రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో మోడళ్లలో ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్స్

By Ravi

ఎస్‌యూవీ ప్రియులు తమ వాహన కొనుగోలు విషయంలో అన్ని ఫీచర్లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. వాస్తవానికి ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండే ఎస్‌యూవీలను నడపటంలో ఎంతో ఫన్ ఉంటుంది. రెగ్యులర్ టూ-వీల్ (4x2) డ్రైవ్ కార్లలో ఇంజన్ నుంచి వచ్చే శక్తి ముందు చక్రాలకు కానీ లేదా వెనుక చక్రాలకు (సూపర్ కార్లలో) కానీ బదిలీ అవుతుంటుంది. కానీ ఫోర్-వీల్ (4x2) డ్రైవ్ కార్లలో ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది.

సరే, ఈ విషయం అటుంచితే.. ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న రెనో డస్టర్, నిస్సాన్ టెర్రాన్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇవి కేవలం టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యూవీలో ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంటే, నిస్సాన్ ఇండియా తమ టెర్రానో ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను ఆఫర్ చేయాలని యోచిస్తోంది.


టూ-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే ఫోర్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలు కాస్తంత ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఇవి హెవీగా ఉండి, మైలేజ్ కూడా తగ్గుతుంది. నిజానికి మన దేశంలో ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ కోరుకునే వారి శాతం చాలా తక్కువే. అందుకే, కొనుగోలుదారులు ఈ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. ఏదేమైనప్పటికీ, రెనో - నిస్సాన్ అలయన్స్ మాత్రం తమ డస్టర్, టెర్రానో ఎస్‌యూవీలలో ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్ రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీలు మార్కెట్లోకి రావచ్చని అంచనా. అయితే, ఈ కొత్త రెనో డస్టర్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను మాత్రం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ మోడల్‌ను ఆధారంగా చేసుకొనే తయారు చేయనున్నారు. ఫేస్‌లిఫ్ట్ రావటానికి మరో ఏడాది సమయం పట్టే ఆస్కారం ఉంది. డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్, టెర్రాన్ ఎక్స్‌వి డీజిల్ వేరియంట్లలో మాత్రమే ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లను విడుదల చేసే అవకాశం ఉంది.

Nissan Terrano

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫ్రంట్ వీల్ డ్రైవ్ డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ ధర రూ.12.67 లక్షలు మరియు టెర్రాన్ ఎక్స్‌వి ధర రూ.12.78 లక్షలుగా ఉన్నాయి. కాగా.. వీటి ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్ల ధరలు దీని కన్నా రూ.70,000 నుంచి రూ.1 లక్ష వరకు అదనంగా ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2014, 15:10 [IST]
English summary
All wheel drive is one of the most desired feature among SUV buyers. Yet, most compact SUV manufacturers these days shy away from offering 4X4 variants of their products. Renault Duster, Nissan Terrano and Ford EcoSport are all examples of these.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+