వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

స్వీడన్‌ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో (Volvo), భారతదేశంలో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్‌యూవీ "వోల్వో ఎక్స్‌సి40" (Volvo XC40)లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. సమాచారం ప్రకారం, కొత్త 2022 వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఈనెల (సెప్టెంబర్) 21వ తేదీన దేశీయ విపణిలో విడుదల కానుంది.

వోల్వో కార్స్ ఇండియా లిమిటెడ్ తొలిసారిగా తమ ఎక్స్‌సి40 ఎస్‌యూవీని 2018లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు ఇందులో కంపెనీ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

ఈ కొత్త మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి వచ్చింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, కొత్తగా రాబోయే వోల్వో ఎక్స్‌సి40 మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను అందుకోనుంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2022 వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో మరింత షార్ప్‌గా ఉండే హెడ్‌ల్యాంప్‌లు, రీప్రొఫైల్ చేయబడిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ఓవరాల్‌గా ఇది వోల్వో ఇండియా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ ఎలక్ట్రిక్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ మోడల్‌ను తలపించేలా ఉంటుంది. ఈ కొత్త మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటుగా కంపెనీ మరిన్ని ఫీచర్లను కూడా అందించనుంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

అయితే, వోల్వో ఎక్స్‌సి40 లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో మునుపటి మోడల్‌లో ఉపయోగించిన అదే 2.0 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. కాకపోతే, ఈ పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. పెట్రోల్ వెర్షన్‌లోని ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న వోల్వో ఎక్స్‌సి40 కారులో అనేక స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా రానున్న 2022 మోడల్‌లో ఇందులోని కొన్ని ఫీచర్లను అలానే కొనసాగించడంతో పాటుగా ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లను కూడా కంపెనీ అందించే అవకాశం ఉంది. ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు, డాష్-మౌంటెడ్ వూఫర్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు స్మార్ట్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, వినోదం 12.3 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్‌ మరియు డ్రైవర్ సమాచారం కోసం ఎమ్ఐడి టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీలో లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, పైలట్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. దేశీయ విపణిలో వోల్వో ఎక్స్‌సి40 ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఏ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు ఆడి క్యూ3 వంటి ప్రీమియం కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

ఓ నివేదిక ప్రకారం, వోల్వో ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎస్60 సెడాన్ మినహా మిగిలిన అన్ని పెట్రోల్/డీజిల్ మోడళ్లలో మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్లను ఉపయోగించాలని చూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వోల్వో ఇప్పటికే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు పూర్తి ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయిస్తోంది. భారతదేశంలో కూడా కంపెనీ ఇటీవలే తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్‌ను విడుదల చేసింది. స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ ఎక్స్‌సి40 మోడల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ కారును రూపొందించింది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

డిజైన్ పరంగా వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) దాని పెట్రోల్ వెర్షన్ స్టాండర్డ్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీతో దాదాపుగా సమానంగా ఉంటుంది. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. కంపెనీ పేర్కొన్ సమాచారం ప్రకారం, ఇందులోని బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల (WLTP సర్టిఫైడ్) రేంజ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం, వోల్వో ఈ కారును కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా (CBU) రూట్ లో భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. అందుకే, దీని ధర కూడా కాస్తంత అధికంగా ఉంటుంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎమ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాటమ్‌ఫామ్ ఎక్స్‌సి40 యొక్క ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసిఈ) వాహనాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి, ఈ రెండు మోడళ్లలోని పరికరాలు, భాగాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది, ఇందులో ఒక్కొక్క యాక్సిల్ పై ఒక్కొక ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది ప్రస్తుత గ్యాసోలీన్ వెర్షన్ యొక్క ఆల్-వీల్ డ్రైవ్ యూనిట్‌కి సమానంగా ఉంటుంది.

వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. సెప్టెంబర్ 21న విడుదల

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి శక్తిని మరియు 660 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo india to launch xc40 facelift on 21st september 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X