డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ (Nissan) తమ చవక కార్ బ్రాండ్ డాట్సన్ (Datsun) ను భారత మార్కెట్లో నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, డాట్సన్ బాటలోనే నిస్సాన్ కూడా ఇంటిబాట పట్టనుందనే పుకార్లు అధికమయ్యాయి. అయితే, నిస్సాన్ కూడా భారత మార్కెట్ నుండి వైదొలగనుందనే పుకార్లపై నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని, నిస్సాన్ బ్రాండ్ భారతదేశంలో బలంగా కొనసాగుతోందని, తమకు ఇక్కడి నుండి నిష్క్రమించే ప్లాన్స్ లేవని కంపెనీ ఎమ్‌డి రాకేష్ శ్రీవాత్సన తెలిపారు.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

భారతదేశంలో ఇటీవలి కాలంలో అమ్మకాలు సరిగ్గా లేని మరియు నష్టాల బాట పట్టిన పలు విదేశీ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వ్యాపారాలను నిలిపివేసి, దేశం వదలి వెళ్లిపోతున్న సంగతి తెలిసినదే. గతంలో హ్యార్లీ డేవిడ్సన్, ఇటీవల ఫోర్డ్ మరియు తాజాగా డాట్సన్ కంపెనీలు ఇప్పటికే ఇంటిబాట పట్టాయి. ఆశించిన రీతిలో అమ్మకాలు జరగకపోవడంతో ఈ కంపెనీలు తమ వ్యాపాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చింది. నిస్సాన్ తమ డాట్సన్ బ్రాండ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొని దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

ఆరంభంలో డాట్సన్ కార్లు వాటి సరసమైన ధర కారణంగా మార్కెట్లో మంచి ఆదరణను పొందినప్పటికీ, కాలక్రమేనా కంపెనీ వాటిని అప్‌గ్రేడ్ చేయడంలో విఫలమైంది. పెరిగిన పోటీ వాతావరణంలో ఈ బ్రాండ్ కార్లు నిలబడలేకపోయాయి. దీంతో గత్యంతరం లేక డాట్సన్ బ్రాండ్ ను భారత మార్కెట్ నుండి తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం నిస్సాన్ తమ డాట్సన్ బ్రాండ్ ను భారతదేశం వేదికగా రీలాంచ్ చేసింది. భారత్‌తో పాటుగా పలు విదేశాల్లో కూడా కంపెనీ ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

నిస్సాన్ ఇప్పటికే, దాదాపు అన్ని అంతర్జాతీయ మార్కెట్లలో తమ డాట్సన్ బ్రాండ్ కు గుడ్‌బై చెప్పేసింది. తాజాగా, భారతదేశంలో కూడా ఈ బ్రాండ్‌ను నిలిపివేసింది. ఇక నిస్సాన్ విషయానికి వస్తే, ఈ బ్రాండ్ కూడా భారతదేశంలో స్థిరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నప్పటికీ, నిస్సాన్ నుండి ప్రస్తుతం రెండు కార్లు మాత్రమే భారతదేశంలో విక్రయించబడుతున్నాయి. వీటిలో నిస్సాన్ కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో నిస్సాన్ కిక్స్ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు మాత్రం జోరుగానే ఉన్నాయి.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

ఒక్కమాటలో చెప్పాలంటే, నిస్సాన్ ప్రస్తుతం ఒకే ఒక స్ట్రాంగ్ మోడల్‌తో భారత మార్కెట్లో ఒంటరి పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డాట్సన్ మాదిరిగాన్ నిస్సాన్ కూడా ఇంటికి వెళ్లిపోతే పరిస్థితి ఏంటనేది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు నిస్సాన్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ సమాధానం ఇచ్చారు. నిస్సాన్ యొక్క గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్ట్రాటజీలో భాగంగా, నిస్సాన్ ఇండియా కస్టమర్‌లు, డీలర్ పార్టనర్‌లు మరియు వ్యాపారానికి అత్యంత ప్రయోజనాన్ని అందించే కోర్ మోడల్‌లు మరియు విభాగాలపై నిస్సాన్ ఇండియా దృష్టి సారిస్తోందని చెప్పారు.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

కస్టమర్ సంతృప్తే తమ ప్రాధాన్యత అని, తాము ఇప్పటికే ఉన్న మరియు భవిష్యత్ డాట్సన్ యజమానులందరికీ భరోసా ఇవ్వగలమని మరియు తమ జాతీయ డీలర్‌షిప్ నెట్‌వర్క్ నుండి అత్యధిక స్థాయి ఆఫ్టర్ సేల్స్ సేవలను, విడిభాగాల లభ్యత మరియు వారంటీ మద్దతును అందించడం కొనసాగిస్తామని రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. నిస్సాన్ భారతదేశంలో బలమైన పెట్టుబడులను పెట్టిందని మరియు దేశంలో తమ బ్రాండ్ చాలా స్థిరంగా కొనసాగుతోందని ఆయన అన్నారు.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

నిస్సాన్ బ్రాండ్ యొక్క గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్ లో భాగంగా తాము మాగ్నైట్ ఎస్‌యూవీని 2020లో భారతదేశంలో విడుదల చేశామని, నిస్సాన్ నెక్ట్స్ ప్రణాళిక క్రింద ప్రారంభించబడిన మొదటి వాహనం ఇదని, మాగ్నైట్ ఇప్పటికే లక్షకు పైగా కస్టమర్ బుకింగ్‌ల మైలురాయిని దాటిందని, మార్చి 2022లో 50,000 ఉత్పత్తిని పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం, ఈ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సుమారు 5 నుండి 6 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్‌ ఉంటోందని, దాదాపు 18,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని శ్రీవాత్సవ తెలిపారు.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఈ జపనీస్ బ్రాండ్ నిస్సాన్ మరియు దాని ఫ్రెంచ్ భాగస్వామి రెనో కంపెనీలు కలిసి సంయుక్తంగా ఓ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ ప్లాంట్లో తయారైన కార్లను స్థానికంగా విక్రయించడమే కాకుండా కంపెనీ పలు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తోంది. నిస్సాన్ భారతదేశం నుండి మొత్తం 15 దేశాలకు తమ ప్యాసింజర్ కార్లను ఎగుమతి చేస్తుంది. అయితే, భారతదేశంలో మొత్తం ప్యాసింజర్ కార్ల విక్రయాలలో నిస్సాన్ మార్కెట్ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది.

డాట్సన్ (Datsun) బాటలోనే నిస్సాన్ (Nissan) కూడా ఇంటిబాట పట్టనుందా..? కంపెనీ ఎమ్‌డి ఏం చెప్పారంటే..

అయితే, నిస్సాన్ ఈ మార్కెట్ వాటాను భారీగా పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం కంపెనీ మరిన్ని కొత్త మోడళ్లను ఇక్కడి మార్కెట్లో పరిచయం చేయాలని చూస్తోంది. దేశంలోని ఇతర కార్ కంపెనీల మాదిరిగానే నిస్సాన్ కూడా ఓ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని చూస్తోంది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీని నిస్సాన్ మాగ్నైట్ ఆధారంగా రూపొందించనున్నట్లు తెవుస్తోంది. ఇది 7-సీట్ వెర్షన్ గా వచ్చినప్పటి, దాని రూపురేఖల్లో మాత్రం పెద్దగా తేడా ఉండబోదని తెలుస్తోంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Will nissan also exit from india company manging director claifies on speculations
Story first published: Friday, April 29, 2022, 17:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X