ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPVలు: వివరాలు

భారతదేశంలో ఈ 2022 కొత్త సంవత్సరంలో దేశీయ మరియు విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో కూడా చాలా కంపెనీలు బహుళ ప్రయోజనాల కోసం MPV లను విడుదల చేయనున్నాయి. ఈ కార్లు రానున్న కొన్ని నెలల్లోనే భారతీయ మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల కానున్న నాలుగు MPV లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

కియా కారెన్స్ (Kia Carens):

సౌత్ కొరియా కార్ బ్రాండ్ అయిన కియా మోటార్స్ (Kia Motors) ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్న MPV కియా కారెన్స్. కంపెనీ ఈ MPV ని గతేడాది డిసెంబరులో దీనిని ఆవిష్కరించింది. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో కంపెనీ దీనిని అధికారికంగా విడుదలచేయనుంది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

కియా కారెన్స్ అనేది మూడు వరుసల సీట్ కారు, ఇది SUVలో ఉండే అన్ని ఫీచర్లను అందిస్తుంది. కియా కేరెన్స్ సెల్టోస్ డిజైన్ ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేయబడింది. ఇది 6/7 సీట్ ఆప్షన్‌తో మూడు వరుసల కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. Kia Carens ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్‌లతో కూడిన 5 ట్రిమ్‌లలో అందించబడుతుంది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

కియా కారెన్స్ లో అనేక స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే, Kia Carens మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటాయి. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ MPV ప్రారంభ ధర రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ (Maruti Suzuki Ertiga Facelift):

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి భారతదేశంలో తన రెండవ తరం ఎర్టిగాను 2018లో విడుదల చేసింది. ఈ మోడల్ ఇప్పుడు మూడు సంవత్సరాలకు దేశీయ మార్కెట్లో అమ్మకాన్ని ఉంది. అయితే కంపెనీ తన ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ని త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే కంపెనీ రోడ్ టెస్టింగ్‌లో కూడా కనిపించింది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్‌ ఉంటుంది. ఇందులోని క్యాబిన్ లేఅవుట్ దాదాపు మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఎర్టిగా ఇంటీరియర్‌లు కూడా కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేయబడతాయి. ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ దాని ప్రస్తుత 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులోకి వస్తుంది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki XL6 Facelift):

మారుతి సుజుకి 2022 లో తన ఎక్స్ఎల్6 యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదలచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అప్డేటెడ్ పేస్ లిఫ్ట్ రోడ్ టెస్ట్ సమయంలో కూడా కనిపించింది. అయితే దీని వెనుక డిజైన్‌లో మార్పు గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. గ్రిల్ మార్చబడింది మరియు ముందు బంపర్ కూడా కొత్తదిగా ఉంటుంది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ ప్రస్తుత ఎక్స్ఎల్6 మాదిరిగానే ఉంటుంది, కానీ లోపలి భాగం కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది. అంతే కాకూండా ఈ MPV దాని ఆకర్షణను మెరుగుపరచడానికి ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లను పొందే అవకాశం ఉంటుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మంచి ఇంజిన్ పొందుతుంది. XL6 ప్రస్తుత మోడల్ టెస్టింగ్ సమయంలో మైల్డ్-హైబ్రిడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. ఇది వాహన వినియోగదారులకు తప్పకుండా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

రెనాల్ట్ ట్రైబర్ టర్బో (Renault Triber Turbo):

రెనాల్ట్ (Renault) కంపెనీ యొక్క ట్రైబర్ ఎమ్‌పివి ఇప్పటికే దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది మంచి పనితీరుని అందిస్తున్న కారణంగా ఎక్కువ అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే, ప్రస్తుతం MPVతో అందిస్తున్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ పనితీరు పరంగా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది.

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త MPV లు: వివరాలు

రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్, త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 100 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది. కంపెనీ దీనిని టర్బో ఇంజిన్‌లో అందించే అవకాశం ఉంటుంది. ఇది అద్భుతమైన పవర్ అందిస్తుంది. Renault ఇటీవలే ట్రైబర్ యొక్క వేరియంట్ లైనప్‌ని అప్డేట్ చేయబడింది. టాప్-స్పెక్ RXZ ట్రిమ్ RXT+ తో భర్తీ చేయబడింది. అందువల్ల, RxZ ట్రిమ్ కొన్ని కొత్త ఫీచర్లు మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కొత్త టాప్ మోడల్‌గా తిరిగి భారతీయ మార్కెట్లో విడుదలకానుంది.

Most Read Articles

English summary
Upcoming mpv 2022 india kia carens maruti ertiga xl6 renault triber turbo detail
Story first published: Saturday, January 22, 2022, 17:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X