మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు

మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి 2023 వ సంవత్సరంలో కొత్త వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో కంపెనీ విడుదల చేయనున్న కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి 5 డోర్స్ జిమ్నీ:

ఎంతో మంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్న 5 డోర్స్ జిమ్నీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగు పెట్టింది. ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన బుకింగ్స్ పొందగలిగింది. ఇప్పుడు ఈ SUV కోసం రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు

కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా జిమ్నీ యొక్క నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ పంపుతుంది.

మారుతి ఫ్రాంక్స్:

మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా తన ఆధునిక SUV ఫ్రాంక్స్ (Fronx) ను ఆవిష్కరించింది. ఈ SUV మార్కెట్లో అడుగుపెట్టిన నాటి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. విక్రయాలు 2023 మార్చి నాటికి మారుతి నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా మరియు ఆల్ఫా అనే ఐదు ట్రిమ్స్ లో లభిస్తుంది.

మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు

మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ 88.5 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT యూనిట్‌తో పేర్కొనవచ్చు. ఇక 1.0-లీటర్, టర్బోచార్జ్డ్ ఇంజన్ 98.6 బిహెచ్‌పి పవర్ మరియు 147.6 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఉండే అవకాశం ఉంటుంది.

మారుతి బ్రెజ్జా CNG:

మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో తన బ్రెజ్జా CNG SUV ని కూడా ఆవిష్కరించింది. ఈ కొత్త CNG మోడల్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే డిజైన్ పరంగా పెద్దగా మార్పులు జరగలేదు. కావున డిజైన్ అదే మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే పనితీరు పరంగా మారుతి బ్రెజ్జా CNG చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంటుంది.

మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు

మారుతి సుజుకి బ్రెజ్జా CNG అదే 1.5 లీటర్ కె15సి డ్యూయల్‌జెట్ ఇంజన్‌ పొందే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ మోడ్ లో 100 hp పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే CNG మోడ్ లో మారుతి బ్రెజ్జా 88 hp పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ & మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ MPV:

టయోటా మరియు సుజుకి మధ్య ఉన్న భాగస్వామ్యంలో భాగంగానే ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ MPV రానుంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ MPV 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 2.0-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్సన్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీని గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Upcoming maruti suzuki cars india details in telugu
Story first published: Sunday, January 29, 2023, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X