వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

మహిళలు ప్రతి రంగంలో కూడా పురుషులతో పోటీ పడుతూ తమ ప్రతిభను, నైపుణ్యాలను మరియు శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి, ఆటోమొబైల్ తయారీ రంగంలో మహిళల పాత్ర నానాటికీ పెరుగుతోంది. వాహన తయారీ రంగంలో కేవలం తేలికపాటి పనులను మాత్రమే కాకుండా ఏకంగా కార్లను సైతం తయారు చేయగల సత్తాను కలిగి ఉన్నారు నేటి స్త్రీలు. టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్ వంటి కంపెనీలు ఇప్పుడు తమ ఫ్యాక్టరీలలో దాదాపు సగం మహిళా ఉద్యోగులను కలిగి ఉన్నారు.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

భారతదేశపు అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన టాటా హారియర్ మరియు టాటా సఫారీ వంటి ఎస్‌యూవీలను పూర్తిగా మహిళల బృందంతో తయారు చేసి అసెంబుల్ చేస్తోంది. సుమారు 1,500 మంది ప్రొఫెషనల్ మహిళల బృందం ఈ రెండు ఎస్‌యూవీలను తయారు చేయడానికి బాధ్యత వహిస్తుంది. మహళలు అంటే కేవలం ఇళ్లను చక్కబెట్టేవారు మాత్రమే కాదు, పెద్ద కంపెనీలను సైతం సరైన పద్ధతిలో నిర్వహించే వారని మరోసారి నిరూపించారు.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

టాటా మోటార్స్ తమ ఉద్యోగులలో అధిక శాతం మహిళా ఉద్యోగులను కలిగి ఉండేలా చూస్తోంది. టాటా మోటార్స్ ఇటీవల గుజరాత్‌లోని ఫోర్డ్ తయారీ కర్మాగారాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసినదే. ఈ ప్లాంట్ లో వచ్చే ఏడాది కార్యకలాపాలు ప్రారంభించాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. ఈ ప్లాంట్ లో కూడా ఎక్కువ మహిళా వర్క్‌ఫోర్స్‌ ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

చాలా కాలంగా పురుష-ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఉద్యోగాల్లోకి మహిళా శ్రామిక శక్తిని తీసుకురావడం ద్వారా, టాటా మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్ మరియు ఎమ్‌జి మోటార్ వంటి కంపెనీలు ఆటోమోటివ్ పరిశ్రమకు సంబంధించిన ఉద్యోగ పాత్రలలో లింగ అసమానతను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే, ఎమ్‌జి మోటార్ ఇండియా తన వడోదర ప్లాంట్‌లో తయారు చేసిన 50,000వ ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీని పూర్తిగా మొత్తం మహిళా సిబ్బందితో తయారు చేయించింది.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

ఈ కారు తయారీలో మొత్తం మహిళల బృందం ప్యానెల్-ప్రెస్సింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి వివిధ విభాగాలలో పనిచేసింది. నిజానికి, వీరిలో కొందరు పోస్ట్ ప్రొడక్షన్ రన్‌లలో కూడా పాల్గొన్నారు. అలాగే, ఇప్పుడు దేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కూడా తమ స్కూటర్ల తయారీ మరియు అసెంబ్లింగ్ యూనిట్లలో మహిళా ఉద్యోగులను నియమించుకుంది. ఈ విధంగా, దేశంలోని ఇతర వాహన తయారీదారులు కూడా మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో లింగ అసమానతను తొలగించేందుకు ప్రయత్నించాలని అందరూ కోరుకుంటున్నారు.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

ఇక టాటా సఫారి మరియు టాటా హారియర్‌ ఎస్‌యూవీల విషయానికి వస్తే, ఇవి రెండూ చూడటానికి వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి తయారీలో ఉపయోగించిన అనేక విడి భాగాలు మరియు ఇంజన్ మాత్రం ఒకేలా ఉంటాయి. ఈ ఎస్‌యూవీలలో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 167.67 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

టాటా సఫారి మరియు టాటా హారియర్ ఎస్‌యూవీలు రెండూ కూడా సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 9 ఇంచ్ హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, iRA కనెక్ట్ చేయబడిన కార్ టెక్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పవర్-ఆపరేటెడ్ అండ్ ఆటో-ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

ప్రీమియం ఎస్‌యూవీ టాటా సఫారిలోని కొన్ని ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌లలో కంపెనీ రెండవ వరుసలో కూడా వెంటిలేటెడ్ సీట్లను అందిస్తోంది. ఇకపోతే, టాటా సఫారి మరియు టాటా హారియర్ ఎస్‌యూవీలు రెండూ కూడా ఒకే విధమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి.

వాహన తయారీ రంగంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూప్తిన్న మహిళలు.. ఇవి 'మేడ్ బై ఉమెన్' కార్లు..

అన్నింటికన్నా ముఖ్యమైనది మైలేజ్ విషయానికి వస్తే, ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన గణాంకాల ప్రకారం, టాటా సఫారి యొక్క మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌లు లీటరుకు 16.14 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లు లీటరుకు 14.08 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. కాగా, టాటా హారియర్ మాన్యువల్ వేరియంట్‌లు లీటరుకు 16.35 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లు లీటరుకు 14.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి.

Most Read Articles

English summary
Women manpower is increasing in vehicle manufacturing sector
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X