వరుసగా మూడోసారి ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్న వెటెల్
రెడ్‌బుల్ టీమ్ రేసర్ సెబాస్టియన్ వెటెల్, భారత్‌లో వరుసగా మూడోసారి ఫార్ములా వన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో ఆదివారం నాడు జరిగిన 2013 ఫార్ములా వన్ రేస్ ఇండియన్ గ్రాండ్ ప్రి ఫైనల్ టైటిల్‌ను జర్మనీకి చెందిన రెడ్‌బుల్ రేసర్ సెబాస్టియన్ వెటెల్ సొంతం చేసుకున్నాడు.
భారత్‌లో ఫార్ములా వన్ ప్రారంభమైనప్పటి నుంచి (2011 నుంచి) ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఈ టైటిల్ నెగ్గి వెటెల్ ‘హ్యాట్రిక్' నమోదు చేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లోను అలాగే క్వాలిఫయింగ్ సెషన్‌లో ఆధిపత్యంలో కొనసాగిన ఈ 26 ఏళ్ల ఈ ఎఫ్ డ్రైవర్ ప్రధాన రేసులోనూ తన సత్తా చూపించాడు. ఆద్యంతం ఆసక్తిభరితంగా సాగిన 2013 ఎయిర్‌టెల్ ఇండియన్ గ్రాండ్ ప్రిలో, 60 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ ఒక గంటా 31 నిమిషాల 12.187 సెకన్లలో పూర్తి చేశాడు.
మరిన్ని వివరాలను మరియు సెబాస్టియన్ విజయ విహారాన్ని క్రింది ఫోటో ఫీచర్‌లో పరిశీలించండి.

టాప్ 5 రేసర్స్
ఈ రేస్‌లో ద్వితీయ స్థానంలో నిలిచిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) కంటే వెటెల్ 29.8 సెకన్లు ముందుగానే లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. కాగా.. 11వ స్థానం నుంచి రేస్‌ను మొదలు పెట్టిన లోటస్ డ్రైవర్ రొమైన్ గ్రాస్‌జీన్ అనూహ్యమైన వేగాన్ని అందుకొని, తృతీయ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఫెరారీ డ్రైవర్ ఫెలిప్ మసా (4వ స్థానం) , మెక్‌లారెన్ డ్రైవర్ పెరెజ్ (5వ స్థానం)లో నిలిచారు.

హ్యాట్రిక్ విజయం
సెబాస్టియన్ వెటెల్ 2011, 2012 సంవత్సరాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిలో రేసులలో కూడా విజేతగా నిలిచాడు. తాజా విజయంతో వెటెల్ ఈ సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే అధికారికంగా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు.

ఈ సీజన్‌లో ఆరవ విజయం
సెబాస్టియన్ వెటెల్‌కు ఇది ఈ సీజన్‌లో వరుసగా ఆరవ విజయం కావటం విశేషం. అలాగే మొత్తమ్మీద చూసుకుంటే, ఇది అతనికి 10వ విజయం. ఇండియన్ గ్రాండ్ ప్రికి ముందు బెల్జియం, ఇటలీ, సింగపూర్, కొరియా, జపాన్ గ్రాండ్ ప్రిలలో కూడా వెటెల్ అగ్రస్థానాన్ని సంపాదించాడు.

కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్
క్వాలిఫయింగ్ రేసులో నాలుగో స్థానంలో నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ మార్క్ వెబర్ వాహనం గేర్ సమస్యతో నిలిచిపోవడంతో, అతను 39వ ల్యాప్‌లోనే వైదొలిగినప్పటికీ, వెటెల్ తిరుగులేని ప్రదర్శనతో రెడ్‌బుల్ జట్టుకు వరుసగా నాలుగో ఏడాది కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది.

మరో మైలురాయి
ఒకే సీజన్‌లో వరుసగా 6 అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన నాలుగో ఫార్ములా వన్ డ్రైవర్‌గా కూడా వెటెల్ గుర్తింపు దక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డును అస్కారి (వరుసగా 9 రేసులు), మైఖేల్ షుమాకర్, జిమ్ క్లార్క్ (7 రేసులు)లు స్థాపించారు.

322 పాయింట్స్
ఈ సీజన్‌లో మొత్తం 19 రేస్‍లకు గాను 16 రేస్‌లు పూర్తయ్యాయి. ఇందులో సెబాస్టియన్ వెటెల్ 10 రేస్‌లలో విజయం దక్కించుకొని, మొత్తం 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో 207 పాయింట్లతో అలోన్సో. ఈ సీజన్‌లోని తర్వాతి రేస్ అయిన అబుదాబి గ్రాండ్ ప్రి నవంబర్ 3, 2013న జరగనుంది.

సహారా ఫోర్స్ ఇండియాకు గుడ్ టైమ్
మనదేశానికి చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా' జట్టు ఈ రేస్‌లో విజయం సాధించకపోయినప్పటికీ, ఇది ఓ రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ జట్టుకు చెందిన ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి తమ ఖాతాలో పాయింట్లు దక్కించుకున్నారు. పాల్ డి రెస్టా ఎనిమిదో స్థానంలో నిలవగా అడ్రియన్ సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.
వీడియో
విజయానంతరం సెబాస్టియన్ వెటెల్ తన ఫార్ములా వన్ కారుతో రేస్ ట్రాక్‌పై చక్కర్లు కొట్టించి మరీ తన సంతోషాన్ని తెలియజేశాడు. ఆ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








