ప్రపంచంలో మొట్ట మొదటి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్.. ఎలా ఉందో చూసెయ్యండి

సాధారణంగా వ్యవసాయంలో ట్రాక్టర్ల పాత్ర ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఒకప్పుడు వ్యవసాయానికి ఎద్దులను ఎక్కువగా వినియోగిస్తే, ఈ ఆధునిక కాలంలో యంత్రాల ద్వారా వ్యవసాయం ముందుకు సాగుతోంది. ట్రాక్టర్ నడవటానికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరం, అవి ఏమి అవసరం లేదంటోంది బ్రిటీష్ కంపెనీ.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో డీజిల్ తో నడిచే ట్రాక్టర్లు, పెట్రోల్ లో నడిచే ట్రాక్టర్లు చివరికి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే బ్రిటీష్ కంపెనీ ట్రాక్టర్ నడవటానికి అవి ఏమి అవసరం లేదని, కేవలం ఆవు పేడ ఉంటే చాలని చెబుతోంది. చెప్పడమే కాదు అలాంటి ట్రాక్టర్ తయారు చేసింది కూడా. ఇది ఆవు పేడతో నడిచే ప్రపంచంలోనే మొదటి ట్రాక్టర్.

ప్రపంచంలో మొట్ట మొదటి ఆవు పేడతో నడిచే ట్రాకర్

బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ తయారు చేసి చేసి ప్రపంచ దేశాలతో ఔరా అనిపించుకుంటున్నారు. వీరు దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ గా మార్చారు. అయితే ట్రాక్టర్ కు ఒక క్రయోజెనిక్ ట్యాంక్ అమర్చి, ద్రవ రూపంలోని ఈ ఇంధనాన్ని మండించారు. ఆ ఇంధనంతో 270 బిహెచ్‌పి సామర్థ్యం గల ట్రాక్టర్ ను విజయవంతంగా ముందుకు నడిపించగలిగింది.

బయోమీథేన్ ద్వారా నడిచిన ఈ ట్రాక్టర్ డీజిల్ ట్రాక్టర్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. నడవగలిగింది. అది మాత్రమే కాకుండా డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ లేటెస్ట్ ట్రాక్టర్ తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు. క్రయోజెనిక్ ఇంజిన్ దాదాపు 160 డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసి బయో మీథేన్ ను ద్రవ రూపంలో ఉండేలా చేస్తుందని వారు తెలిపారు. కార్నిష్ కంపెనీ బెన్నామన్ ఈ ట్రాక్టర్ ను తయారు చేసింది.

ప్రపంచంలో మొట్ట మొదటి ఆవు పేడతో నడిచే ట్రాకర్

శాస్త్రవేత్తలు కార్న్‌వాల్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్రాక్టర్ యొక్క పైలట్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రాక్టర్ నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు కూడా ఇతర మోడల్స్ తో పోలిస్తే చాలా తక్కువ అని నిర్థారించారు. పట్టణ ప్రాంతాల్లోకంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ట్రాక్టర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే నగరాల్లో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆవులు విరివిగా ఉంటాయి, కావున ఇలాంటి ట్రాక్టర్లు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం వివిధ రంగాల్లో బయోమీథేన్ వినియోగం చాలా ఎక్కువగానే ఉంది. రవాణా, వ్యవసాయం రంగంలో భవిష్యత్తులో ఇంధనంగా బయో మీథేన్ వినియోగం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బయో మీథేన్ వినియోగం తప్పకుండా ఇన్‌పుట్ ఖర్చులు, మరియు ఇతర ఇంధన ఖర్చులను కూడా భారీగా తగ్గిస్తుంది. ఇలాంటి తప్పకుండా రానున్న రోజుల్లో విరివిగా వినియోగంలోకి రానున్నాయని ఆశిస్తున్నాము.

ప్రపంచంలో మొట్ట మొదటి ఆవు పేడతో నడిచే ట్రాకర్

ఇదిలా ఉండగా భారతదేశంలో ఆవుని చాలా పవిత్రంగా మరియు పరమ పూజ్యనీయంగా పూజిస్తారు. ఆవు వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆవు పేడ ఏకంగా వాహనాలు ముందుకు కదలడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పటివరకు ఆవు పేడను పంట పొలాలకు ఎరువుగా, మరియు గ్యాస్ గా వినియోగించారు. రానున్న రోజుల్లో ఇది వాహనాలను నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో బయో గ్యాస్ తో నడిచే ట్రాక్టర్లు చాలా ఎక్కువగా అందుబాటులో వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Cow dung powered tractor details in telugu
Story first published: Wednesday, January 18, 2023, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X