మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో పరిచయం అవసరం లేని పేరు మహీంద్రా థార్ (Mahindra Thar). ఇది మనదేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన మరియు అత్యంత అధ్భుతమైన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ. ఇప్పటి వరకూ ఈ విభాగంలో థార్‌ను ఓడించిన మోడల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. మహీంద్రా గడచిన 2020 సంవత్సరంలో ఇందులో రెండవ తరం మోడల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత నుండి థార్ అమ్మకాలు కొత్త ఎత్తులకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ ఆఫ్-రోడర్ కోసం ఏడాదికి పైగా వెయిటింగ్ పీరియడ్ ఉంటోందంటేనే, దాని పట్ల కొనుగోలుదారులలో ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

మహీంద్రా థార్ పట్ల క్రేజ్‌ను మరింత పెంచేందుకు కంపెనీ ఇప్పుడు ఇందులో 5-డోర్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మహీంద్రా నుండి రాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్ థార్ 5-డోర్ వెర్షన్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం, మహీంద్రా థార్‌ని కొనాలని ఆసక్తి ఉన్నప్పటికీ, కొందరు కొనుగోలుదారులను వెనక్కు లాగే అంశం ఏదైనా ఉందంటే, దాని ప్రాక్టికాలిటీ. అవును, ప్రస్తుత వెర్షన్ థార్ 3-డోర్లు, 4 సీట్లతో కేవలం ఆఫ్-రోడ్ ఔత్సాహికులను లేదా వ్యక్తిగత వినియోగదారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

కాబట్టి, అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా థార్‌ని అందుబాటులోకి తీసుకురావాలంటే, ఇందులో 5-డోర్లు మరియు 6 లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేయాల్సిన అవసరం. అందుకే, మహీంద్రా ఇప్పుడు థార్ 5-డోర్ వెర్షన్‌పై సీరియస్‌గా వర్క్ చేస్తోంది. ఇప్పటికే, అనేక సందర్భాల్లో పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ భారత రోడ్లపై పరీక్షిస్తుండగా కంటపడింది. తాజాగా, మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి సంబంధించి కొంత సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

మహీంద్రా నుండి రాబోయే కొత్త 5-డోర్ వెర్షన్ థార్ మీరు ఊహించిన దాని కంటే పెద్దదిగా ఉండబోతోంది. ప్రస్తుత థార్‌లో లోపించిన సీటింగ్ సామర్థ్యం మరియు బూట్ స్పేస్ వంటి అంశాలు కొత్త థార్ 5-డోర్‌లో భర్తీ చేయబడుతాయి. ఇందుకోసం మహీంద్రా థార్ యొక్క 5-డోర్ వేరియంట్‌ను ప్రస్తుత థార్ ప్లాట్‌ఫారమ్ (3-డోర్)పై ఆధారపడి కాకుండా, మహీంద్రా ఇటీవలే ప్రారంభించిన కొత్త తరం స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయనున్నట్లు సమాచారం.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

మహీంద్రా నుండి వచ్చిన కొత్త తరం స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ బహుళ సీటింగ్ కాన్ఫిగరేషన్లతో ఇప్పటికే ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. కాబట్టి, ఈ ప్లాట్‌ఫామ్ థార్ 5-డోర్ వెర్షన్‌కు చక్కగా సరిపోతుంది మరియు మహీంద్రాకు తయారీ ఖర్చులను కూడా మిగిలిస్తుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ పై తయారు కానున్న మహీంద్రా థార్ 5-డోర్ ఎస్‌యూవీ మరింత విశాలంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ సమాచారాన్ని మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆటోమోటివ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ ఆర్ వేలుసామి కూడా ధృవీకరించారు.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

