మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

దొంగలు ఒకప్పుడు చాలా సులువుగా మొత్తం కారునే మాయం చేసేవారు. అయితే, అధునాత కార్లు ఇప్పుడు మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో వస్తుండటంతో వారి పని అంత సులువు కావడం లేదు. అందుకే ఇప్పుడు కార్లకు బదులుగా అందులో ఉండే అత్యంత ఖరీదైన భాగాన్ని సులువుగా దోచేస్తున్నారు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

మరి ఆ ఖరీదైన స్పేర్ పార్ట్ ఏంటి, దొంగలు ఎందుకు ఆ భాగాన్నే ఎక్కువగా దొంగిలిస్తున్నారు మొదలైన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

క్యాటలైటిక్ కన్వర్టర్ అంటే ఏమిటి?

క్యాటలైటిక్ కన్వర్టర్ (Catalytic converter) అనేది మీ కారులోనే అత్యంత ఖరీదైన విడిభాగాలలో ఒకటి. ఇది మీ కారు క్రింది భాగంలో ఉండే సైలెన్సర్ పైపులో (ఎగ్జాస్ట్ సిస్టమ్) అమర్చబడి ఉండే ఓ ఫిల్టర్ లాంటి పరికరం. ప్రతి కారులో కూడా క్యాటలైటిక్ కన్వర్టర్ ఉంటుంది. ఇది కారు ఉద్గార వ్యవస్థలో కీలకమైన భాగం, ఇది టెయిల్‌పైప్ నుండి బయటకు వెళ్లే హానికరమైన కాలుష్యాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

క్యాటలైటిక్ కన్వర్టర్లు ఎలా పని చేస్తాయి?

క్యాటలైటిక్ కన్వర్టర్లను తొలిసారిగా 1975 కాలంలో పరిచయం చేశారు. కారు ఇంజన్ నుండి కనెక్ట్ చేయబడి ఉండే సైలెన్సర్ పైపు మధ్యలో ఈ క్యాటలైటిక్ కన్వర్టర్‌లు అమర్చబడి ఉంటాయి. ఇవి ఇంజన్ మండటం ద్వారా బయటకు వచ్చే హైడ్రోకార్బన్‌లు, కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్‌ వంటి హానికరమైన ఉద్గారాలను నీటి ఆవిరి మరియు కార్బన్ డయాక్సైడ్‌గా మార్చి సైలెన్సర్ పైపు నుండి బయటకు పంపుతాయి.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

మీ కారులో క్యాటలైటిక్ కన్వర్టర్ ఎక్కడ ఉంటుంది?

ఇదివరకు చెప్పుకున్నట్లుగా క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది కారు యొక్క సైలెన్సర్ సిస్టమ్‌లో ఓ భాగం. ఇది ఇంజన్ మరియు మఫ్లర్ మధ్యలో ఉంటుంది. సాధారణంగా, ఇవి చాలా వరకూ ఇంజన్‌కు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే, ఇది ఇంజన్ నుండి వచ్చే అధిక ఉష్ణోగ్రతలకు త్వరగా వేడెక్కడానికి సహాయపడేలా వీటిని ఇంజన్‌కు దగ్గరగా అమర్చుతారు.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

క్యాటలైటిక్ కన్వర్టర్ చూడటానికి ఎలా ఉంటుంది?

క్యాటలైటిక్ కన్వర్టర్ ఒక నిర్ధిష్ట పరిమాణం అంటూ ఉండదు. తయారీదారుల విక్రయించే వివిధ రకాల కార్లను బట్టి దీని నమూనా మారుతూ ఉంటుంది. ఇవి సాధారణంగా మఫ్లర్‌ల (సైలెన్సర్) మాదిరిగానే కనిపిస్తాయి. కొన్ని కార్లలో ఇది దీర్ఘచతురస్రాకారంగాను లేదా స్థూపాకారంగానూ ఉంటాయి.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

క్యాటలైటిక్ కన్వర్టర్ లోపల ఖరీదైన లోహాలు ఉన్నాయా?

క్యాటలైటిక్ కన్వర్టర్ లోపల అత్యంత ఖరీదైన లోహాలు ఉంటాయని, అందుకే దొంగలు వీటిని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారని చెబుతుంటారు. ఇది పూర్తిగా వాస్తవం. ఎందుకంటే, వీటిలో పల్లాడియం, రోడియం మరియు ప్లాటినంతో తో పాటుగా వివిధ విలువైన లోహాలతో పూసిన ఓ సిరామిక్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఇంజన్ నుండి వచ్చే హానికరమైన వాయువులను సురక్షితమైనవిగా మార్చడంలో సహాయపడుతుంది.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

దొంగలు ఎందుకు ఎక్కువగా క్యాటలైటిక్ కన్వర్టర్‌లను టార్గెట్ చేస్తున్నారు?

