దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు

కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బిఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో కొత్త కొత్త ఉత్పత్తులను విరివిగా విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు కంపెనీ తన కొత్త X1 స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త X1 డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్లలో విడుదల చేసింది. ధరల విషయానికి వస్తే, BMW X1 sDrive18i xLine (పెట్రోల్) ధర రూ. 45.90 లక్షలు కాగా, BMW X1 sDrive18d M Sport (డీజిల్) ధర రూ. 47.90 లక్షలు. కంపెనీ ఈ కొత్త కారు బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే డీజిల్ వేరియంట్ డెలివరీలు మార్చి నుంచి పెట్రోల్ వేరియంట్స్ జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1

దేశీయ మార్కెట్లో విడుదలైన మూడవ తరం BMW X1 దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. ముందు భాగంలో గ్రిల్ కొంత పెద్దదిగా ఉంటుంది. బంపర్ బ్రష్డ్ సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అట్రాక్టివ్ హెడ్‌ల్యాంప్‌, ఇన్‌వర్టెడ్ ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌, 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌, వెనుక LED టెయిల్ ల్యాంప్‌ వంటివి ఉంటాయి.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే.. BMW X1 ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే చూడచక్కగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్‌లు, కొన్ని ఫిజికల్ బటన్స్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌ చూడవచ్చు. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్ల వరకు ఉంటుంది. మొత్తం మీద ఇంటీరియర్ చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.70 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్ మరియు ADAS టెక్నాలజీ ఉంటుంది. వీటితో పాటు LED హెడ్‌లైట్లు, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఆపరేషన్ మరియు పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ కూడా పొందవచ్చు. ఫీచర్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నాయి.

ముందుగా చెప్పుకున్నట్లు కొత్త BMW X1 రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది, ఇందులోని 1.5 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 136 హెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక డీజిల్ ఇంజిన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 150 హెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1

కొత్త BMW X1 పెట్రోల్ వెర్షన్ కేవలం 9.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో డీజిల్ ఇంజిన్ కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.03 కిమీ మైలేజ్ అందిస్తే, డీజిల్ ఇంజిన్ లీటరుకు 19.23 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. కావున మైలేజ్ మరియు టాప్ స్పీడ్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త BMW X1 ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా రూపొందించబడింది. కావున మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి, అంతకు మించిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది దేశీయ విఫణిలో మెర్సిడెస్ బెంజ్ GLA, ఆడి క్యూ3, మినీ కంట్రీమ్యాన్ మరియు వోల్వో ఎక్స్‌సి 40 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bmw x1 launched in india price features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X