టాటా ఆల్ట్రోజ్ Racer అన్ని వివరాలు.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ భారతదేశంలో ఇటీవల 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టియస్ట్ వెర్షన్ 'ఆల్ట్రోజ్ రేసర్‌' (Altroz Racer) ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వంటి అన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ రేసర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఎంతోమంది ప్రజల దృష్టిని ఆకర్శించగలిగింది. టాటా మోటార్స్ ఈ కారుని దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ సాధారణ ఆల్ట్రోజ్ మాదిరిగానే కనిపించినప్పటికీ ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.

టాటా ఆల్ట్రోజ్ Racer అన్ని వివరాలు

డిజైన్:

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ చూడటానికి స్టాండర్డ్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుంది. అయితే ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. దీని కోసం కంపెనీ ఇందులో కొన్ని అప్డేట్స్ అందించింది. ఇందులో రియర్ స్పాయిలర్ మరియు వాయిస్ అసిస్ట్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్‌. ఇవి మాత్రమే కాకుండా ఇందులో హెడ్‌లైట్లు, ఫ్రంట్ గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్‌ వంటివి ఉన్నాయి.

ఇంటీరియర్ డిజైన్:

బయటవైపు చూటడానికి స్టాండర్డ్ ఆల్ట్రోజ్ మోడల్ ని పోలి ఉన్నప్పటికీ, ఎక్స్టీరియర్ ఎక్కువ అప్డేట్ పొందింది. ఇందులో హెడ్‌రెస్ట్‌పై ఎక్కువ భాగం రెడ్ యాక్సెంట్‌లు గమయించవచ్చు. అంతే కాకుండా లోపల కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కొత్త ఆల్-బ్లాక్ అపోల్స్ట్రే చూడవచ్చు. క్యాబిన్ కూడా విశాలంగా ఉండి వాహన వినియోగదారులకు మంచి కంపర్ట్ అందిస్తుంది. మొత్తం మీద బయట డిజైన్ మరియు లోపల డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

టాటా ఆల్ట్రోజ్ Racer అన్ని వివరాలు

ఫీచర్స్:

టాటా ఆల్ట్రోజ్ రేసర్ యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం ఉంది. ఇది కొత్త సాఫ్ట్‌వేర్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌ వంటి వాటికి మద్దతు ఇస్తుంది. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటివి ఉన్నాయి. లోపల కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కొత్త ఆల్-బ్లాక్ అపోల్స్ట్రే చూడవచ్చు.

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్, ఆల్ట్రోజ్ iTurbo మాదిరిగానే 1.2 లీటర్, త్రీ సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది ఇప్పుడు 120 హెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. గతంలో టాటా ఆల్ట్రోజ్ ఇంజిన్ 110 హెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ అందించేది. దీన్ని బట్టి చూస్తే టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎక్కువ పవర్ డెలివరీ చేస్తుందని తెలుస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ Racer అన్ని వివరాలు

ఆల్ట్రోజ్ రేసర్ iTurbo లోని ఇంజిన్ పొందినప్పటికీ గేర్‌బాక్స్‌ మాత్రం వేరుగా ఉంటుంది. iTurbo ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ పొందుతుంది, కానీ ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అయితే ఇందులో ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే ఈ ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే సమాచారం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అంతే కాకుండా కంపెనీ ఈ ఎడిషన్ యొక్క ధరలు కూడా వెల్లడించలేదు. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో టాటా ఆల్టోజ్ రేసర్ ఎడిషన్ రూ. 9.99 లక్షల నుంచి రూ. 12.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైతే హ్యుందాయ్ i20 N లైన్‌ కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata altroz racer launch soon design features and engine details
Story first published: Wednesday, January 18, 2023, 14:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X