ఆగస్ట్ 11న సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20లో 'ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) పేరిట ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసినదే. కంపెనీ ఇటీవలే తమ కొత్త ఎలైట్ ఐ20కి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.

తాజా అప్‌డేట్ ప్రకారం.. తమ సరికొత్త ఎలైట్ ఐ20 కారును ఆగస్ట్ 11, 2014వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్, డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్ వద్ద ఉన్న హోటల్ తాజ్ ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో ఈ కారును విడుదల చేయనున్నట్లు హోండా మోటార్ ఇండియా మీడియా ఆహ్వానాలు పంపింది.

Hyundai Elite i20 Launch

కాగా.. కొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారు కోసం డీలర్లు ఆగస్ట్ 1, 2014వ తేది నుంచి బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. ఈ కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు.

ప్రస్తుత తరం ఐ20తో పోల్చుకుంటే ఈ కొత్త తరం ఎలైట్ ఐ20 డిజైన్ పూర్తిగా సరికొత్తగా కనిపిస్తుంది. ఈ కొత్త ఎలైట్ ఐ20 ముందు వైపు కొత్త హ్యుందాయ్ కంపెనీ సిగ్నేచర్ హెక్సాగనల్ గ్రిల్, మందపాటి థిన్ హారిజాంటల్ స్ట్రిప్, వ్రాప్ అరౌండ్ విండో, బూమర్యాంగ్ షేప్డ్ టెయిల్ లైట్స్‌తో ఇది రిఫ్రెష్డ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే, ఇంకో పది రోజుల వరకు ఆగాల్సిందే.

More from DriveSpark

Article Published On: Monday, August 4, 2014, 10:17 [IST]
English summary
Hyundai Motor has revealed design renderings of All-New “The Elite i20”, which was designed at Hyundai Motor’s Design Centre Europe in Rüsselsheim, Germany. Hyundai will launch the All- New ‘Elite i20’ on Monday, 11th August 2014 at the Hotel Taj Palace in Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+