Just In
- 3 min ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 33 min ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 2 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
- 3 hrs ago
సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!
Don't Miss
- News
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ హత్య, సోదరుడికి తీవ్రగాయాలు
- Movies
Sita Ramam 11 Days Collections: ఫస్ట్ డే రేంజ్ లో 11వ రోజు కలెక్షన్స్.. మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?
- Technology
Zoom App వాడుతున్నారా... ప్రమాదంలో ఉన్నట్లే ! వెంటనే Update చేయండి.
- Sports
జింబాబ్వేలో నీటి కొరత.. బాత్రూమ్ల్లో ఎక్కువ సేపు ఉండద్దంటూ టీమిండియాకు బీసీసీఐ ఆదేశాలు!
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Lifestyle
Exercise and Sleep: నిద్రపై వ్యాయామ ప్రభావం.. పడుకునే ముందు చేయవచ్చా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి 'మున్మున్ దత్తా': ధర ఎంతో తెలుసా?
లగ్జరీ కార్లను కొనుగోలు చేసే విషయంలో బుల్లి తెర (టీవీ సీరియర్) నటులు, సినీ తారలకు ఏ మాత్రం తీసిపోరు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే టీవీ సీరియర్ నటులు కూడా ఎక్కువ సంఖ్యలో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా టీవీ సీరియల్ నటులు ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రముఖ హిందీ సీరియల్ నటి 'మున్మున్ దత్తా' (Munmun Dutta) కూడా ప్రముఖ జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'తారక్ మెహతా కా ఊల్తా చష్మా' తో అత్యంత పాపులర్ అయిన 'మున్మున్ దత్తా' ఇటవల జర్మన్ బ్రాండ్ అయిన ‘మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్' (Mercedes Benz A Class) కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నటి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ముంబైలోని ఆటోహ్యాంగర్ మెర్సిడెస్ షోరూమ్ నుండి ఈ కొత్త లగ్జరీ కారుని డెలివరీ చేసుకున్నట్లు తెలిసింది.

భారతీయ మార్కెట్లో 'మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్' ప్రారంభ ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). నిజానికి ఇది కంపెనీ యొక్క ఎంట్రీ-లెవల్ సెడాన్. అయితే ఇది ఇప్పటికే భారతీయ మార్కెట్లో లిమోసిన్ వెర్షన్లో విడుదల చేయబడింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో తగినంత లెగ్‌రూమ్ మరియు బూట్‌స్పేస్ వంటివి అందుబాటులో ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ లగ్జరీ సెడాన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. అవి ఏ200 ప్రోగ్రెసివ్ లైన్, ఏ200డి ప్రోగ్రెసివ్ లైన్ మరియు ఏఎమ్‌జి ఏ35 4మాటిక్ వేరియంట్లు. అయితే మున్మున్ దత్తా ఇందులో ఏ వేరియంట్ కొనుగోలు చేసింది మరియు అది పెట్రోల్ ఇంజిన్ వేరియంటా లేదా డీజిల్ ఇంజిన్ వేరియంటా అనేది ఖచ్చితంగా తెలియదు.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఎలిమెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా ఇందులో బ్రాండ్ లోగో సింగిల్ స్లాట్ క్రోమ్ గ్రిల్ తో ఉంటుంది.

ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్‌డ్యామ్ మరియు రెండు వైపులా రెండు ఎయిర్ పాకెట్లు ఉన్నాయి. అంతే కాకుండా సైడ్ ప్రొఫైల్ 17-ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ టిప్ క్రోమ్ ఎగ్జాస్ట్ ఉంది కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో కంపెనీ కొత్త డ్యూయల్ స్క్రీన్ MBUX ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందించింది. అదే సమయంలో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ మరియు 10.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్, వాయిస్ కమాండ్, పార్క్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా క్రోమ్ ఫినిషింగ్ ఎయిర్ వెంట్స్, క్రోమ్ ఫినిష్ ఎయిర్-కాన్ స్విచ్‌లు, కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందుబటులో ఉంటుంది. ఇందులోని పెట్రోల్ యూనిట్ విషయానికి వస్తే, ఇది 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇంజిన్. ఇది 161 బిహెచ్పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఇక 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ రెండు ఇంజిన్లు మంచి పనితీరుని అందిస్తాయి.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
'మున్మున్ దత్తా' కేవలం టీవీ సీరియల్ అతి మాత్రమే కాకుండా మోడల్ కూడా. అది మాత్రమే కాదు 2006 లో ఆమె కమల్ హాసన్ యొక్క ముంబై ఎక్స్ ప్రెస్ లో కూడా నటించింది. మున్మున్ దత్తాకు కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసింది. మున్మున్ దత్తా కొనుగోలు చేసిన ఈ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కలిగి ఉన్నారు.