్ వేరియంట్లు 2,393 సిసి డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 150 bhp శక్తిని వద్ద 343 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఎమ్‌పివి 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ మరియు సీక్వెన్షియల్ షిఫ్ట్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Toyota innova crysta mpv gets two new petrol base variants price hike details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X