సరికొత్త 2014 మహీంద్రా స్కార్పియో విడుదల; ధర రూ.7.98 లక్షలు

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు (సెప్టెంబర్ 25, 2014) మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ స్కార్పియో బేసిక్ షేపును అలానే ఉంచుతూ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మరియు ఇంజన్ ఆప్షన్లలో అనేక మార్పులు చేర్పులు చేసింది.

కొత్త తరం మహీంద్రా స్కార్పియోను సరికొత్త ఛాస్సిస్‌పై తయారు చేశారు. హైడ్రోఫార్మింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ ఛాస్సిస్‌ను తయారు చేశారు, ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ ఛాస్సిస్ కన్నా ధృడంగా ఉంటుంది. ఈ కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.

న్యూ జనరేషన్ మహీంద్రా స్కార్పియో ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తదితర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

న్యూ జనరేషన్ మహీంద్రా స్కార్పియోకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

కొత్త 2014 మహీంద్రా స్కార్పియో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఎస్4, ఎస్10 వేరియంట్లు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తాయి.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చారు. రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, కొత్త ఫాగ్ ల్యాంప్స్ మొదలైన మార్పులను ఫ్రంట్ డిజైన్‌లో గమనించవచ్చు.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

వెనుక డిజైన్‌ను గమనిస్తే.. సరికొత్త రియర్ బంపర్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రియర్ డోర్, నెంబర్ ప్లేట్ చుట్టూ సిల్వర్ గార్నిష్ మొదలైన మార్పులు ఉన్నాయి.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

కొత్త స్కార్పియోని సైడ్ నుంచి చూస్తే, డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించవు. బ్లాక్ కలర్ స్కఫ్ ప్లేట్స్ (డోర్స్ క్రింది భాగంలో అమర్చినవి), కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

కొత్త మహీంద్రా స్కార్పియో ఇంటీరియర్స్‌లో కూడా అనేక మార్పులున్నాయి. ఇందులో ప్రధానంగా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, కంట్రోల్ స్విచెస్ కలిగిన కొత్త స్టీరింగ్ వీల్, బీజ్ అండ్ బ్లూ సీట్స్ వంటి మార్పులను చెప్పుకోవచ్చు.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

ప్రతి డోరుపై పవర్ విండో స్విచ్, రియర్ ఏసి వెంట్స్, కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌తో దీనిని తయారు చేశారు.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

ఇంజన్ విషయానికి వస్తే.. ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్, మరొకటి 2.5 లీటర్ ఎమ్ఐ2డిఐసిఆర్ డీజిల్ ఇంజన్.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

ఇందులోని 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

ఇకపోతే బేస్ వేరియంట్ (ఎస్2) మహీంద్రా స్కార్పియోలో 2.5 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3200 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పిల శక్తిని, 1400-2200 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం ఎస్2 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

ఈ ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. కంపెనీ ఈ గేర్‌బాక్స్ పనితీరును మరింత మెరుగు పరిచింది.

2014 మహీంద్రా స్కార్పియో విడుదల

ఫోర్ వీల్ డ్రైవ్ స్కార్పియో వేరియంట్లలో (ఎస్4, ఎస్10) షిఫ్ట్-ఆన్-ఫ్లై ఆప్షనల్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియో లీటరు డీజిల్‌కు 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

టైర్స్

టైర్స్

ఎస్2 వేరియంట్లో మాత్రం 215/75 R15 ట్యూబ్‌లెస్ రబ్బర్ టైర్లను ఆఫర్ చేస్తున్నారు. మిగిలిన వేరియంట్లను 235/65 R17 ట్యూబ్‌లెస్ రేడియల్ టైర్లతో ఆఫర్ చేస్తున్నారు.

సస్పెన్షన్

సస్పెన్షన్

స్కార్పియోలో కొత్త కుషన్ సస్పెన్షన్ టెక్నాలజీని ఉపయోగించారు, దీని వలన ఈ కారులో ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది. ముందు వైపు డబుల్ విష్-బోన్ టైప్ ఇండిపెండెంట్ ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను, వెనుక వైపు మల్టీ లింక్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ విత్ యాంటీ-రోల్ బార్‌ను ఉపయోగించారు.

బ్రేక్స్

బ్రేక్స్

బ్రేక్స్ విషయానికి వస్తే.. ముందు వైపు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు డ్రమ్ టైప్ డిస్క్ బ్రేక్స్ ఉపయోగించారు. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్) సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

కొలతలు

కొలతలు

కొత్త మహీంద్రా స్కార్పియో 4456 మి.మీ. పొడవును, 1820 మి.మీ. వెడల్పును, 1930 మి.మీ. (ఎస్2 వేరియంట్) మరియు 1995 మి.మీ. (ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8, ఎస్10 వేరియంట్స్) ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2680 మి.మీ. టర్నింగ్ రేడియస్ 5.4 మీటర్లు (టూ వీల్ డ్రైవ్), 5.65 మీటర్లు (ఫోర్ వీల్ డ్రైవ్). ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

కొత్త 2014 మహీంద్రా స్కార్పియో డైమండ్ వైట్, ఫైరీ బ్లాక్, మిస్ట్ సిల్వర్, మోల్టెన్ రెడ్, రీగల్ బ్లూ అనే ఐదు ఆకర్షనీయమై రంగులలో లభ్యం కానుంది.

ధరలు

ధరలు

స్కార్పియో ఎస్2 - రూ.7.98 లక్షలు

స్కార్పియో ఎస్4 - రూ.8.60 లక్షలు

స్కార్పియో ఎస్4 - రూ.9.72 లక్షలు (4-వీల్ డ్రైవ్)

స్కార్పియో ఎస్6 - రూ.9.77 లక్షలు

స్కార్పియో ఎస్6 ప్లస్ - రూ.10.05 లక్షలు

స్కార్పియో ఎస్8 - రూ.10.84 లక్షలు

స్కార్పియో ఎస్10 - రూ.11.46 లక్షలు

స్కార్పియో ఎస్10 - రూ.11.46 లక్షలు (4-వీల్ డ్రైవ్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

More from DriveSpark

Article Published On: Thursday, September 25, 2014, 15:53 [IST]
English summary
Country's largest utility vehicle manufacturer Mahindra has launched the much-awaited new Scorpio in India starting at Rs 7.98 lakh (ex-showroom, Mumbai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+