మనం ఈ కథనం ఆరంభంలోనే చెప్పుకున్నాం, దొంగలు ఇప్పుడు ఖరీదైన కార్లకు బదులుగా అందులో ఉండే క్యాటలైట్ కన్వర్టర్లను దొంగిలిస్తున్నారు. ఇలా దొంగిలించిన వాటిని బ్లాక్ మార్కెట్లలో విక్రయిస్తుంటారు. ఇటీవలి కాలంలో క్యాటలైటిక్ కన్వర్టర్ల దొంగతనం విపరీతంగా పెరుగుతోంది. మనందేశంలోనే కాకుండా అమెరికా వంటి దేశాలలో కూడా ఈ సమస్య అధికంగా ఉంది. క్యాటలైటిక్ కన్వర్టలను సాధారణ విడిభాగాలు మాదిరిగా రీప్లేస్ చేయడం అంత సులభం కాదు.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

సాదారణంగా, పాత మోడల్ కార్లలో క్యాటలైటిక్ కన్వర్టర్లు బోల్టులు, నట్లు ద్వారా బిగించబడి ఉండేవి. అయితే, ప్రస్తుత మోడ్రన్ కార్లలో క్యాటలైటిక్ కన్వర్టర్లు ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో వెల్డింగ్ చేయబడి ఉంటున్నాయి. క్యాటలైటిక్ కన్వర్టర్‌లు అతిగా వేడెక్కుతాయి కాబట్టి, వీటి నుండి వేడి బయటకు రాకుండా ఉండేందుకు వాటిని పూర్తిగా పైపులోపల ఉంచి వెల్డింగ్ చేసేస్తారు. అయినప్పటికీ, దొంగలు వీటిని మెషీన్ల సాయంతో కట్ చేసి దొంగిలిస్తున్నారు. వాహన యజమానులకు, పోలీసులకు ఇప్పుడు ఇదొక పెద్ద తలనొప్పిలా మారింది.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

క్యాటలైటిక్ కన్వర్టర్‌లలో ఉపయోగించే లోహాలు ఎంత ఖరీదైనవి?

క్యాటలైటిక్ కన్వర్టర్‌లు దొంగిలించబడటానికి మరొక ప్రధాన కారణం, అందులోని విలువైన లోహాలు. ఉదాహరణకు, ప్లాటినం ఒక ఔన్స్ (సుమారు 28.3 గ్రాములు) ధర 944 డాలర్లు (సుమారు రూ.75,000) గా ఉంది. అలాగే, ఒక పల్లాడియం ధర సుమారు 2,190 డాలర్లు (రూ.1.74 లక్షలు) మరియు ఔన్స్ రోడియం ధర దాదాపు 10,000 డాలర్ల (రూ.7.97 లక్షలు) వరకూ ఉంటుంది. అంటే, ఇవి బంగారం కన్నా ఎన్నో రెట్లు ఖరీదైన లోహాలు అన్నమాట. అందుకే, దొంగలు ఇప్పుడు టైర్లకు బదులుగా ఈ చిన్న పార్ట్‌ని కొట్టేస్తున్నారు.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

స్టాండర్డ్ క్యాటలైటిక్ కన్వర్టర్‌లో ఎంత ప్లాటినం ఉంటుంది?

ఒక నిర్దిష్టమైన క్యాటలైటిక్ కన్వర్టర్‌లో ఈ విలువైన లోహాలు ఎంత వరకు ఉంటాయంటే, ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న అనేక కార్లలో ఈ మూడు లోహాలు కలిపి 6 లేదా అంతకంటే తక్కువ గ్రాములు మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రతి లోహం ఎంత ఉందనే దానిపై ఆధారపడి, మార్కెట్లో వాటి విలువ సుమారు రూ.16,000 నుండి రూ.80,000 వరకూ ఉంటుంది. కాబట్టి, ఇది మీ కారులో నిజంగానే చాలా ఖరీదైన విడిభాగం.

మీ కారులో ఇదే అత్యంత ఖరీదైన పార్ట్.. ప్లాటినం ఉంటుందని దొంగలు టార్గెట్ చేసే మెయిన్ పార్ట్..!

క్యాటలైటిక్ కన్వర్టర్‌లతో సాధారణంగా వచ్చే సమస్యలు ఏమిటి?

మీ కారులోని క్యాటలైటిక్ కన్వర్టర్‌లతో సాధారణంగా ఎలాంటి సమస్యలు రావు, వీటి జీవితకాలం సుమారు 10 సంవత్సరాల వరకూ ఉంటుంది. అయితే, కారు వయస్సు పెరిగే కొద్దీ ఈ విడిభాగాలు కూడా దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇంజన్‌లో లోపం కారణంగా ఇంధనం లీకై అది ఎగ్జాస్ట్ పైపులోకి చేరినట్లయితే క్యాటలైటిక్ కన్వర్టర్‌లు అతిగా వేడెక్కుతాయి. ఇంజన్‌లోని విఫలమైన ఆక్సిజన్ సెన్సార్ కూడా ఇవి వేడెక్కడానికి కారణం అవుతుంది. ఫలితంగా క్యాటలైటిక్ కన్వర్టర్లు పాడవటం లేదా పగిలిపోవటం జరుగుతాయి. అలా జరిగితే, ఇంజన్ పనితీరు తగ్గుతుంది మరియు చాలా సందర్భాలలో డ్యాష్‌బోర్డుపై చెక్ ఇంజన్ లైట్‌ కనిపిస్తుంది.

Most Read Articles

English summary
What is the catalytic converter in car and why is it stolen most
Story first published: Friday, September 16, 2022, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X