భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

స్వీడన్‌కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo), భారతదేశంలో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు "వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్" (Volvo XC40 Recharge) ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఇది 2021 సంవత్సరంలోనే భారత మార్కెట్లో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కోవిడ్-19 పరిస్థితులు మరియు సెమీకండక్టర్ చిప్ కొరత వంటి కారణాల వలన ఆలస్యమైంది. కాగా, ఇప్పుడు వోల్వో ఇండియా వెబ్‌సైట్ ద్వారా లీకైన సమాచారం ప్రకారం, కొత్త వోల్వో ఎక్స్‌సి40 త్వరలోనే మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అనేది స్టాండర్డ్ గ్యాసోలీన్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ వాహనం. వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా (CBU) రూట్ లో ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. ఫలితంగా, దీని ధర కూడా విదేశాలతో పోల్చుకుంటే, రెట్టింపుగా ఉండే అవకాశం ఉంది. ఇది డెనిమ్ బ్లూ, ఫ్యూజన్ రెడ్, గ్లేసియర్ సిల్వర్, క్రిస్టల్ వైట్ మరియు బ్లాక్ స్టోన్ అనే ఐదు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

వోల్వో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో రానుంది. అంటే, ఒక్కొక్క యాక్సిల్ పై ఒక్కొక ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది ప్రస్తుత గ్యాసోలీన్ ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలకు సమానంగా ఉంటుంది. వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎమ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాటమ్‌ఫామ్ ఎక్స‌సి40 యొక్క ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసిఈ) వాహనాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కంపెనీ సూక్ష్మమైన మార్పులు చేసినప్పటికీ, చూడటానికి ఇది స్టాండర్డ్ డీజిల్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 మాదిరిగానే కనిపిస్తుంది. కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 75 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 408 బిహెచ్‌పి శక్తిని మరియు 660 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

స్టాండర్డ్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో ఉపయోగించిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో పోల్చి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ గరిష్టంగా రెండు రెట్లు కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌సి40 మోడల్‌లోని బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కారణంగా దాని బరువు ఇది స్టాండర్డ్ గ్యాసోలిన్ ఎక్స్‌సి40 కంటే 500 కిలోలు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ యొక్క గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు విడుదల చేసే శక్తిని, ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతుంది. వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 418 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఇందులోని బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో కేవలం 40 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

ఈ ఎలక్ట్రిక్ కారులోని డిజైన్ ఫీచర్లను గమనిస్తే, ముందు వైపు పెద్ద వోల్వో బ్యాడ్జ్, వైట్-ఫినిష్డ్ గ్రిల్, హుడ్ క్రింది భాగంలో 31 లీటర్ల స్టోరేజ్ స్పేస్ మరియు వెనుక భాగంలో 414 లీటర్ల బూట్ స్పేస్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు బ్లాక్ స్టోన్ రూఫ్ మరియు డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కవర్, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా, వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ యొక్క సిల్హౌట్ దాని స్టాండర్డ్ వోల్వో ఎక్స్‌సి40 మాదిరిగానే ఉంటుంది

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ తో కూడిన పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ!

సేఫ్టీలో వోల్వో కార్లు ది బెస్ట్ గా ఉంటాయన్న సంగతి తెలిసినదే. వోల్వో ఈ ఎలక్ట్రిక్ కారులో బెస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ ఫీచర్లలో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రన్-ఆఫ్ రోడ్ మిటిగేషన్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్, లేన్ కీపింగ్ ఎయిడ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, విప్లాష్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఐఎస్ఓఫిక్స్ అటాచ్మెంట్, బ్లైండ్ స్టీర్ అసిస్ట్‌తో కూడిన స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo india to launch xc 40 recharge electric car soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X