కళ్యాణి మోటార్స్ నుంచి సరికొత్త 'స్విఫ్ట్ ప్లాటినం ఎడిషన్'
బెంగుళూరు: మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రియులకు ఓ ఆకర్షనీయమైన వేరియంట్‌ను ఆఫర్ చేస్తోంది బెంగుళూరుకు చెందిన మారుతి సుజికి అధీకృత డీలర్‌షిప్ 'కళ్యాణి మోటార్స్'. కర్ణాటకలో అత్యంత పాపులర్ అండ్ ట్రస్టెడ్ మారుతి సుజుకి డీలర్‌షిప్ అయిన కళ్యాణి మోటార్స్ 'కళ్యాణి ప్లాటినం ఎడిషన్' పేరిట ఓ అధునాత స్విఫ్ట్ కారును విక్రయిస్తోంది.
ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు కంపెనీ ఆఫర్ చేస్తున్న స్పెషల్ ఎడిషన్‌గా అనిపించడం లేదు. ఇది ప్రత్యేకించి డీలర్ స్పెసిఫిక్ స్విఫ్ట్ కారుగా తెలుస్తోంది. కళ్యాణి మోటార్స్ డీలర్‌షిప్ ఈ స్విఫ్ట్ కారును ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి కొనుగోలుదారులకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. 'కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్' కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారును వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఆఫర్ చేస్తున్నారు.

ఈ కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారు పైభాగం మొత్తం నలుపు రంగులో పెయింట్ చేయబడి ఉంటుంది (బి పిల్లర్ కూడా).

కళ్యాణి మోటార్స్ ఆఫర్ చేస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ కారులోని మెష్ టైప్ ఫ్రంట్ గ్రిల్ ప్రత్యేకంగా అనిపిస్తుంది.

కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారులో ఆడి కార్లను తలపించే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ సరికొత్త కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారులో ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌లైట్లను ఉపయోగించారు.

కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారులోని సైడ్ మిర్రర్స్ డ్యూయెల్ టోన్ ఆప్షన్‌తో (బ్లాక్ అండ్ వైట్) ఉంటాయి. వీటిపై టర్న్ ఇండికేటర్లు ఉంటాయి.

కళ్యాణి మోటార్స్ ఆఫర్ చేస్తున్న ఈ ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారులో ఫ్రంట్ బ్లాక్ బంపర్ కొత్తగా ఉంటుంది.

ఈ కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారులో ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఆకట్టుకుంటాయి.

వెనుక వైపు బ్లాక్ అండ్ వైట్ రూఫ్ స్పాయిలర్, అలాగే బ్లాక్ అండ్ వైట్ బంపర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ కళ్యాణి ప్లాటినం ఎడిషన్ స్విఫ్ట్ కారు ఇంటీరియర్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ తెలియాల్సి ఉంది. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం బెంగుళూరులోని అధీకృత కళ్యాణి మోటార్స్‌ను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








