వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ జర్మన్ కార్ తయారీ సంస్థ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) దేశీయ విఫణిలో 2022 జూన్ నెలలో తన కొత్త సెడాన్ 'వర్టస్' (Virtus) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ కొత్త సెడాన్ ని లాంచ్ చేసిన అతి తక్కువ కాలంలోనే గొప్ప బుకింగ్స్ పొందింది.

Recommended Video

Volkswagen Virtus Telugu రివ్యూ | Turbo-Petrol Engine | Performance, Boot Space, Ride Comfort & More

అదే సమయంలో కేవలం 2 నెలల కాలంలోనే ఏకంగా 5,000 యూనిట్ల వర్టస్ సెడాన్ లను డెలివరీ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

కంపెనీ ఈ సెడాన్ యొక్క డెలివరీలను జులైలో ప్రారంభించింది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్‌ అనేది కంపెనీ యొక్క కొత్త 'ఇండియా 2.0' ప్రాజెక్ట్ కింది విడుదలైంది. ఇది కంపెనీ యొక్క మిడ్-సైజ్ సెడాన్ టైగన్ మాదిరిగానే అదే MQB-A0 IN ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడింది.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

అమ్మకాల పరంగా కంపెనీ యొక్క ఈ కొత్త సెడాన్ ను ఒకే రోజు ఏకంగా 150 యూనిట్లను డెలివరీ చేసి చేసి ఒక కొత్త రికార్డ్ సృష్టించగలిగింది. ఇది నిజంగానే కంపెనీ యొక్క మెగా డెలివరీ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఈ డెలివెరీ జాతర కేరళలోని కొచ్చిన్‌లో జరిగింది. డెలివరీలు చేసిన ఈ డీలర్‌షిప్ పేరు 'EVM వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్'. ఇక్కడ నిర్వహించిన మెగా డెలివరీ ఈవెంట్‌లో అందరికి ఈ సెడాన్ ను డెలివరీ చేయడం జరిగింది.

ఈ మెగా డెలివరీ ఈవెంట్ కి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' అధికారులు కూడా హాజరయ్యారు. వారే స్వయంగా డెలివరీ చేయబడిన కార్ల సంఖ్యను కూడా ధ్రువీకరించారు. ఒకేసారి 150 యూనిట్లు డెలివరీ చేయడం వల్ల డీలర్‌షిప్‌కు రికార్డు సర్టిఫికేట్ కూడా అందించారు.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త వర్టస్ ప్రారంభ ధర రూ. 11.21 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ మోడల్ ధర రూ. 17.91 లక్షలు (ఎక్స్-షో రూమ్). ఇది డైనమిక్ లైన్ మరియు పర్ఫార్మెన్స్ లైన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ యొక్క ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌, ఎల్ఈడి DRLలతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి వాటితో పాటు వెనుక వైపు వర్టస్ అనే బ్యాడ్జ్ కూడా పొందుతుంది.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 8 ఇంచెస్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్స్ అందుబాటులో ఉంటాయి.

వీటితో పాటు ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి. ఇక బూట్ స్పేస్ 521 లీటర్ల వరకు ఉంటుంది. దీనితో పాటు 60:40 స్ప్లిట్ రియర్-సీట్ ఆప్సన్ కూడా పొందుతుంది.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

ఈ కొత్త సెడాన్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,561 మిమీ, వెడల్పు 1,752 మిమీ, ఎత్తు 1,507 మిమీ మరియు వీల్‌బేస్ 2,651 మిమీ వరకు ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన వర్టస్ సెడాన్ ను మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్సన్స్ పొందుతుంది.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది. 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలైజన్ బ్రేక్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

వేగం పెంచిన ఫోక్స్‌వ్యాగన్.. కేవలం 2 నెలల్లో 5,000 దాటిన 'వర్టస్' డెలివరీలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

అతి తక్కువ కాలంలోనే ఫోక్స్‌వ్యాగన్ తన వర్టస్ యొక్క అమ్మకాల్లో మంచి రికార్డ్ పొందగలిగింది. అయితే ఇప్పుడు డెలివరీలను కూడా వేగవతం చేసింది. రానున్న రోజుల్లో డెలివరీలు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. దీని గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen delivers over 5000 units of virtus sedan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X