భారత్ నుంచి 'మెక్సికో'కి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) దేశీయ మార్కెట్లో 2022 జూన్ నెలలో తన కొత్త సెడాన్ 'వర్టస్' (Virtus) ను విడుదల చేసింది. ఈ సెడాన్ విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యుత్తమ బుకింగ్స్ పొందగలిగింది. దేశీయ మార్కెట్లో ఇప్పటికి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కొత్త సెడాన్ ఇప్పుడు విదేశీ ఎగుమతి సిద్ధమైంది.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Volkswagen Virtus: ధర & వివరాలు #Launch

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన 'వర్టస్' సెడాన్ ను ఏ దేశానికి ఎగుమతి చేయనుంది, ఎన్ని యూనిట్లు ఎగుమతి చేయనుంది అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

20211 లోనే ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యూరోపియన్ మార్కెట్ కి తన 'వెంటో' ను దాదాపు 6,256 యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే ఇప్పుడు 95 శాతం వరకు స్థానికీకరణ స్థాయితో MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేయబడి ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన రెండవ ఉత్పత్తి అయిన వర్టస్ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అయితే భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన వాహనాల శ్రేణిలో టైగన్ మొదటిది కావడం విశేషం.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

మేడ్-ఇన్-ఇండియా వర్టస్ మిడ్-సైజ్ సెడాన్‌ను 3,000 యూనిట్లలు ఇప్పుడు ముంబై పోర్ట్ నుండి మెక్సికోకు పంపనున్నారు. అయితే ఎగుమతి చేయనున్న ఈ కార్లు అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎడమ చేతి డ్రైవ్) మోడల్ అని కంపెనీ తెలిపింది.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

ఈ సందర్భంగా స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'పీయూష్ అరోరా' మాట్లాడుతూ.. కంపెనీ రోజురోజుకి అభివృద్ధివైపు చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా కంపెనీ యొక్క ఉత్పత్తలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారాటుదేశం ఉంచి మెక్సికోకి ఎగుమతు చేస్తున్నాము. ఇది కంపెనీ సాధించిన గొప్ప పురోగతి అనే చెప్పాలి. రానున్న రోజులో భారతీయ మార్కెట్ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారనుందని అన్నారు.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ. 11.21 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ మోడల్ ధర రూ. 17.91 లక్షలు (ఎక్స్-షో రూమ్). ఇది డైనమిక్ లైన్ మరియు పర్ఫార్మెన్స్ లైన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇవి రెండూ కూడా ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతాయి.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

ఇక 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ విషయానికి వస్తే, ఇది 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 8 ఇంచెస్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

డిజైన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ యొక్క ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌, ఎల్ఈడి DRLలతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి వాటితో పాటు వెనుక వైపు వర్టస్ అనే బ్యాడ్జ్ కూడా పొందుతుంది.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ పరిమాణం పరంగా కూడా చాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున దీని పొడవు 4,561 మిమీ, వెడల్పు 1,752 మిమీ, ఎత్తు 1,507 మిమీ మరియు వీల్‌బేస్ 2,651 మిమీ వరకు ఉంటుంది. ఇక బూట్ స్పేస్ 521 లీటర్ల వరకు ఉంటుంది. దీనితో పాటు 60:40 స్ప్లిట్ రియర్-సీట్ ఆప్సన్ కూడా పొందుతుంది.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలైజన్ బ్రేక్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

భారత్ నుంచి మెక్సికోకి పయనమైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్.. ఒకేసారి 3,000 యూనిట్లు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటివరకు భారతీయ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చెలాయించిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ విదేశీ మార్కెట్లో కూడా చక్రం తిప్పనుంది. ప్రస్తుతం కంపెనీ 3000 యూనిట్లను మాత్రమే విదేశీ మార్కెట్ (మెక్సికో) ఎగుమతి చేస్తుంది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు కూడా మరింత ఎక్కువ సంఖ్యలో ఎగుమతి చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Volkswagen begins exporting made india virtus first batch shipped to mexico details
Story first published: Monday, September 12, 2022, 17:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X