మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా తన XUV700 SUV ధరలను పెంచిన వెంటనే ఇప్పుడు తన స్కార్పియో క్లాసిక్ ధరలను కూడా పెంచుతున్నట్లు తెలిపింది. స్కార్పియో క్లాసిక్ ధరలు పెరగటం ఇదే మొదటి సారి. పెరిగిన స్కార్పియో క్లాసిక్ ధరను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా కంపెనీ యొక్క కొత్త స్కార్పియో క్లాసిక్ గత ఏడాది ఆగష్టు నెలలో విడుదలైంది. ఈ లేటెస్ట్ SUV విడుదలైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ధరల పెరుగుదలను అందుకోలేదు. కావున ఇప్పుడు ధరలు అమాంతం పెరిగాయి. కంపెనీ యొక్క S మరియు S11 ధరలు రూ. 65,000 పెరిగి వరుసగా రూ. 12.64 లక్షలు మరియు రూ. 16.14 లక్షలకు అందుబాటులో ఉంది. ధరల పెరుగుదలకు ముందు ఈ SUV ధరలు రూ. 11.99 లక్షలు మరియు రూ. 15.49 లక్షలు.

మొదటిసారి పెరిగిన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధరలు: వివరాలు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 7సీటర్ మరియు 9 సీటర్ కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులో ఉంటుంది. S మరియు S11 ట్రిమ్‌లు రెండు కూడా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉన్నాయి. 7 సీటర్స్ విషయానికి వస్తే, ఇది 2-3-2 లేఅవుట్ మధ్యలో బెంచ్ సీటు, మూడవ వరుసలో రెండు సింగిల్ జంప్ సీట్లు మరియు 2-2-3 సీటింగ్ లేఅవుట్ వంటివి ఉన్నాయి. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో బెంచ్ సీటు ఉన్నాయి.

Mahindra Scorpio Classic Price
Variant New Price Old Price Difference
S ₹12.64 Lakh ₹11.99 Lakh ₹65,000
S11 ₹16.14 Lakh ₹15.49 Lakh ₹65,000

ఇక 9 సీటర్ విషయానికి వస్తే, 2-3-4 లేఅవుట్‌ కలిగి ఉండటమే కాకుండా మూడవ వరుసలో డబుల్ సైడ్ ఫేసింగ్ జంప్ సీట్లు అందుబటటలో ఉన్నాయి. ఇది కేవలం S ట్రిమ్ కి మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. S11 లో ఈ 9 సీటర్ ఆప్సన్ లేదు. కావున 9 సీటర్ అనేహి కేవలం ఒకే వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా రెండూ కూడా ఆధునికంగా ఉంటాయి.

కొత్త స్కార్పియో క్లాసిక్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త లోగో, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ , ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, అప్‌డేట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, ఇరువైపులా డ్యూయల్ టోన్ క్లాడింగ్ మరియు రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ వంటివి ఉన్నాయి.

స్కార్పియో క్లాసిక్ ఆధునిక ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది. ఇంటీరియర్ 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ థీమ్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి.

భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2 లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్‌ పొందుతుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ స్కార్పియో క్లాసిక్‌లో రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే ఇవ్వబడుతుంది మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇవ్వబడదు. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది.

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా స్కార్పియో క్లాసిక్ ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు ఉపయోగపడే సేఫ్టీ ఫీచర్స్ కూడా అందిస్తుంది. కావున ఈ SUV అన్ని విధాలుగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా యొక్క స్కార్పియో క్లాసిక్ బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ S మరియు టాప్-స్పెక్ S11 ట్రిమ్స్ కోసం 5 నుంచి 6 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra scorpio classic prices hiked details in telugu
Story first published: Wednesday, February 1, 2023, 6:30 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X