రూ. 4 కోట్ల ఖరీదైన లగ్జరీ రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీలో తళుక్కుమన్న పూజా హెగ్డే.. ఈ కారుకు ఇంత ధర ఎందుకో తెలుసా.??

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసింది. పూజా కార్ల గ్యారేజ్‌లో ఇప్పుడు రూ. 4 కోట్ల విలువైన ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వచ్చి చేరింది.

సినీ సెలబ్రిటీల్లో చాలా మంది ఇప్పుడు లగ్జరీ కార్లను కలిగి ఉండటం కామన్‌.. లగ్జరీ కార్లలో వారు బయటకి వస్తే ఇక ఫ్యాన్స్‌కు పండగే. సౌత్‌ ఇండియా సినిమాల్లో బిజీగా ఉంటున్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇక ఈ బుట్టు బొమ్మ కూడా ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకుంది.

Range-Rover-SUV-Pooja-Hegde

పూజా రూ. 4 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ SUVని కొనుగోలు చేసింది. పూజా తన కొత్త కారులో బయటకు వచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను "కార్స్ ఫర్ యు" తమ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది.

వీడియోను చూసినట్లయితే పండుగ సందర్భంగా పూజా హెగ్డే సరికొత్త ల్యాండ్‌ రోవర్‌ రేంజ్ రోవర్ SUV ను కొనుగోలు చేసినట్లుగా అనిపిస్తుంది. కారుకు పూల దండలతో, పూజలు చేసినట్లుగా అనిపించినట్లుగా చూడవచ్చు. కారు దిగిన అనంతరం పూజా ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఈ లగ్జరీ ఎస్‌యూవీకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రేంజ్ రోవర్ SUV ప్రస్తుతం ల్యాండ్‌ రోవర్‌ నుంచి ఫ్లాగ్‌షిప్ SUV.

Range-Rover-SUV-Pooja-Hegde

ఈ లగ్జరీ SUVని ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్ బాబు, మోహన్‌ లాల్‌, నిమ్రత్ కౌర్, రణ్‌బీర్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సోనమ్ కపూర్, మలైకా అరోరా వంటి ప్రముఖ నటులు ఇప్పటికే ఈ SUVని కలిగి ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ వద్ద రేంజ్‌ రోవర్‌లు రెండు ఉండటం విశేషం.

పూజా హెగ్డే కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ SUV ఏ వేరియంట్ అనేది స్పష్టంగా తెలియదు. ఇందులో ఫీచర్లను పరిశీలిస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన 35-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది వీల్స్‌ వైబ్రేషన్‌లు, టైర్ శబ్దం మరియు కౌంటర్-క్యాన్సిల్‌ సంకేతాలను ఉపయోగించి ఇంజిన్ సౌండ్స్‌ను ఫిల్టర్ చేస్తుంది.

Range-Rover-SUV-Pooja-Hegde

సరికొత్త ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌లో కొత్త 13.1-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు రియర్-సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

రేంజ్ రోవర్ SUV మొదటిసారిగా 3వ వరుస సీటులో కూడా అందుబాటులో ఉంది. కాగా ఇది LWB(లాంగ్‌ వీల్‌ బేస్‌) వెర్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. కాగా ఈ లగ్జరీ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Range-Rover-SUV-Pooja-Hegde

వీడియోను చూసినట్లయితే పూజా షాంపైన్ గోల్డ్ షేడ్‌ను పోలి ఉండే లాంటౌ బ్రాంజ్‌ కలర్‌లో పూజా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ SUV యొక్క పెట్రోల్ వెర్షన్‌ను పరిశీలిస్తే.. ఇది 3.0-లీటర్ పెట్రోల్, PHEV మరియు 4.4-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఇక డీజిల్ ఇంజిన్ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్‌ను కలిగి ఉంది.

ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ 346 Bhp వద్ద 700 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు రెండూ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంది. భారత్‌లో సరికొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ SUV బేస్‌ వేరియంట్‌ ధర రూ. 2.39 కోట్లుగా ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ. 4.17 కోట్లు(ఎక్స్-షోరూమ్).

Range-Rover-SUV-Pooja-Hegde

పూజా హెగ్డే వద్ద రేంజ్ రోవర్ SUVతో పాటు ఆడి క్యూ7, జాగ్వార్ నుంచి లగ్జరీ సెడాన్, పోర్షే కయెన్, ఇంకా BMW 5-సిరీస్ సెడాన్ వంటి సూపర్‌ కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం పూజా కొనుగోలు చేసిన ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ ఏ వేరియంట్‌ అనేది స్పష్టంగా తెలియదు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 25, 2023, 15:00 [IST]
English summary
Pooja hegde buys a luxury land rover range rover suv worth rs 4 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+