మహీంద్రా XUV400 EV కొనాలనుకునే వారి కోసం.. ప్రత్యేక కథనం

మహీంద్రా కంపెనీ ఇటీవలే తన ఎలక్ట్రిక్ SUV అయిన XUV400 EV ధరలను అధికారికంగా వెల్లడిందింది. అయితే కంపెనీ ఇంకా డెలివరీలను స్వీకరించడం ప్రారంభించలేదు. కానీ ఈ SUV కొనాలనుకునే వారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక కథనం.

వేరియంట్స్ & ధరలు:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి EC (3.2kw), EC (7.2kw) మరియు EL (7.2kw). వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు, రూ. 16.49 లక్షలు మరియు రూ. 18.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ధరలు మొదటి 5000 యూనిట్లకు (ప్రతి వేరియంట్‌కు) మాత్రమే వర్తిస్తాయి.

మహీంద్రా XUV400 EV కొనాలనుకునే వారి కోసం

బుకింగ్స్ & కలర్ ఆప్సన్స్:

మహీంద్రా కంపెనీ గత నెలలో XUV400 SUV ని ఆవిష్కరించినప్పటికీ ఇంకా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించలేదు. కావున ఈ SUV కోసం కంపెనీ ఈ నెల 26 నుంచి బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. డెలివరీలు 2023 మార్చి నుంచి ప్రారంభమవుతాయి. XUV400 EV ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్‌ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్ అనే కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ మరియు రేంజ్:

మహీంద్రా XUV400 EV రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది. అవి 34.5kWh బ్యాటరీ మరియు 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 hp మరియు 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కూడా పొందుతాయి. ఇది కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది గంటకు 150 కిమీ వరకు వేగవంతం అవుతుంది. XUV400 ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

మహీంద్రా XUV400 EV లోని 34.5 kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 375 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని 39.4 kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

డిజైన్:

XUV400 EV కాపర్ కలర్ ఎలిమెంట్స్ కొత్త ఎక్స్‌యూవీ400 ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400లో డైమండ్-కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉన్న కొత్త హై గ్లోస్ అల్లాయ్ వీల్స్‌ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తాయి. కస్టమర్లు సమీపంలో ఉన్న డీలర్‌షిప్ వద్ద టెస్ట్ డ్రైవ్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 34 నగరాల్లో టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమయ్యాయి.

ఫీచర్స్:

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫీచర్స్ విషయానికి వస్తే, టాప్-స్పెక్ వెర్షన్ మహీంద్రా యొక్క అడ్రినోఎక్స్ సాఫ్ట్‌వేర్‌తో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఏసీ కంట్రోల్స్ మరియు ఇతర ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

XUV400 యొక్క కొలతలు విషయానికి వస్తే, ఇది 4200 మిమీ పొడవు, 1821 మిమీ వెడల్పు మరియు 1634 మిమీ ఎత్తు ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV యొక్క వీల్‌బేస్ 2600 మిమీ మరియు 378 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఈ SUV మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ ఈబిడి, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌ వంటివి ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahidra xuv400 top things to know price range features performance and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X