కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

భారత మార్కెట్లో ఎస్‌యూవీలు (SUV) ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియాగా మారాయి. ఒకప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లుగా ఉండేవి. అయితే, కస్టమర్లు ఇప్పుడు వాటి స్థానంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. దీంతో మార్కెట్లోకి అనేక కొత్త మోడళ్లు వచ్చాయి మరియు ఇవి చిన్న హ్యాచ్‌బ్యాక్‌లను వెనక్కు నెట్టేస్తున్నాయి. మార్కెట్లో SUVలకు డిమాండ్ బలంగా ఉంది.

కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

గత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో సుమారు 6,00,000 కంటే ఎక్కువ ఎంట్రీ-లెవల్ SUVలు అమ్ముడైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మారుతి సుజుకి బ్రెజ్జా మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీలు ఈ విభాగాలలో అగ్రగాములుగా ముందుకు దూసుకుపోతున్నాయి. అయితే, భారత కార్ల కస్టమర్లు చిన్న హ్యాచ్‌బ్యాక్‌లను వదిలి ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమిటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

బడ్జెట్ ధరలకే లభిస్తున్నాయి మరియు సౌకర్యవంతమైనవి

ప్రస్తుతం, మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లు మరియు ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు దాదాపు ఒకే ధరను కలిగి ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ SUVల విషయానికి వస్తే, కస్టమర్‌లు వీటిలో పెద్ద బూట్ స్పేస్ మరియు మెరుగైన ఫీచర్లను సరసమైన ధరలకే పొందుతున్న నేపథ్యంలో, హ్యాచ్‌బ్యాక్ ల కన్నా ఎస్‌యూవీలనే ఎంచుకుంటున్నారు. అంతే కాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటున్నాయి. కాబట్టి, ఇప్పుడు కస్టమర్ల మొదటి ఎంపిక ఎస్‌యూవీ అవుతోంది.

కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

బెస్ట్ యుటిలిటీ

ఎస్‌యూవీ (SUV) అంటే అర్థం స్పోర్ట్ యుటిలిటీ వెహికల్. పేరులో ఉన్న యుటిలిటీ కారులో కూడా కనిపిస్తుంది. డ్రైవర్ మరియు ప్రయాణీకులకు అదనపు రూమ్, స్టోరేజ్ కోసం పెద్ద బూట్ స్పేస్, కఠినమైన రోడ్లపై సైతం సులువుగా ప్రయాణించగల సత్తా వంటి ప్రాక్టికాలిటీ అంశాలతో ఇది హ్యాచ్‌బ్యాక్ ల కన్నా మంచి ఆప్షన్ గా నిలుస్తుంది. కాంపాక్ట్ SUVలకు అప్‌గ్రేడ్ అయిన తర్వాత చాలా మంది హ్యాచ్‌బ్యాక్ యజమానులు ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, ఎందుకంటే అవి మరింత ఆచరణాత్మకమైనవిగా ఉంటాయి కాబట్టి.

కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

అధిక గ్రౌండ్ క్లియరెన్స్

ఇండియన్ రోడ్ల విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ముఖ్యమైన అంశం. భారతదేశంలో రోడ్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. కాబట్టి, వాహనాలు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉండటం చాలా అవసరం. హ్యాచ్‌బ్యాక్ లతో పోలిస్తే, ఎస్‌యూవీలు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉండి, భారతీయ రోడ్లకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయంలో ఎస్‌యూవీలు మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచవు మరియు కఠినమైన రోడ్లను పరిష్కరించడానికి సైతం ఇవి తగినంత గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటాయి.

కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

రహదారి ఉనికి (రోడ్ ప్రజెన్స్)

భారతదేశంలో కార్లు కేవలం ఓ రవాణా సాధనం మాత్రమే కావు, చాలా సందర్భాల్లో వీటిని ఓ స్టేటస్ సింబల్ గా పరిగణించబడుతాయి. అటువంటి పరిస్థితిలో, మీ వద్ద ఉన్న కారు ఎంత పెద్దదైతే, సమాజంలో మీ స్థానం అంత మెరుగ్గా ఉన్నట్లు భావించడం జరుగుతుంది. ఎస్‌యూవీలు అద్భుతమైన రహదారి ఉనికిని కలిగి ఉండి, చూడగానే చూపరుల దృష్టిని తమ వైపుకు తిప్పుకునేలా ఉంటాయి. ఉదాహరణకు మహీంద్రా థార్, స్కార్పియో లేదా టాటా హారియర్ వంటి ఎస్‌యూవీలు మిమ్మల్ని రహదారి రాజుగా భావించేలా చేస్తాయి.

కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు ఎందుకు..?

స్పోర్టీనెస్

ఎస్‌యూవీలు చాలా శక్తివంతమైనవి మరియు స్పోర్టీగా ఉంటాయి. ఇవి చిన్న సైజు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే శక్తివంతమైన ఇంజన్‌లను కలిగి ఉండి, మంచి పనితీరును అందిస్తాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలు కనీసం 100 బిహెచ్‌పి శక్తిని కలిగి ఉంటాయి, టర్బో వేరియంట్‌లతో ఈ శక్తి మరింత పెరుగుతుంది. అయితే డీజిల్ వేరియంట్ లు మరింత ఎక్కువ టార్క్‌ను పొందుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే, కాంపాక్ట్ ఎస్‌యూవీలు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే మెరుగైనవిగా పరిగణించబడుతున్నాయి.

Most Read Articles

English summary
Why customers are choosing suvs over hatchbacks lets find out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X