టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

భారతీయ మార్కెట్లో 'టొయోట' (Toyota) కంపెనీ తన కొత్త ఎస్‌యువి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) ను విడుదల చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎస్‌యువికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే చాలా వెలువడ్డాయి, అయితే ఇప్పుడు కంపెనీ ఈ లేటెస్ట్ ఎస్‌యువిని అధికారికంగా భారతీయ విపణిలో ఆవిష్కరించింది.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త 'టొయోట అర్బన్ క్రూయిజర్ హైరైడర్' గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

భారతీయ మార్కెట్ కోసం తయారుచేయబడిన ఈ కొత్త 'హైరైడర్' ని కంపెనీ మారుతి సుజుకితో కలిసి సంయుక్తంగా తయారు చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ SUV యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్సైట్ లో రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

కంపెనీ ఇప్పుడు ఈ SUV కి సంబంధించిన మొత్తం సమాచారం పంచుకోలేదు, అయినప్పటికీ దీనికి సంబంధించిన డిజైన్ వంటి వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు స్లిమ్ సి-టైప్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ పొందుతుంది. ఇవి టెయిల్‌గేట్ వరకు విస్తరించి ఉన్నాయి.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డ్యుయల్-టోన్ ఇంటీరియర్ డాష్‌ బోర్డు ఉంటుంది. డోర్ ప్యాడ్‌లపై కొన్ని క్రోమ్ మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉండటం చూడవచ్చు. ఇందులో ఏసీ కంట్రోల్స్ మరియు ఏసీ వెంట్స్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి. ఇందులోని స్టీరింగ్ వీల్ మారుతి సుజుకి నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కొత్త హైరైడర్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో రానుంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

అంతే కాకుండా.. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు వాయిస్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా పొందుతున్నాయి. మొత్తం మీద ఇది అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన మిడ్-సైజ్ కారు. కావున ఇది తప్పకుండా మంచి ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుందని ఆశించవచ్చు.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 1.5-లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టయోటా హైరిడర్‌లోని హైబ్రిడ్ సిస్టమ్ 177.6 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీతో జత చేయబడింది. కావున ఇది 24 కిమీ/లీ నుంచి 25 కిమీ/లీ వరకు మైలేజ్ సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉంటుంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

టయోటా తన కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో నియో డ్రైవ్ ఇంజిన్‌ను కూడా అందిస్తోంది. కావున ఇది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆప్సనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని కూడా అందించే ఆకాశం ఉంటుంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, టొయోట అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి వాటితోపాటు రియర్ ప్యాసింజర్ల కోసం సీట్‌బెల్ట్స్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వాటిని కూడా పొందుతుంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

టయోటా కంపెనీ తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే లాంచ్ సమయంలో ధరలు మరియు ఇతర వివరాలు వెల్లడవుతాయి. అయితే ఈ కొత్త SUV కర్నాటకలోని టయోటా యొక్క బిడాడి ప్లాంట్‌లో నిర్మించబడుతుంది. టయోటా హైరైడర్‌ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో టొయోట అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆవిష్కరించబడింది. కావున ఇక త్వరలోనే మార్కెట్లో అధికారికంగా విడుదలకానుంది. అయితే కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, కావున మార్కెట్లో ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. ఈ కొత్త SUV కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Toyota urban cruiser hyryder unveiled and booking details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X