క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

మారుతి సుజుకి విక్రయిస్తున్న విటారా బ్రెజ్జా (Vitara Brezza) కాంపాక్ట్ ఎస్‌యూవీని అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser) పేరుతో టొయోటా కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. నిజానికి, ఇవి రెండూ వేర్వేరు బాడీ ప్యానెళ్లతో లభించే ఒకే రకం కార్లు. కాగా, తాజాగా టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. గతంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కోసం నిర్వహించిన క్రాష్ టెస్టులో బ్రెజ్జా కూడా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌నే దక్కించుకుంది.

ఈ క్రాష్ టెస్టులో టొయోటా అర్బన్ క్రూయిజర్ పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గానూ 13.52 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్‌గా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. పిల్లల భద్రత విషయానికి వస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ మొత్తం 49 పాయింట్లకు గాను 36.68 పాయింట్లను స్కోర్ చేసింది. పిల్లల సేఫ్టీ విషయంలో మాత్రం ఇది ఐదు స్టార్లకు గానూ 3 స్టార్లు మాత్రమే దక్కించుకుంది.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లు, ముందు సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు చైల్డ్ సీట్‌లను మౌంట్ చేయడానికి ISOFIX యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగిన బేస్ మోడల్ టొయోటా అర్బన్ క్రూయిజర్ ను గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) బృందం ఈ టెస్టింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించింది. ఈ మోడల్‌లో పైన తెలిపిన సేఫ్టీ ఫీచర్లు తప్ప వేరే ఏ అధనపు సేఫ్టీ ఫీచర్లు కూడా లేవు.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

ఈ క్రాష్ టెస్టులో టొయోటా అర్బన్ క్రూయిజర్ ను ముందు వైపు నుండి గరిష్టంగా గంటకు 64 కిలోమీటర్ల వేగంతో క్రాష్ టెస్ట్ చేశారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన ఈ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్ లో టొయోటా అర్బన్ క్రూయిజర్ డ్రైవర్ మరియు ప్రయాణీకుల తలలు మరియు మెడలకు మంచి రక్షణను అందించినట్లు గుర్తించబడింది. అలాగే, ముందు ప్రయాణీకుడి ఛాతీకి మంచి రక్షణ అందించింది. అయితే, ఈ ప్రమాదంలో డ్రైవర్ ఛాతీకి మాత్రం తగిన రక్షణ ఉండబోదని తెలిసింది.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

అంతేకాకుండా, ముందు ప్రయాణీకుల శరీరంలోని కుడి మోకాలికి కూడా మంచి రక్షణను అందించబడలేదని ఈ క్రాష్ టెస్టులో నిర్ధారించబడింది. ఈ విషయంలో రక్షణ అంతంతమాత్రంగానే ఉన్నట్లు గుర్తించబడింది. అర్బన్ క్రూయిజర్ యొక్క డ్రైవర్ మోకాలి ప్రాంతంలో ఇరువైపులా భద్రత కోసం మార్జినల్ రేటింగ్ మాత్రమే లభించింది. అర్బన్ క్రూయిజర్ యొక్క బాడీ షెల్ ఫుట్‌వెల్ వలె స్థిరంగా ఉన్నట్లు రేట్ చేయబడింది. పరీక్షకులు బాడీ షెల్ తదుపరి ప్రభావాలను తట్టుకోగలదని కూడా నిర్ధారించారు.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే, అర్బన్ క్రూయిజర్ లో 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ఫార్వర్డ్ ఫేసింగ్ పొజిషన్‌లో అమర్చబడిన చైల్డ్ సీట్‌లో కూర్చోబెట్టినప్పుడు, ప్రమాద సమయంలో ఇది వారి తల యొక్క కదలికను నిరోధించిందని, అంతేకాకుండా ఇది మెడకు తక్కువ రక్షణను మరియు ఛాతీకి సరసమైన రక్షణను అందించిందని పరీక్షకులు గుర్తించారు. అలాగే, వెనుక బేబీ సీటులో ఉంచిన 18 నెలల పాపాయి తల మరియు ఛాతీ ప్రాంతాలకు మంచి రక్షణను అందిస్తుందని, వారి కాళ్లకు మంచి సేఫ్టీని అందిస్తుందని ఈ క్రాష్ టెస్టులో గుర్తించబడింది.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

టొయోటా అర్బన్ క్రూయిజర్ రీబ్యాడ్జ్ చేయబడిన మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అన్న సంగతి తెలిసినదే. అయితే, రెండు మోడళ్ల సేఫ్టీ రేటింగ్‌ల విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. పెద్దల భద్రత కోసం అర్బన్ క్రూయిజర్ 13.52/17 స్కోర్ చేయగా, విటారా బ్రెజ్జా 12.51/17 పాయింట్లను పొందింది. అర్బన్ క్రూయిజర్ పెద్దల సేఫ్టీలోనే కాకుకండా, పిల్లల సేఫ్టీలో కూడా విటారా బ్రెజ్జా కంటే మెరుగ్గా ఉంటుందని తేలింది. పిల్లల సేఫ్టీలో బ్రెజ్జా 17.93 పాయింట్లను స్కోర్ చేస్తే, అదే అర్బన్ క్రూయిజర్ 36.68 పాయింట్లను స్కోర్ చేసింది.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

టొయోటా అర్భన్ క్రూయిజర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ కావడంతో, ఈ రెండు మోడళ్లలో చాలా వరకు పరికరాలు, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. కాకపోతే, అర్బన్ క్రూయిజర్‌లో చేసిన ప్రధాన మార్పులలో ఎల్‌ఈడి లైటింగ్ ప్యాకేజీ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్ మరియు ఫాగ్ లైట్లను అన్నింటినీ ఎల్ఈడిలతో అందిస్తున్నారు. టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్ కూడా విటారా బ్రెజ్జాలోని ఇంటీరియర్స్ మాదిరిగానే అదే లేఅవుట్‌ను మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, టొయోటా తమ 'స్మార్ట్ ప్లేకాస్ట్'తో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్‌, ఎలక్ట్రోక్రోమిక్ రియర్‌వ్యూ మిర్రర్ మరియు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ కూడా మొదలైనవి చాలానే ఉన్నాయి. సేప్టీ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు కోప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ ఆడియో, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Toyota urban cruiser gets 4 star safety rating in global ncap crash test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X