జనసందోహంతో నిండిన '2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు.. డోంట్ మిస్

సుదీర్ఘ విరామం తరువాత మొదలైన 2023 ఆటో ఎక్స్‌పో ఇటీవలే ముగిసింది. 2020 తరువాత జరిగిన ఈ 2023 ఆటో ఎక్స్‌పో సందర్శించడానికి ఏకంగా 6.36 లక్షల మంది విచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. జనవరి 11 నుంచి ప్రారంభమైన ఈ ఆటో ఎక్స్‌పో గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా లెక్కకు మించిన వాహనాలు ఆవిష్కరించబడ్డాయి, అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో కొన్ని ఆధునిక వాహనాలు కూడా విడుదలయ్యాయి. మొత్తం మీద ఈ ఈవెంట్‌ విజయవంతంగా ముగిసింది. ఇందులో దాదాపు 15 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్నాయి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

2023 ఆటో ఎక్స్‌పో జనవరి 11 నుంచి ప్రారంభమైంది, అయితే మొదటి రెండు రోజులు అంటే జనవరి 11 మరియు 12 వ తేదీలు మీడియా కోసం కేటాయించబడ్డాయి. ఆ తరువాత సందర్శకుల కోసం కేటాయించబడ్డాయి. నిజానికి 2022 లో జరగాల్సిన ఈ ఆటో ఎక్స్‌పో కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న కంపెనీలు, ఆవిష్కరించబడిన వాహనాలు మొదలైన సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో దేశీయ వాహన తయారీ సంస్థలైన మహీంద్రా, టాటా మోటార్స్ వంటి వాటితో పాటు, మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా, ఎమ్‌జి మోటార్, ప్రవైగ్, లెక్సస్ మరియు బివైడి వంటి ప్రధాన కంపెనీలు కూడా పాల్గొన్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొన్ని చిన్న కంపెనీలు కూడా ఈ ఈవెంట్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

గత కొన్ని రోజులుగా చాలామంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్న హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు కూడా షారుఖ్ ఖాన్ సమక్షంలో విడుదలయింది. అంతే కాకుండా మారుతి సుజుకి తన ఫ్రాంక్స్ SUV మరియు 5 డోర్స్ జిమ్నీ SUV ని కూడా ఈ వేదికగా ఆవిష్కరించింది. టాటా మోటార్స్ కేవలం కార్లను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను కూడా ఇందులో ప్రదర్శించింది.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ద్విచక్ర వాహనాలు:

2023 ఆటో ఎక్స్‌పోలో కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆధునిక బైకులు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇందులో ఎక్కువ భాగం ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్స్ ఉండటం గమనార్హం. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ విభాగంలో ప్రదర్శించబడిన బైకులలో సుజుకి జిక్సర్ 250, బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, టీవీఎస్ అపాచే RTR 160 4V మొదలైనవి ఉన్నాయి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులు కాకుండా ఇందులో బెనెల్లీ, కీవే, మోటో మోరిని, క్యూజే మోటార్ మరియు జోంటెస్ వంటి చైనీస్ బ్రాండ్స్ కూడా ఈ వేదిక మీద అడుగుపెట్టాయి. బైకులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో కనిపించాయి. ఇందులో కనిపించిన దాదాపు అన్ని వాహనాలు త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదలవుతాయి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన కమర్షియల్ వెహికల్స్:

2023 ఆటో ఎక్స్‌పోలో ఈవెంట్‌లో కేవలం బైకులు, కార్లు మాత్రమే కాకుండా.. కమర్షియల్ వాహనాలు కూడా ఎక్కువగా ప్రదర్శించబడ్డాయి. ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా.. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ వంటి ముఖ్యమైన కమర్షియల్ వెహికల్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిచాయి. ఈ వేదికలో CNG వాహనాలు కూడా ప్రదర్శించబడ్డాయి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

అశోక్ లేలాండ్ సిఎన్‌జి మరియు ఎల్‌ఎన్‌జి వంటి వాహనాలతో పాటు ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్సులు మొదలైనవి కూడా ప్రదర్శించబడ్డాయి. ముఖ్యంగా ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలు ప్రదర్శించబడ్డాయి. రానున్న రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను తప్పకుండా ఆదరణ తగ్గుతుంది అనటానికి ఈ ఆటో ఎక్స్‌పో సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు పెట్రోల్ వాహనాల మీద పనిచేయడం తగ్గించాయి.

'2023 ఆటో ఎక్స్‌పో' గురించి ఆసక్తికరమైన విషయాలు

మొత్తం మీద అనేక కొత్త కొత్త ఉత్పత్తులకు వేదికగా 2023 ఆటో ఎక్స్‌పో నిరాఘాటంగా ముగిసింది. ఇందులో ఎంతో మంది వాహనం ప్రియులు సందర్శించి ఈ ఆధునిక వాహనాలను వీక్షించారు. మళ్ళీ ఈ ఆటో ఎక్స్‌పో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండే మరో రెండు సంవత్సరాలకు నిర్వహించబడుతుంది. అప్పుడు కూడా అనేక కొత్త ఉత్పత్తులు ఈ వేదిక మీద అడుగుపెడతాయి. ఇలాంటి ఆసక్తికరమైన కథనాలతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
2023 auto expo breaks visitor record 6 36 lakh people and new vehicles details
Story first published: Thursday, January 19, 2023, 15:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X