XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?

మహీంద్రా కంపెనీ తన XUV400 EV కోసం ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మహీంద్రా XUV400 EV బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే కంపెనీ 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ. 21,000 తో బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా ఇప్పుడు బుకింగ్స్ పరంగా దూసుకెలుతోంది. XUV400 EV కోసం వెయిటింగ్ పీరియడ్ ఇప్పడు 7 నెలల వరకు ఉంది. కంపెని 2023 వ సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 20,000 యూనిట్లను మాత్రమే అందించడానికి సన్నాహాలు సిద్ధం చేసింది. అయితే బుకింగ్స్ మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది. డెలివరీలు మార్చి నుంచి ప్రారంభమవుతాయి.

XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా

మహీంద్రా కంపెనీ ఈ XUV400 EV ని మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. అవి EC (3.2kw), EC (7.2kw) మరియు EL (7.2kw). ఇందులో మొదటి EL వెరిణయంట్స్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఆ తరువాత మిగిలిన వేరియంట్స్ పండుగ సీజన్లో ప్రారంభమవుతాయి. మహీంద్రా XUV400 EV ధరలు రూ. 15.99 లక్షల నుంచి రూ. 18.99 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు మొదటి 5,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.

మహీంద్రా XUV400 EV మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది మార్కెట్లో మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్‌ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్ అనే కలర్ ఆప్సన్స్. డిజైన్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి.

XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా

XUV400 EV ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అబుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ వంటి వాటితో పాటు ఏసీ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మహీంద్రా కంపెనీ ఇందులో ప్రస్తుతం వినియోగదారులకు ఎలాంటి ఫీచర్స్ అవసరమో దృష్టిలో ఉంచుకుని అలాంటి ఫీచర్స్ అందించడం జరిగింది.

మహీంద్రా XUV400 EV లో 34.5kWh బ్యాటరీ మరియు 39.4kWh బ్యాటరీ అనే రెండు ఫ్యాక్స్ ఉంటాయి. ఈ రెండూ 150 hp మరియు 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కూడా పొందుతాయి. ఇది కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది గంటకు 150 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా

మహీంద్రా XUV400 EV లోని 34.5 kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 375 కిమీ రేంజ్ మరియు 39.4 kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.

ఇక చివరగా మహీంద్రా యొక్క XUV400 EV సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందించినట్లు తెలుస్తోంది. కావున ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ ఈబిడి, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra xuv400 ev bookings 10000 units details
Story first published: Tuesday, January 31, 2023, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X