రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!?

మారుతి సుజుకి ఇటీవలే కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు రీట్యూన్ చేయబడిన ఇంజన్‌తో తమ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివిని విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఎర్టిగా ఆధారంగా కంపెనీ తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 ) లో కూడా ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ రేపు (ఏప్రిల్ 21, 2022) మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఈ విభాగంలో కొత్తగా వచ్చిన కియా కారెన్స్ మరియు మహీంద్రా మరాజో వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!?

కొత్త 2020 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కోసం కంపెనీ డీలర్లు ఇప్పటికే బుకింగ్ లను స్వీకరించడం కూడా ప్రారంభించారు. ఆసక్తిగల కస్టమర్లు మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల నుండి రూ. 11,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు. అప్‌డేటెడ్ ఎర్టిగా ఎమ్‌పివితో పోల్చుకుంటే, ఈ ప్రీమియం ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కంపెనీ మరిన్ని ఎక్కువ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కొత్త మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటుగా రిఫ్రెష్డ్ ఇంజన్, కొత్త గేర్‌బాక్స్ మరియు అదనపు ఫీచర్లతో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త అప్‌డేటెడ్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో ప్రధానమైన మార్పు దాని ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌లలో ఉంటుంది. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగించిన అదే అప్‌డేటెడ్ 1.5 లీటర్ కె15సి పెట్రోల్ ఇంజన్‌ను ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కూడా ఉపయోగించనున్నారు. ఈ కొత్త 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. ఎక్స్ఎల్6 లోని ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 101.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4400 ఆర్‌పిఎమ్ వద్ద 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!?

గతంలో ఇదే ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించేది. కాగా, ఈ కొత్త 2022 మోడల్ ఎక్స్‌ఎల్6 ఎమ్‌పివిలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, దాని 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో మాత్రం కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఇందులో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉంటాయి.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!?

ఇదివరకటి మారుతి కార్లలో మునుపెన్నడూ ప్యాడిల్ షిఫ్టర్‌లను చూసింది లేదు, కొత్తగా వచ్చిన 2022 ఎర్టిగా తర్వాత ప్యాడిల్ షిఫ్టర్లను కలిగి ఉన్న రెండవ మారుతి కారు ఎక్స్ఎల్6 అవుతుంది. ప్యాడిల్ షిఫ్టర్ ఫీచర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఆటోమేటిక్ కారును నడిపే అనుభవాన్ని మరింత సరదా (ఫన్ టూ డ్రైవ్)గా మార్చుతుంది. ఒకప్పుడు ప్రీమియం హై-ఎండ్ కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్యాడిల్ షిఫ్టర్ ఫీచర్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా లభిస్తోంది.

సరే ఆ విషయం అటుంచి, కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్ కారులో చేయబోయే డిజైన్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను పరిశీలిస్తే, సరికొత్త గ్రిల్ తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫ్రంట్ బంపర్, కొత్త డిజైన్‌లో ఉండే 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్స్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, రివైజ్డ్ రియర్ బంపర్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. సైడ్ ప్రొఫైల్ లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో ప్రధానమైన మార్పులు ఇంటీరియర్ లో కనిపించే అవకాశం ఉంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!?

కొత్త ఎర్టిగాలో కనిపించిన సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ ఎక్స్ఎల్6లో కూడా కనిపించే అవకాశం ఉంది. కాకపోతే, ఇది 7 ఇంచ్ యూనిట్ రూపంలో ఉంటుందా లేక 9 ఇంచ్ రూపంలో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో సుజుకి బ్రాండ్ యొక్క స్వంత కనెక్టివిటీ యాప్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 'హే సుజుకి' అనే వేకప్ కమాండ్‌తో యాక్టివేట్ చేయదగిన వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!?

అంతేకాకుండా, ఈ 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో 360-డిగ్రీ కెమెరా సెటప్‌ కూడా ఉండనుంది. ఇది డ్యాష్‌బోర్డు మధ్యలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలో అందుబాటులో కెమెరా ఫీడ్‌ను స్పష్టంగా ప్రదర్శింపజేసి, తమ వాహనాన్ని సులువుగా పార్క్ చేసేలా వాహన యజమానులకు సహకరిస్తుంది. ఇంకా ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ మరియు రెండు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్) స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా లభిస్తాయి. అలాగే, ఇందులో ఈఎస్‌పి, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్లు యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైన ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Updated 2022 maruti suzuki xl6 launch scheduled for 21 st april details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X