హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

హైదరాబాద్‌కు చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ జీరో21 (ZERO21) తెలంగాణలోని జహీరాబాద్‌లో ఉన్న ఎమ్‌జి ఆటోమోటివ్స్ ఈనీ పార్క్‌ లో ఓ రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లను ఆవిష్కరించింది. ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ కోసం కంపెనీ రెండు ప్రత్యేమైన ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను తయారు చేసింది. ఇవి ప్రస్తుతం పెట్రోల్/డీజిల్ తో నడిచే సాంప్రదాయ ఆటోరిక్షాల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా సంస్థలో లక్షలు సంపాధించే ఉద్యోగం మానేసి, ఈ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించాడు మన హైదరాబాద్ టెకీ శ్రీనివాస్.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

టీర్ ప్యాసింజర్ ఇ-ఆటో (ZERO21 Teer)

జీరో21 రూపొందించిన రెండు ఎలక్ట్రిక్ వాహనాలలో మొదటిది జీరో21 టీర్ (ZERO21 Teer) ఎలక్ట్రిక్ ఆటోరిక్షా. ఇది ప్యాసింజర్ రవాణా కోసం తయారు చేయబడిన మోడల్. ఈ హై-స్పీడ్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ 5000W (5kW) రేట్ పవర్ మరియు 8.5kW వరకు గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ 48 V ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 72 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. చార్జింగ్ విషయానికి వస్తే, ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 110 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

స్మార్ట్ మ్యూల్-ఎక్స్ ఇ-కార్గో (ZERO21 Smart Mule-X)

ఇకపోతే, జీరో21 రూపొందించిన రెండవ ఎలక్ట్రిక్ వాహనం స్మార్ట్ మ్యూల్-ఎక్స్ (Smart Mule-X). ఇది కార్గో (సరుకు రవాణా) కోసం తయారు చేయబడిన ఎలక్ట్రిక్ ఇ-ఆటో. ఇది 8000W (8kW) రేట్ పవర్ మరియు 10.9kW వరకు పీక్ పవర్ కలిగి ఉన్న హై-స్పీడ్ గూడ్స్ క్యారియర్. ఈ 72 V ఎలక్ట్రిక్ త్రీ వీలర్ గరిష్టంగా 97 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్ ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా గరిష్టంగా 125 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని మరియు ఇది 750 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

జీరో21 (ZERO21) గురించి క్లుప్తంగా..

హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ (49) తన 26 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో దాదాపు 20 దేశాల్లో పనిచేశాడు. గడచిన 2014లో, అతను USA లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లాలో IT మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అయితే, టెస్లాలో మూడేళ్లపాటు పనిచేసిన తర్వాత, భారతదేశంలో సంప్రదాయ వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యం గురించి ఆందోళన చెందాడు, ఆ తర్వాత అతను ఈ సమస్యను అధిగమించడానికి భారతదేశానికి వచ్చి ఓ స్టార్టప్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

అలా నిర్ణయించుకున్న తక్షణమే లక్షల జీతం వచ్చే టెస్లా కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకొని భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌ (Zero 21 Renewable Energy Solutions Private Limited) పేరుతో ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించాడు. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, జీరో 21 పేరులో 21 అనే పదం '21వ శతాబ్దంలో గాలి మరియు శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా సున్నా చేయటం' అని సూచిస్తుంది. శ్రీనివాస్ 2018 ప్రారంభంలో, తన స్టార్టప్ యొక్క మొదటి ఉత్పత్తి స్మార్ట్ త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ కార్గోపై పని చేయడం ప్రారంభించాడు.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

ఈ ఎలక్ట్రిక్ కార్గో బ్యాటరీని మార్చకుండా 10 సంవత్సరాల పాటు నడుస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్గో వాహనం 350-400 కిలోల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కార్గో 160 Ah లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 120-130 కిమీల పరిధిని అందిస్తుంది మరియు గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరులుగు తీస్తుంది. లాస్ట్ మైల్ డెలివరీ విభాగంలో దీన్ని తీసుకురావచ్చని కంపెనీ చెబుతోంది.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

ఇదిలా ఉంటే, సాంప్రదాయ ఆటోరిక్షాలను కూడా ఈవీలుగా మార్చేందుకు జీరో21 ఓ కన్వర్షన్ కిట్ ను రూపొందించింది. డీజిల్ కార్గో మరియు ప్యాసింజర్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు కంపెనీ తన పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నుండి ఎలక్ట్రిక్ రెట్రోఫిటింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది, ఇది కేవలం 3-4 గంటల్లో సాధారణ ఆటోను ఎలక్ట్రిక్‌ ఆటోగా మార్చగలదు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ రెట్రోఫిట్టింగ్ కిట్‌లను చట్టబద్ధం చేసిన తర్వాత, కంపెనీ భారతదేశంలో సర్టిఫైడ్ రెట్రోఫిట్టింగ్ కంపెనీగా నమోదు చేయబడింది.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

ఈ సాఫ్ట్ లాంచ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మరియు ఐటీ మరియు వాణిజ్య శాఖ మంత్రి కె.టి. రామారావు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జహీరాబాద్ నియోజకవర్గం ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి (తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడు) మరియు తెలంగాణ ప్రభుత్వంలోని పరిశ్రమలు మరియు వాణిజ్యం (I&C) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ.. తెలంగాణా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవం వచ్చిందని, ఈవీల ఉత్పత్తి, వాడకం పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో జహీరాబాద్‌లో ఎంజీ పరిశ్రమ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేస్తున్నదని వెల్లడించారు. నిమ్జ్‌కు ట్రైటాన్‌, వన్‌మోటో లాంటి ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

త్వరలోనే మహీంద్రా కంపెనీ సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలు, ట్రాక్టర్ల ఉత్పిత్తిని కూడా ప్రారంభించనున్నదని కేటీఆర్ వివరించారు. భవిష్యత్తులో ఇతర ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడతాయని అన్నారు. జహీరాబాద్‌ ఆటోమొబైల్‌ హబ్‌గా మారుతోందని, వచ్చే ఆగస్టులో హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించననున్నట్టు ఆయన తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన జీరో21 (ZERO21) కంపెనీ నుండి రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు..

కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ల విడుదలపై జీరో21 వ్యవస్థాపకుడు మరియు సీఈఓ రాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, "Teer మరియు Smart Mule-X యొక్క జోడింపుతో తమ హై-స్పీడ్ ReNEW కన్వర్షన్ కిట్‌తో కూడిన తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించినట్లయిందని, వీటికి అదనంగా తాము స్మార్ట్ మ్యూల్ కార్గో మరియు స్మార్ట్ మ్యూల్ ప్యాసింజర్ వంటి లో-స్పీడ్ కేటగిరీ వాహనాలను కూడా విక్రయిస్తున్నామని తెలిపారు. చాలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లు ప్రాథమికంగా తక్కువ వేగంతో ఉన్నప్పటికీ, హై-స్పీడ్ మార్కెట్‌లో వృద్ధిని పుంజుకోవాలని తాము ఆశిస్తున్నామని, అందుకే ఈ రెండు ఉత్పత్తులు తమకు కీలకమైనవి చెప్పారు.

Most Read Articles

English summary
Zero21 unveils two high speed electric three wheelers in hyderabad
Story first published: Tuesday, June 28, 2022, 11:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X