అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

'ఫోక్స్‌వ్యాగన్ ఇండియా' (Volkswagen India) దేసియా మార్కెట్లో దినదినాభివృద్ధి పొందుతూ మంచి పురోగతిని సాధిస్తోంది. ఈ పురోగతికి ప్రధాన కారణం కొత్త వివలైన వాహనాలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే కంపెనీ ఇప్పుడు తన కొత్త ప్యాసింజర్ కార్ల ధరలను అక్టోబర్ 01 నుంచి పెంచటానికి సిద్ధమవుతోంది.

ఇంతకీ కంపెనీ ఏ మోడల్ ధరలను పెంచనుంది, ఎంతవరకు పెంచనుంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, 2022 అక్టోబర్ 01 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో కొత్త వాహనాలైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలను పెంచనుంది. ఈ కార్ల ధరలు 2 శాతం పెరగనున్నాయి. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే అని కంపెనీ తెలిపింది.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

అంతే కాకుండా ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధం వల్ల ముడి పదార్థాల ధర అమాంతం పెరిగాయని, ఇది కూడా ధరల పెరుగులకు కారణం అని కంపెనీ తెలిపింది. అయితే పండుగ సీజన్లో ధరల పెరుగుల కొనుగోలుదారులపైన ప్రభావం చూపే అవకాశం లేదని ఆశిస్తున్నామని కంపెనీ తెలిపింది.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్:

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్స్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు క్రోమ్ గ్రిల్, రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి మంచి ప్రీమియం లుక్‌ని అందిస్తాయి.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఇది రెండు రెండు ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ మరియు 1.5 లీటర్ TSI ఇంజిన్‌.

ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG తో జతచేయబడి ఉంటుంది.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్:

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అనేది MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేయబడి ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది. ఇది డైనమిక్ లైన్ మరియు పర్ఫార్మెన్స్ లైన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

డిజైన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌, ఎల్ఈడి DRLలతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి వాటితో పాటు వెనుక వైపు వర్టస్ అనే బ్యాడ్జ్ కూడా పొందుతుంది.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ లో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 8 ఇంచెస్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్సన్స్ పొందుతుంది.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ విషయానికి వస్తే, ఇది 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అక్టోబర్ 01 నుంచి టైగన్ & వర్టస్ ధరలు పెరుగుతాయి: ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ యొక్క వర్టస్ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 11.21 లక్షల నుండి రూ. 17.91 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి. అదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 11.40 లక్షల నుండి రూ. 18.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి. అయితే అక్టోబర్ 01 నుంచి ఈ ధరలు పెరుగుతాయి.

Most Read Articles

English summary
Volkswagen taigun and virtus price hike from october 1 details
Story first published: Friday, September 23, 2022, 11:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X