2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

భారతీయ ఆటో మొబైల్ రంగంలో ప్యాసింజర్ వాహనాలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగా కంపెనీలు కూడా ఆధునిక ఫీచర్స్ కలిగిన అధునాతన వాహనాలను దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 2022 మార్చి నెలలో భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

కియా కారెన్స్ (Kia Carens):

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో కొత్త కియా కారెన్స్ (Kia Carens) SUV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త MPV యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఇది అత్యధికంగా 7,738 యూనిట్ల బుకింగ్స్ పొందగలిగింది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

Kia Carens MPV కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తి, ఇది సెల్టోస్ యొక్క అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 6/7-సీటర్, మూడు-వరుసల కాన్ఫిగరేషన్‌తో అందించబడుతుంది. కొత్త Kia Carens MPV భారతదేశంలో కియా ఇండియా యొక్క నాల్గవ ఉత్పత్తి అవుతుంది. Kia Carens ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్‌లతో కూడిన 5 ట్రిమ్‌లలో అందించబడుతుంది. అంతే కాకుండా ఇది ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది రూ. 15 లక్షల ప్రారంభ ధరతో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

టయోటా హైలక్స్ (Toyota Hilux):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టయోటా ఎట్టకేలకు కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్ దేసియా మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఇదే సమయంలో కంపెనీ ఈ లైఫ్ స్టైల్ వెహికల్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ కొత్త లైఫ్ స్టైల్ వెహికల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

టయోటా హైలక్స్ ని కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఈ కొత్త వెహికల్ 5-సీటర్ వెహికల్ గా ఉండబోతోంది. ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. డీజిల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఈ వెహికల్ ధర మరియు డెలివరీ వంటి వాటికీ సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కానీ కంపెనీ త్వరలో వీటికి సంబంధించిన సమాచారం వెల్లడిస్తుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది మొత్తమ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, JBL సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో AC మరియు లెదర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, అడిషినల్ ఎయిర్‌బ్యాగ్‌లు, LSD మరియు పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును కూడా పొందుతుంది. ఇది A-TRAC (యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్) ఫీచర్లతో వస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా 500 ఎన్ఎమ్ టార్క్‌ అందించే టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి వేరియబుల్ ఫ్లో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌తో పాటు 700 మి.మీ వాటర్ వేడింగ్ కెపాసిటీతో వస్తుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

ఈ కొత్త ట్రక్ 2.8-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 2904 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. టయోటా హైలక్స్ 4x2 మరియు 4x4 కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

2022 ఎంజి జెడ్ఎస్ ఈవి (MG ZS EV):

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ యొక్క 2022 ఎంజి జెడ్ఎస్ ఈవి (MG ZS EV) త్వరలోనే కొత్త అవతార్ లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంచి. కంపెనీ గత సంవత్సరం, ZS EVకి కొత్త డిజైన్ అప్‌డేట్ పొందింది. అయితే రానున్న మరో మోడల్ లో కూడా అప్డేటెడ్ డిజైన్, రేంజ్ మరియు ఛార్జింగ్‌ వంటి వాటిలో కూడా అప్డేటెడ్స్ పొందే అవకాశం ఉంటుంది.

2022 మార్చిలో విడుదలకానున్న కొత్త కార్లు; ఇవే.. చూడండి

కొత్త 2022 ఎంజి జెడ్ఎస్ ఈవి 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెవల్ 2 అటానమస్ మరియు MG ఆస్టర్ SUV యొక్క ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ కొత్త ZS EV కొత్త కలర్ మరియు ట్రిమ్ ఆప్సన్స్ పొందుతుందని భావిస్తున్నారు. రాబోయే MG ZS EV కారు 51 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక్కసారి పూర్తిగా చార్జిగా చేసుకున్న తరువాత దాదాపుగా 480 కిమీల పరిధిని అందిస్తుంది. కావున ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Upcoming cars in march 2022 india kia carens toyota hilux new mg zs ev details
Story first published: Monday, January 24, 2022, 16:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X