రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

భారతదేశపు నెంబర వన్ కార్ కంపెనీ మారుతి సుజుకి, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి పాపులర్ మోడళ్ల వేగానికి కళ్లెం వేసేందుకు తాజాగా సరికొత్త హైబ్రిడ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా (Grand Vitara) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ.10.45 లక్షల (సిగ్మా బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర) నుండి ప్రారంభం అవుతాయి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

ఈ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైన కొద్దిరోజులే అనూహ్యమైన బుకింగ్‌‍‌లను దక్కించుకుంది. ప్రస్తుతం, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం సుమారు 50,000 మందికి పైగా కస్టమర్లు క్యూలో వేచి ఉన్నారు. మరి రూ.10.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే లభించే ఈ గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్‌లో ఏయే ఫీచర్లు లభిస్తాయి? ఖరీదైన టాప్-ఎండ్ వేరియంట్లను వదలి, ఈ బేస్ వేరియంట‌ను కొనుగోలు చేయవచ్చా? మొదలైన ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

ఎక్స్టీరియర్ ఫీచర్లు

గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంటే అయినప్పటికీ, ఇది బయటి వైపు నుండి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అయితే, ఇందులో ముందు వైపు టాప్-ఎండ్ వేరియంట్లలో కనిపించే ఎల్ఈడి హెడ్‌లైట్లకు బదులుగా బై-హ్యాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ అల్లాయ్‌ వీల్స్‌కు బదులుగా 17 ఇంచ్ స్టీల్ వీల్స్ వంటి సాధారణ ఫీచర్లు లభిస్తాయి. అయినప్పటికీ, ఈ బేస్ వేరియంట్‌లో ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో కూడిన బాడీ-కలర్ సైడ్ మిర్రర్లు, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్-ఎండ్ స్పాయిలర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క బేస్ 'సిగ్మా' వేరియంట్‌లో ఖరీదైన వేరియంట్లలో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండదు. అయినప్పటికీ, ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ మధ్య ఉంచబడిన 4.2 ఇంచ్ ఎమ్ఐడి డిస్‌ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఫుల్-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్ మరియు ఎత్తు-సర్దుబాటు డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

సేఫ్టీ ఫీచర్లు

గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్ అయినప్పటికీ, మారుతి సుజుకి ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లు, మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

ఇంజన్ (మైల్డ్-హైబ్రిడ్ యూనిట్)

మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క బేస్ 'సిగ్మా' వేరియంట్‌ కేవలం మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 103 బిహెచ్‌పి శక్తిని మరియు 136 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. అయితే, బేస్ వేరియంట్ మాత్రం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

అలాగే, ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కోరుకునే కొనుగోలుదారులు 'డెల్టా' ట్రిమ్ ను ఎంచుకోవాలి. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 13.40 లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లు

ఒకవేళ, మీరు అధిక మైలేజీనిచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్‌తో కూడిన గ్రాండ్ విటారాను కోరుకున్నట్లయితే, ఇది జెటా ప్లస్ మరియు ఆల్ఫా ప్లస్ అనే రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 17.99 లక్షలు (జెట్ ప్లస్, ఎక్స్-షోరూమ్, సింగిల్ టోన్) మరియు రూ. 19.49 లక్షలు (ఆల్ఫా ప్లస్, ఎక్స్-షోరూమ్, సింగిల్ టోన్) గా ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తాయి.

రూ.10.45 లక్షల మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా (బేస్ వేరియంట్)లో ఏమేమి ఫీచర్లు వస్తాయ్..?

స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్

స్ట్రాంగ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారా ఇంజన్ విషయానికి వస్తే, ఈ వేరియంట్లలో 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ మరియు ఓ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 114.5 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వేరియంట్లు లీటరు పెట్రోలుకు గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. - గ్రాండ్ విటారా టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
What features you get in maruti suzuki grand vitara sigma base variant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X