భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

స్వీడన్‌కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo), భారతదేశంలో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు "వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్" (Volvo XC40 Recharge) ను అధికారికంగా విడుదల చేసింది. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. పెట్రోల్ వెర్షన్ స్టాండర్డ్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎస్‌యూవీని తయారు చేసింది. కంపెనీ పేర్కొన్ సమాచారం ప్రకారం, ఇందులోని బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల (WLTP సర్టిఫైడ్) రేంజ్‌ను అందిస్తుంది.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ - స్పెసిఫికేషన్లు

ఎక్స్‌సి40 రీచార్జ్ వోల్వో బ్రాండ్‌ నుండి భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా (CBU) రూట్ లో భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎమ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాటమ్‌ఫామ్ ఎక్స్‌సి40 యొక్క ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసిఈ) వాహనాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది, ఇందులో ఒక్కొక్క యాక్సిల్ పై ఒక్కొక ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది ప్రస్తుత గ్యాసోలీన్ వెర్షన్ యొక్క ఆల్-వీల్ డ్రైవ్ యూనిట్‌కి సమానంగా ఉంటుంది. కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి శక్తిని మరియు 660 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

స్టాండర్డ్ డీజిల్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో ఉపయోగించిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో పోల్చి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ గరిష్టంగా రెండు రెట్లు కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌సి40 మోడల్‌లోని బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కారణంగా దాని బరువు ఇది స్టాండర్డ్ గ్యాసోలిన్ ఎక్స్‌సి40 కంటే 500 కిలోలు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

ఈ కారులోని 78kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్ టైమ్ వరల్డ్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం, దీని రేంజ్ సుమారు 350 కిమీ వరకూ ఉండే అవకాశం ఉంది. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ 150kW ఫాస్ట్ డిసి ఛార్జింగ్‌ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ 150kW ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 33 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. అయితే, భారతదేశంలో కనిపించే 50kW డిసి ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో ఎక్స్‌సి40 రీఛార్జ్ యొక్క బ్యాటరీ ప్యాక్ దాదాపు 2.5 గంటల్లో 10 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ 4,425mm పొడవు, 1,863mm వెడల్పు మరియు 1,652mm ఎత్తును కలిగి ఉండి 1,652mm వీల్‌బేస్ ను మరియు 2,188 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 175mm గా ఉంటుంది మరియు ఈ కారులో వెనుక వైపు 419 లీటర్ల బూట్ స్పేస్ మరియు ముందు వైపు హుడ్ క్రింద అదనంగా 31 లీటర్ల స్థలం ఉంటుంది.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ - డిజైన్ మరియు ఫీచర్లు

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ చూడటానికి దాని పెట్రోల్/డీజిల్ మోడళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కొన్ని అదనపు ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇందులో ముందు వైపు పెద్ద వోల్వో బ్యాడ్జ్, వైట్-ఫినిష్డ్ గ్రిల్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, బ్లాక్ స్టోన్ రూఫ్ మరియు డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కవర్ మరియు 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఎక్స్టీరియర్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

ఇంటీరియర్స్ లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ తో కూడిన పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 13-స్పీకర్ హార్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ విడుదల; ధర రూ.55.90 లక్షలు!

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రన్-ఆఫ్ రోడ్ మిటిగేషన్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్, లేన్ కీపింగ్ ఎయిడ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, విప్లాష్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఐఎస్ఓఫిక్స్ అటాచ్మెంట్, బ్లైండ్ స్టీర్ అసిస్ట్‌తో కూడిన స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాల సమగ్ర వారంటీని, 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీని మరియు 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తోంది. కాగా, ఈ కారులోని బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 8 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo xc40 recharge launched in india price starts at rs 55 90 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X