Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మారుతి 5 డోర్ జిమ్నీ బుకింగ్స్ పెరిగాయి.. బుకింగ్ ప్రైస్ కూడా పెరిగింది: ఇక్కడ చూడండి
ఇటీవల మారుతి సుజుకి తన 5 డోర్ జిమ్నీ SUV ని 2023 ఆటో ఎక్స్పో వేదికగా ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఆవిష్కరించిన రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఈ SUV కోసం ఇప్పటికే 3000 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చేసాయి.
మారుతి సుజుకి తన ఆఫ్ రోడర్ SUV ని ఆవిష్కరించిన కేవలం రెండు రోజుల్లోనే 3000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. ప్రారంభంలో ఈ SUV బుకింగ్ ప్రైస్ రూ.11,000 గా ఉండేది. అయితే బుకింగ్స్ పెరిగిన తరుణంలో కంపెనీ బుకింగ్స్ ప్రైస్ రూ.14,000 పెంచింది. కావున మారుతి జిమ్నీ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పుడు రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ బుకింగ్ ప్రైస్ రానున్న రోజుల్లో మరింత ఉందా.. లేదా అనేది స్పష్టంగా తెలియదు.
మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ కొనాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ యొక్క Nexa డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్ రోడ్ SUV కఠినమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా రూపొందించబడింది. ఈ SUV ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి ముందే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది జీటా మరియు ఆల్ఫా అనే రెండు ట్రిమ్స్ లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది.
కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా జిమ్నీ యొక్క నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ పంపుతుంది.
మారుతి 5 డోర్స్ జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఈ SUV ధరలను ఇంకా ప్రకటించలేదు, అయితే ధరలు తప్పకుండా త్వరలోనే వెల్లడవుతాయి. కొత్త జిమ్నీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. కావున ఈ SUV నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్‌లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.
మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ కలర్ బంపర్లు, ఫ్లాప్ టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లైడింగ్ రియర్ విండో వంటివి ఉన్నాయి. ఈ SUV లో 2 కెప్టెన్ సీట్లు మరియు వెనుకవైపు 3 మంది ప్రయాణీకులకు ఒక బెంచ్ ఉంటాయి. సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రూప్ మాత్రం బ్లాక్ కలర్ ఉండటం చూడవచ్చు.
ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. డాష్‌బోర్డ్ రెండు చివరలో రౌండ్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కింద మ్యాన్యువల్ బటన్లు ఉండటం కూడా గమనించవచ్చు. రెండవ వరుస ప్రయాణికుల కోసం బాటిల్ హోల్డర్స్ మరియు ఛార్జింగ్ సాకేట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.
పరిమాణం పరంగా కూడా కొత్త మారుతి జిమ్నీ 5-డోర్ విశాలంగా ఉంటుంది. ఈ SUV పొడవు 3,985 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,720 మిమీ వరకు ఉంటుంది. ఇది 3 డోర్ వెర్షన్ వీల్‌బేస్ కంటే ఎక్కువ (2,590 మిమీ పొడవైన) వీల్‌బేస్‌ను పొందుతుంది. కావున ఇది 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఇది 85 లీటర్ బూట్ స్పేస్, 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 48 లీటర్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది.