మారుతి కార్లకు ముందుంది ముసళ్ల పండుగ!
ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో అగ్రగామి ఎవరు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి. ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యధిక శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా మారుతు సుజుకి ఈ ఏడాది కాంపిటీటర్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనుంది.
మారుతి సుజుకిని టార్గెట్ చేస్తూ, అనేక కార్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి. మారుతి సుజుకి ఇండియాకి ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో ఉన్న పట్టు, కొన్ని ఇతర సెగ్మెంట్లలో లేదు.
ఈ బలహీనతను అవకాశంగా తీసుకున్న పలు ఇతర కార్ కంపెనీలు ఆయా సెగ్మెంట్లలో కొత్త వాహనాలతో ముందుకు రాబోతున్నాయి. ఆ వివరాలంటే ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

1. హ్యుందాయ్ ఎలైట్ ఐ20
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సుజుకి నుంచి ఓ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ వస్తుందని (సియాజ్ ఆధారంగా) మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే, ఈ మోడల్‌కు గట్టి పోటీనిచ్చేందుకు హ్యుందాయ్ ఇప్పటికే తమ ఎలైట్ ఐ20 మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేసి మంచి విజయాన్ని చవిచూస్తోంది.

2. ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్
మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ జోరుకు చెక్ పెట్టేందుకు ఫోర్డ్ ఓ సరికొత్త తరం (నెక్స్ట్ జనరేషన్) ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

3. హోండా జాజ్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సుజుకి నుంచి రానున్న ఫ్యూచర్ మోడల్‌కి పోటీగా జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తమ సరికొత్త తరం (న్యూ జనరేషన్) హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేయనుంది.

4. ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్
ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మోడల్‌కి పోటీగా ఫోర్డ్ ఇండియా తమ నెక్స్ట్ జనరేషన్ ఫిగో ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫిగో కాంపాక్ట్ సెడాన్‌ను కూడా ఈ ఏడాదే మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

5. ఐ20 యాక్టివ్
మారుతి సుజుకి క్రాసోవర్ సెగ్మెంట్లో ప్రవేశపెట్టనున్న (ఎస్ఎక్స్4 క్రాస్) మోడల్‌కు పోటీగా హ్యుందాయ్ ఇప్పటికే ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌ను ప్రవేశపెట్టి పోటీలో ముందుంది.

6. టాటా నానో ఏఎమ్‌టి
ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)ను తొలిసారిగా మార్కెట్‌కు పరిచయం చేసిన మారుతి సుజుకి ఈ టెక్నాలజీలో ఇతర కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఇప్పటికే జెస్ట్ ఏఎమ్‌టిని విడుదల చేసిన టాటా మోటార్స్ త్వరలోనే నానో ఏఎమ్‌టిని విడుదల చేయనుంది.

7. రెనో లాజీ ఎమ్‌పివి
ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) సెగ్మెంట్లో ఎర్టిగా మోడల్‌ను అందిస్తున్న మారుతి సుజుకి త్వరలోనే ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా నుంచి గట్టి పోటీని ఎదుర్కునే అవకాశం ఇంది. ఈ సెగ్మెంట్లో రెనో తమ పాపులర్ లాజీ ఎమ్‌పివిని విడుదల చేయనుంది.

8. హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రస్తుతం మారుతి సుజుకి నుంచి ఎలాంటి ఉత్పత్తి అందుబాటులో లేదు. ఈ సెగ్మెంట్లోని డిమాండ్‌ను మారుతి కంటే ముందుగా క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








