ఫియట్ అవెంచురా గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలు, క్రాసోవర్లకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసినదే. ఈ సెగ్మెంట్లోని అవకాశాలను దక్కించుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, మరికొన్ని కంపెనీ ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫియట్ ఇండియా కూడా ఇదే కోవలో తమ క్రాసోవర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇటలీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియా ఈ ఏడాది ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura) క్రాసోవర్‌ను కంపెనీ త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అవెంచురా క్రాసోవర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కంపెనీ వెల్లడి చేసింది.
ఫియట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కంపెనీ తమ అవెంచురా క్రాసోవర్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లను తెలియజేసింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫియట్ అవెంచురా క్రాసోవర్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసిన పుంటో ఇవో ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. దీని విశిష్టతలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

హై గ్రౌండ్ క్లియరెన్స్, అల్లాయ్ వీల్స్
బెటర్ ఆఫ్-రోడ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఫియట్ అవెంచురా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇది కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది.

ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్
ఫియట్ అవెంచురాలోని ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ మరో అదనపు ఆకర్షణ. వీటిపై సైకిల్స్, సర్ఫ్ బోర్డ్స్, ర్యాఫ్ట్స్, క్యాంప్ కిట్స్ మొదలైన వాటిని స్టోర్/ఫిక్స్ చేసుకోవచ్చు. అడ్వెంజర్లంటే ఇష్టపడే వారికి ఇవి చక్కగా ఉపయోగపడుతాయి.

స్పేర్ వీల్, డబుల్ ఫోల్డింగ్ సీట్స్
ఫియట్ అవెంచురా క్రాసోవర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా స్పేర్ వీల్‌ను వెనుక (బూట్) డోర్‌కు కాకుండా, వెనుక బంపర్‌కు అమర్చిన ఓ ప్రత్యేకమైన సిస్టమ్ ద్వారా అమర్చబడి ఉంటుంది. చూడటానికి ఇది బూట్ డోర్‌కు అమరి ఉన్నట్లే అనిపిస్తుంది. ఇందులోని వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో రెండు సార్లు (డబుల్ ఫోల్డ్) మడుచుకొని అదనపు లగేజ్ స్పేస్ పొందవచ్చు.

ఇంటీరియర్స్
ఫియట్ అవెంచురా సరికొత్త మోడ్రన్ ఇంటీరియర్ స్టైల్‌ను కలిగి ఉంటుంది.

హై టెర్రైన్ గేజెస్
ఫియట్ అవెంచురా క్రాసోవర్‌లో సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా హై టెర్రైన్ గేజెస్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కారు వెళ్లే దిశను, కోణాన్ని మొదలైన సమాచారాన్ని తెలియజేస్తుంది.

మరిన్ని ఫీచర్లు
కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, ఫ్లాట్ బానెట్, రివైజ్డ్ ఎయిర్‌డ్యామ్స్, మెటల్ స్కిడ్ గార్డ్ వంటి ఫీచర్లతో సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫియట్ అవెంచురా వెనుక డిజైన్‌ను గమనిస్తే, సరికొత్త డిజైన్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్, స్ప్లిట్ సైలెన్సర్ వంటి ఫీచర్లు చూపరులను ఆకట్టుకుంటాయి.

విడుదల సమయం
ఫియట్ ఇండియా తమ అవెంచురా క్రాసోవర్‌ను అక్టోబర్ 2014 నాటికి మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..
ఫియట్ అవెంచురా క్రాసోవర్ ఇంజన్ పెర్ఫార్మెన్స్, మైలేజ్, ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications