మరో ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. 'ఏరోమొబిల్ 2.5'
అమెరికాకు చెందిన టెర్రాఫుజియా కంపెనీ 'ట్రాన్సిషన్' అనే ఓ ఫ్లయింగ్ కారును తయారు చేసిన సంగతి తెలిసినదే. ఇది ఇంకా పూర్తిగా మార్కెట్లోకి రాకముందే, స్లోవేకియాకు చెందిన ఓ ఇంజనీర్ మరో సరికొత్త ఫ్లయింగ్ కారును తయారు చేశారు. స్లోవేకియన్ ఇంజనీర్ స్టీఫెన్ క్లీన్ 'ఏరోమొబిల్ 2.5' (Aeromobil 2.5) అనే ఫ్లయింగ్ కారును తయారు చేశారు.
రోడ్డుపై మామూలు కారులా రయ్యిమని దూసుకుపోవటం, గాలిలో ప్రైవేట్ ప్లేన్‌లా జయ్యిమని ఎగిరిపోవటం ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత. ఇప్పటికే టెర్రాఫుజియా ట్రాన్సిషన్, పాల్-వి అనే ఫ్లయింగ్ కార్లను మనం చూశాం. తాజాగా వచ్చిన ఈ ఏరోమొబిల్ 2.5 సమీప భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
ఏరోమొబిల్ 2.5 ఫ్లయింగ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టెర్రాఫుజియా ట్రాన్సిషన్ ఇప్పటికే అభివృద్ధి దశకు చేరుకుంది. అయితే, ఈ ఏరోమొబిల్ 2.5 మాత్రం ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది. గడచిన 20 ఏళ్ల సమయంలో అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్లలో ఇది మూడవది కావటం విశేషం.

ఏరోమొబిల్ కో-ఫౌండర్, ఛీఫ్ డిజైనర్ స్టీఫెన్ క్లీన్ వాస్తవానికి 1990లో ఈ ఫ్లయింగ్ కారు డిజైన్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కారు డిజైన్‌ను అనేక సార్లు మార్చారు.

మీరు గమనిస్తే, ఏరోమొబిల్ 2.5 ఫ్లయింగ్ కారు, హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే గ్రహాంతర వాసుల వాహనం మాదిరిగా అనిపిస్తుంది. కారులో భాగంగా వెనక్కు మడుచుకొని ఉండే రెక్కలు, విచిత్రమైన డిజైన్‌తో ఇది విశిష్టమైన లుక్‌ని కలిగి ఉంటుంది.

ఏరోమొబిల్ 2.5 ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. నాలుగు చక్రాలు కలిగిన ఈ వాహనంలో వెనుక చక్రాలు బ్యాలెన్సింగ్ కోసం సహకరిస్తాయి, ముందు చక్రాలు ఇంజన్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.

ఏరోమొబైల్ 2.5 క్యాబిన్/కాక్‌పిట్‌లో రెండు సీట్లు ఉంటాయి. ఇందులో ఒకటి డ్రైవర్/పైలట్ కోసం మరొకటి ప్యాసింజ్/కోపైలట్ కోసం.

ఈ ఫ్లయింగ్ కారులో రెండు స్టీరింగ్ వీల్స్ ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఇందులో పెద్ద స్టీరింగ్‌ను రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఉపయోగించాలి, దానిపై ఉండే చిన్న స్టీరింగ్‌ను గాలిలో ఫ్లయింగ్ కారును కంట్రోల్ చేసేందుకు వినియోగించాలి.

ఏరోమొబిల్ 2.5 ఫ్లయింగ్ కారు ఫ్రేమ్‌ను స్టీల్‌తో తయారు చేశారు, దీని బాడీని కార్భన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు. ఫలితంగా దీని బరువు కేవలం450 కేజీలు మాత్రమే ఉంటుంది.

ఈ ఫ్లయింగ్ కారులో 100 హెచ్‌పి రోటాక్స్ 912 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను ఏరోమొబిల్ 2.5 వెనుక భాగంలో అమర్చారు.

వెనుక ఉండే ఇంజన్ శక్తి ఫ్లయింగ్ కారు మధ్య భాగంలో ఉండే షాఫ్ట్ ద్వారా ముందు చక్రాలకు సరఫరా అవుతుంది. గాలిలో ఎగిరేటప్పుడు ఈ ఇంజన్ శక్తి వెనుక ఉండే ప్రొపెల్లర్లకు బదిలీ అవుతుంది.

ఈ ఫ్లయింగ్ కారుకు సంబంధించిన ఖచ్ఛితమైన పెర్ఫామెన్స్ వివరాలను ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఇది గాలిలో గటంకు 200 కి.మీ. వేగంతోను అలాగే రోడ్డుపై గంటకు 160 కి.మీ. వేగంతోను పరుగులు తీస్తుందని సమాచారం.

గాలిలో ఏరోమొబిల్ 2.5 ద్వారా 700 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. అలాగే, రోడ్డుపై 500 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇది గాలిలో గంటకు 15 లీటర్ల ఇంధనాన్ని వినియోగించుకుంటుంది, రోడ్డుపై లీటరుకు 13.3 కి.మీ. మైలేజీనిస్తుంది.
ఏరోమొబిల్ 2.5 ఫ్లయింగ్ కార్ ఫస్ట్ ఫ్లైట్‌ను ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








