హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టొయోటా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ "టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్" (Toyota Urban Cruiser Hyryder) యొక్క అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడి చేసింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ధరలను వెల్లడి చేసిన రెండు రోజులకే టొయోటా తమ హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసింది.

వాస్తవానికి, మారుతి సుజుకి కంటే ముందే టొయోటా తమ హైబ్రిడ్ కారు ధరలను వెల్లడి చేసింది. అయితే, ఆ సమయంలో కొన్ని (టాప్-ఎండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్) వేరియంట్ల ధరలను మాత్రమే టొయోటా వెల్లడి చేసింది. కాగా, ఇప్పుడు మారుతి సుజుకి తమ గ్రాండ్ విటారా యొక్క అన్ని వేరియంట్లను వెల్లడించిన తర్వాత, టొయోటా కూడా హైరైడర్ యొక్క అన్ని వేరియంట్ల (మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లను కూడా కలిపి) ధరలను వెల్లడి చేసింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ ధరలు రూ.10.45 లక్షల (సిగ్మా, మ్యాన్యువల్ వేరియంట్) నుండి ప్రారంభమవుతుండగా టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క బేస్ వేరియంట్ (ఇ, మైల్డ్-హైబ్రిడ్) ధరలు రూ.10.48 లక్షలుగా ఉన్నాయి. హైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో కూడిన గ్రాండ్ విటారా టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.05 లక్షలు (ఆల్ఫా వేరియంట్, డ్యూయెల్ టోన్) కాగా, ఇదే సెటప్‌తో కూడిన హైరైడర్ టాప్-ఎండ్ వేరియంట్ (వి, మైల్డ్-హైబ్రిడ్, ఆల్ వీల్ డ్రైవ్) ధర రూ.17.19 లక్షలుగా ఉన్నాయి.

హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

మొత్తమ్మీద చూస్తే, మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో పోలిస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్లు స్వల్ప అధిక ధరను కలిగి ఉన్నాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ E, S, G మరియు V అనే ట్రిమ్‌లలో మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో లభిస్తుంది. ఈ వేరియంట్ల ధరలు రూ.10.48 లక్షల నుండి రూ.17.19 లక్షల మధ్యలో ఉన్నాయి. కాగా, స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ S, G మరియు V అనే మూడు ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. వీటి ధరలు రూ.15.11 లక్షల నుండి రూ.18.99 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

వేరియంట్ల వారీగా టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు ఇలా ఉన్నాయి:

  • హైరైడర్ ఇ మ్యాన్యువల్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.10.48 లక్షలు
  • హైరైడర్ ఎస్ మ్యాన్యువల్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.12.28 లక్షలు
  • హైరైడర్ జి మ్యాన్యువల్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.14.34 లక్షలు
  • హైరైడర్ వి మ్యాన్యువల్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.15.89 లక్షలు
  • హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

    హైరైడర్ ఎస్ ఆటోమేటిక్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.13.48 లక్షలు

    హైరైడర్ జి ఆటోమేటిక్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.15.54 లక్షలు

    హైరైడర్ వి ఆటోమేటిక్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.17.09 లక్షలు

    హైరైడర్ వి మ్యాన్యువల్ ఆల్-వీల్-డ్రైవ్ (మైల్డ్-హైబ్రిడ్) - రూ.17.19 లక్షలు

    హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!
    • హైరైడర్ ఎస్ ఇ-సివిటి (స్ట్రాంగ్-హైబ్రిడ్) - రూ.15.11 లక్షలు
    • హైరైడర్ జి ఇ-సివిటి (స్ట్రాంగ్-హైబ్రిడ్) - రూ.17.49 లక్షలు
    • హైరైడర్ వి ఇ-సివిటి (స్ట్రాంగ్-హైబ్రిడ్) - రూ.18.99 లక్షలు
    • హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

      మారుతి సుజుకి గ్రాండ్ విటారా వేరియంట్లు మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్ల ధరలను పోల్చి చూస్తే, టొయోటా యొక్క మైల్డ్-హైబ్రిడ్ మాన్యువల్ వేరియంట్‌లు రూ. 3,000-50,000 వరకు ఖరీదైనవి కాగా, మైల్డ్-హైబ్రిడ్ ఆటోమేటిక్ వేరియంట్‌ల ధరలు రూ. 8,000-20,000 ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే, హైరైడర్ యొక్క స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్‌లు మాత్రం గ్రాండ్ విటారా స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ల ధరల కంటే ఏకంగా రూ. 50,000 తక్కువగా ఉంటాయి.

      హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

      ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మొదలైనవి ఉన్నాయి.

      హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

      ఇక సేఫ్టీ విషయానికి వస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెండ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మొదలైనవి ఉన్నాయి.

      హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసిన టొయోటా.. మారుతి విటారా కన్నా స్వల్పంగా ఖరీదైనదే..!

      టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. అవసరమైతే దీన్ని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించుకోవచ్చు. దీనికి అదనంగా, ఇందులోని బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీ వారంటీని అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ మైల్డ్-హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌లతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ కాన్ఫిగరేషన్లలలో లభిస్తుంది. - హైరైడర్ పూర్తి టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Toyota urban cruiser hyryder mild hybrid variants are slightly costlier than maruti grand vitara
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X