జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors), దేశీయ మార్కెట్లో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. కంపెనీ ఇటీవలే టాటా కర్వ్ (Tata Curvv) మరియు టాటా అవిన్య (Tata Avinya) కాన్సెప్ట్ కార్లను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. కాగా, టాటా మోటార్స్ ఇప్పుడు తమ ప్యాసింజర్ వాహన విభాగం దాని రాబోయే వాహనాల కోసం నాలుగు కొత్త పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో జిమోరా, అరోర్, బోవిటా, స్టైజర్ అనే పేర్లు ఉన్నాయి.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

టాటా మోటార్స్ ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసిన టాటా జిమోరా (Tata Xiomara), టాటా అరోర్ (Tata Auroar), టాటా బోవిటా (Tata Bovita) మరియు టాటా స్టైజర్ (Tata Styzor) పేర్లను చూస్తుంటే, ఇవి కంపెనీ నుండి రాబోయే ఎలక్ట్రిక్ కార్లుగా ఉంటాయని తెలుస్తోంది. భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే టిగోర్, ఎక్స్‌ప్రెస్-టి, నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడళ్లను విక్రయిస్తూ అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, భవిష్యత్తులో ఈవీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, తన అగ్రస్థానాన్ని అలానే కొనసాగించాలని చూస్తోంది.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

టాటా మోటార్స్ 2030 నాటికి EV స్పేస్‌లోని అన్ని విభాగాలను కవర్ చేయడానికి కంపెనీ మూడు ఈవీ ప్లాట్‌ఫారమ్ లను కలిగి ఉంది. ఇప్పటి వరకూ టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు మొదటి తరం (Gen 1) ఈవీ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగిస్తుండగా, కంపెనీ నుండి రాబోయే Bovita, Auroar మరియు Xiomara వాహనాలు ఇటీవల ప్రదర్శించబడిన Tata Curvv కాన్సెప్ట్ యొక్క Gen 2 EV ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉండవచ్చు లేదా Tata Avinya కాన్సెప్ట్ యొక్క Gen 3 స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌ పై తయారు చేసే అవకాశం ఉంది.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

అయితే, ఈ పేర్లను ఖచ్చితంగా EV (ఎలక్ట్రిక్ వెహికల్) లకే ఉపయోగిస్తారా లేదా IC (ఇంటర్నల్ కంబషన్) ఇంజన్ మోడళ్లకు ఉపయోగిస్తారా అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ, ఈ పేర్ల స్టైల్ మరియు కంపెనీ ఇటీవల ప్రదర్శించిన కాన్సెప్ట్ వాహనాలకు ఉపయోగించిన స్టైల్స్ ను చూస్తుంటే, ఇవి తప్పకుండా ఎలక్ట్రిక్ వాహనాలను అయి ఉండొచ్చని తెలుస్తోంది. టాటా మోటార్స్ గత సంవత్సరం చివరలో, తమ EV (ఎలక్ట్రిక్ వెహికల్) విభాగం, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Tata Passenger Electric Mobility) ని స్థాపించింది.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

టాటా మోటార్స్ తమ ఈవీ విభాగం కోసం భారీ నిధులను కేటాయించి, ఎలక్ట్రిక్ భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. కంపెనీ వచ్చే 2026 నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు గత ఏడాది తెలిపింది. గత నెల ఆరంభంలో టాటా మోటార్స్ టాటా కర్వ్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ క్రాసోవర్ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కొత్త 'టాటా కర్వ్‌' (Tata Curvv) 2024 నాటికి భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్పోర్టీ కూప్ బాడీ స్టైల్‌లో కనిపిస్తుంది.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

ఇదిలా ఉంటే, ఏప్రిల్ నెలాఖరులో కంపెనీ 'టాటా అవిన్య' (Tata Avinya) పేరుతో మరో సరికొత్త ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. ఈ అధునాతన ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 500 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. అవిన్య అనే పేరును టాటా మోటార్స్ సంస్కృతం నుండి సేకరించింది, ఈ పేరుకి అర్థం ఆవిష్కరణ అని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ యొక్క మూడవ తరం ఎలక్ట్రిక్ వాహనాలలో (Gen 3 EV) భాగంగా కంపెనీ టాటా అవిన్య కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

కంపెనీ ఆవిష్కరించిన ఈ అధునాతన ఎలక్ట్రిక్ కార్ టాటా అవిన్య, ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్ తయారు చేసిన సరికొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది కొత్త Gen 3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటుకున్న మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. సమాచారం ప్రకారం, ఇది 2025 నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. టాటా అవిన్య మానవ కేంద్రీకృత వాహనం (Human Centric Vehicle) అని కంపెనీ పేర్కొంది. ఇది 4.3 మీటర్ల పొడవును కలిగి ఉండి, బయటి వైపు నుండి చాలా మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జిమోరా.. అరోర్.. బోవిటా.. స్టైజర్.. ఇవన్నీ టాటా మోటార్స్ నుండి రాబోయే ఫ్యూచర్ కార్స్..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసింది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 437 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మార్కెట్లో ఇది XZ+ మరియు XZ+ Lux అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ప్రతి వేరియంట్ కూడా రెండు రకాల చార్జర్ ఆప్షన్లతో లభిస్తుంది. దేశీయ విపణిలో కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.17.74 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. - ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Xiomara auroar bovita styzor names trademarked by tata motors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X