రూపం (డిజైన్) పరంగా కొత్త మహీంద్రా థార్ 5-డోర్ ఎస్‌యూవీ ఇంచు మించు థార్ 3-డోర్ వెర్షన్ మాదిరిగానే ఉన్నప్పటికీ, దాని డ్రైవింగ్ డైనమిక్స్ మాత్రం చాలా వరకూ స్కార్పియో-ఎన్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా, మహీంద్రా థార్ యొక్క 5-డోర్ వెర్షన్ ప్రస్తుత మోడల్ కన్నా మరిన్ని అధునాతన ఫీచర్లను అలాగే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ700లో కనిపించిన చాలా ఫీచర్లు కొత్త థార్ 5-డోర్ వెర్షన్‌లో ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా థార్ 3-డోర్ వెర్షన్ ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రియులను ఆకట్టుకుంటున్నప్పటికీ, ఇందులో నలుగురికి మించి ప్రయాణించడం సాధ్యం కాదు మరియు దూర ప్రయాణాల కోసం ఎక్కువ లేగేజ్ తీసుకువెళ్లడానికి ఇందులో తగినంత బూట్ స్పేస్ కూడా ఉండదు. ఇందులో వెనుక వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రారంభంలో మహీంద్రా తమ 3-డోర్ థార్‌ను 7-సీటర్‌గా (మధ్యలో బెంచ్ సీట్, వెనుక సైడ్ ఫేసింగ్ సీట్లతో) విడుదల చేసినప్పటికీ, ఆ తర్వాత సేఫ్టీ దృష్ట్యా వెంటనే కంపెనీ ఈ వేరియంట్‌ను డిస్‌కంటిన్యూ చేసింది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

కాబట్టి, కొత్తగా తీసుకురాబోయే 5-డోర్ వెర్షన్ మహీంద్రా థార్‌ను ఆఫ్-రోడ్ ఫోకస్ట్ ఎస్‌యూవీగా కాకుండా ఎక్కువగా ఆన్-రోడ్ ఫోకస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి, ఐకానిక్ జీప్ స్టైల్ వాహనాన్ని కోరుకున్న పెద్ద కుటుంబాల కోసం ఇది చక్కటి ప్రత్యమ్నాయంగా ఉంటుంది. మహీంద్రా థార్ 5-డోర్ ఎస్‌యూవీలో పొడగించిన వీల్‌బెస్, పెరిగిన సీటింగ్ సామర్థ్యం కారణంగా దాని బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి, పెరిగిన బరువుకు అనుగుణంగా కంపెనీ ఇంజన్ ఆప్షన్లను రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ అవే ఇంజన్లను కొనసాగించే అవకాశం ఉంది. కాకపోతే, వాటిని కొంచెం ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేలా రీట్యూన్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ ఆప్షన్లలో 2.2-లీటర్, టర్బోచార్జ్డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ (130 బిహెచ్‌పి మరియు 200 బిహెచ్‌పి ట్యూన్స్‌లో) మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (150 బిహెచ్‌పి ట్యూన్‌లో) ఉండనున్నాయి. ఇవి రెండూ కూడా ప్రస్తుత మోడల్ మాదిరిగానే 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

కాకపోతే, కొత్త మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ స్టాండర్డ్ ఆఫ్-రోడ్ సెటప్‌ను కలిగి ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం, లభిస్తున్న 3-డోర్ థార్ మాత్రం తప్పనిసరిగా 4x4 సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే, రాబోయే 5-డోర్ థార్ మాత్రం ఇది ఆప్షనల్‌గా కలిగి ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల నిర్వహించిన ఓ ఫీడ్‌బ్యాక్ సర్వే ప్రకారం, థార్ కస్టమర్‌లలో చాలా మంది 4X4 సెటప్ అవసరం లేదని పేర్కొన్నట్లు గుర్తించింది. ఈ ఫీచర్ తగ్గితే, దాని ధర కూడా తగ్గే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి రాబోయే తర్వాతి ఎస్‌యూవీ థార్ 5-డోర్.. ఎక్కువ సీట్లు, ఎక్కువ స్థలం, ఎక్కువ ఫీచర్లు..

హార్డ్-కోర్ ఆఫ్-రోడింగ్ చేసే వారికి మాత్రమే ఆల్-వీల్-డ్రైవ్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూవారీ ప్రయాణాలు, సిటీ కమ్యూటింగ్ మరియు దూర ప్రయాణాలు చేసే వారికి ఈ ఆల్-వీల్-డ్రైవ్ ఫీచర్ అంతగా అవసరం ఉండదు. కాబట్టి, కొత్త 5-డోర్ వెర్షన్ థార్ ఎస్‌యూవీలో ఇది స్టాండర్డ్ ఫీచర్ కాకపోవచ్చని భావిస్తున్నారు. ఇక చివరిగా ధర విషయానికి వస్తే, రాబోయే మహీంద్రా థార్ 5-డోర్ యొక్క ప్రారంభ ధర ప్రస్తుత మహీంద్రా స్కార్పియో-ఎన్ ధరకు చాలా దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Upcoming thar 5 door could be the next biggest launch from mahindra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X