27 కి.మీ మైలేజ్, ధర రూ.11 లక్షలు.. ఈ పాపులర్ మారుతి SUVని కొనడానికి ఎవరికీ మనసొప్పడం లేదు
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒకప్పుడు బాగా అమ్ముడుపోయిన ఎస్యూవీ. మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్నా కొద్ది నెలలుగా దీని అమ్మకాలు తగ్గుతున్నాయి. ఎందుకలా జరుగుతోంది? కొనుగోలుదారులు ఈ కారును ఎందుకు అంతగా ఇష్టపడటం లేదో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒకప్పుడు చాలా పాపులర్ SUVగా ఉండేది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది దీన్ని కొనేందుకు ఆసక్తి చూపేవారు. దాని అమ్మకాలు కూడా బాగానే ఉండేవి. కానీ, గత కొన్ని నెలలుగా దీని అమ్మకాల సంఖ్య అంత ఆశాజనకంగా లేదు. ఈ ఏప్రిల్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.

గత నెల (ఏప్రిల్ 2025)లో మారుతి సుజుకి ఇండియా కేవలం 7,154 యూనిట్ల గ్రాండ్ విటారా SUVలను మాత్రమే అమ్మగలిగింది. అదే 2024 ఏప్రిల్‌లో అయితే 7,651 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఏడాదికి ఏడాది అమ్మకాలు దాదాపు -6శాతం తగ్గాయి.
ఈ సంవత్సరం మొదట్లో కూడా మారుతి సుజుకి గ్రాండ్ విటారా కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. మార్చిలో 10,418 యూనిట్లు, ఫిబ్రవరిలో 10,669 యూనిట్లు, జనవరిలో 15,784 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే అమ్మకాల్లో బాగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

గ్రాండ్ విటారా SUV అమ్మకాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉందో కంపెనీ స్పష్టంగా చెప్పడం లేదు. కానీ, ఈ కారు ధర ఎక్కువగా ఉండడం వల్ల ఇతర కంపెనీలు మంచి డిజైన్, ఫీచర్లతో SUVలను తక్కువ ధరకే అమ్ముతుండటంతో దీని అమ్మకాలు తగ్గుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ప్రత్యేకతలు: ఈ SUV ధర కొంచెం ఎక్కువగానే ఉంది. దీని ధర రూ. 11.42 లక్షల నుంచి రూ. 20.68 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 5 సీట్ల కారు, ప్రయాణికులు సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు. అలాగే ఎక్కువ లగేజీ పెట్టుకోవడానికి 373 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

కొత్త గ్రాండ్ విటారా బలమైన ఇంజన్‌తో వస్తుంది. ఇది 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ & మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్) ఇంజన్ ఆప్షన్‌లతో పాటు CNG పవర్‌ట్రెయిన్‌తో కూడా లభిస్తుంది. ఇది లీటరుకు 19.38 కి.మీ నుంచి 27.97 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ SUV చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్‌తో సహా అనేక రంగుల్లో అందుబాటులో ఉంది.
కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUVలో చాలా ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS(టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), 360 డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి. ఇన్ని మంచి ఫీచర్లు ఉన్నా ధర ఎక్కువ కావడంతో కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








