21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ డేట్స్ వెల్లడి
దేశంలో కెల్లా అత్యంత విలువైన పురాతన కార్స్ అండ్ బైక్స్ ర్యాలీ '21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ' ఐదవ ఎడిషన్ డేట్స్ ఖరారయ్యాయి. ఫిబ్రవరి 21, 22వ తేదీలలో ఈ పురాతన కార్ ర్యాలీ మరియు ఆటో షోని ఢిల్లీలో నిర్వహించనున్నారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యంత అరుదైన సుమారు 201కి పైగా పురాతన కార్లు, బైక్‌లను ఈ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ ఏడాది వింటేజ్ కార్ ర్యాలీని పెద్ద మొత్తంలో నిర్వహించనున్నామని, ఇది మరింత విలాసవంతంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మలేషియా, సింగపూర్, యూకేలలోని వింటేజ్ కార్ క్లబ్స్ నిర్వహిస్తున్న అత్యంత విలువైన పురాతన కార్ల ప్రదర్శన నుంచి స్ఫూర్తి పొంది మనదేశంలో ఈ 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీని డిజైన్ చేశారు.
ఫిబ్రవరిలో జరగనున్న 21గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీలో, మనదేశంలో వివిధ యజమానుల వద్ద ఉన్న అత్యంత విలువైన పురాతన కార్లు, మోటార్‌సైకిళ్లను ఎంపిక చేసి, వీక్షకుల సందర్శనార్థం ఒకేచోట ప్రదర్శనకు ఉంచుతారు.
అనేక అంతర్జాతీయ కార్లు, రాయల్ ఫ్యామిలీలకు చెందిన కార్లు కూడా ఇందులో భాగం కానున్నాయి. ఈ కార్యక్రమ సమయంలో మంచి భోజనం, సంగీతం, బోలెడన్ని వింటేజ్ కార్లు, లక్షలాధి మంది వీక్షకులతో సందడిగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ పురాతన కార్లతో ఓ ర్యాలీని కూడా నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఢిల్లీలోని ఎర్ర కోట నుంచి ప్రారంభమై దాదాపు 52 కిలోమీటర్లు ప్రయాణించి గుర్గావ్‌వోని లీజర్ వ్యాలీ పార్క్ వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యేకంగా కవర్ చేయనుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








